STORYMIRROR

vinaykumar patakala

Comedy Romance Action

4  

vinaykumar patakala

Comedy Romance Action

ప్రేమ కావాలి........పార్ట్ 1

ప్రేమ కావాలి........పార్ట్ 1

7 mins
360

హాస్పిటల్ బెడ్ పైన కోమాలో వున్న వినయ్ సరిగా నెల రోజుల తరువాత కోమా నుండి బయటకి వచ్చాడు.


వినయ్ నెమ్మదిగా తన కనులను తెరవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఎందుకో అతని ఎడమ కన్ను మాత్రమే తెరుచుకొని చూస్తుంది మరో కన్ను తెరవటానికి రావట్లేదు.


అదేంటి అని తన ఎడమ చేయితో స్పర్శించి చూసేలోపు తన ఎడమ చెయ్యి చిన్నగా మారిపోయింది. పైగా దానికి బండైడ్ కట్టి సెలైన్ ఇంజక్షన్ వేసి వున్నాయి. తన కుడి చెయ్యి వైపుకి చూస్తే దానికి కూడా కట్టు కట్టి వుంది లేవడానికి ప్రయత్నిస్తుండగా అతని నడుము లేవడానికి సహాయం చెయ్యట్లేదు. అతి కష్టం మీద లేచి తన కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నించాడు. తను తన ఒంటి మీద వున్న దుప్పటిని తీసేసి తన రెండు కాళ్ళ మీద నిల్చున్న వెంటనే అదుపు తప్పి కింద పడిపోయాడు అదేంటి అని చూస్తే అతని రెండు అరికాళ్ళు కట్ చేసి వున్నాయి. అతను నిల్చున్న అరికాళ్లకు కట్టే కట్టి వుంది దాని వల్ల అతనికి వున్నట్లుండి ఒక్కసారిగా తట్టుకోలేనంత నొప్పి పుట్టింది.


అది ఎంతగా నొప్పి పుట్టింది అంటే మొత్తం హాస్పిటల్ అంత దద్దరిల్లిపోయింది అతని అరుపులకి.


అతని అరుపులు విన్న కంపౌండర్ వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి


కంపౌండర్ : డాక్టర్...డాక్టర్ ఆ 317 ICU లో వున్న పేషెంట్ కి స్పృహ వచ్చింది డాక్టర్.


డాక్టర్ : what...what are you saying nurse... ఆ.. పేషెంట్ కి స్పృహ రావడం ఏంటి అతను కోమాలో ఉన్నాడుగా... ఇప్పుడు ఇంత త్వరగా స్పృహలోకి రావడం ఏంటి ఆశ్చర్యంగా వుందే ఇదంతా....


కంపౌండర్ : మాకు తెలియదు డాక్టర్ కానీ అతను మాత్రం చాలా చాలా కోపంలో వున్నాడు... అడ్డు ఎవ్వరు వచ్చిన వాళ్ళని చంపేట్టు వున్నాడు సార్ అతను.


డాక్టర్ : మరి రాదా ఏంటి.... ఏ తప్పు చేయకుండానే అతని మీద అంత పెద్ద నింద వేసి అన్యాయంగా అతని జీవితాన్ని పాడు చేస్తే కోపం రాక ప్రేమ వస్తుందా ఏంటి.... ముందు అయితే వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి చెప్పు అలాగే డాక్టర్ రమ్యని కూడా రమ్మని చెప్పు 


కంపౌండర్ : ఒకే డాక్టర్...,


కంపౌండర్ వెంటనే వినయ్ వాళ్ళ ఇంటికి కాల్ చేసి మీ అబ్బాయి కోమా నుంచి బయటకి వచ్చాడు మేడం అని వినయ్ వాళ్ళ కుటుంబానికి ఈ విషయం చెప్పి డాక్టర్ రమ్యకి కూడా కాల్ చేసి 


కంపౌండర్ :హలో మేడం నేను శైలజ కంపౌండర్ ని మాట్లాడుతున్నాను మేడం ఇక్కడ ఒక పేషెంట్ కి ప్రాబ్లెమ్ వచ్చింది మేడం మీరు తొందరగా రావాలి మేడం...అని చెప్తుండగా ఆ లోపే 


అక్కడ నుంచి హలో మేడం రమ్య మేడంని కాదు వాళ్ళింట్లో పని చేసే సర్వెంట్ నీ మాట్లాడుతున్నాను.


కంపౌండర్ : ohh అవునా... రమ్య మేడం గారు లేరా అర్జెంటుగా మాట్లాడాలి....


సర్వెంట్ : రమ్య మేడం గారు ప్రస్తుతానికి హోమంలో వున్నారు మేడం.... ఈ రోజు లలిత దేవి పెద్ద మేడం గారు రమ్య మేడం పేరు మీద హోమం చేయిస్తున్నారు.


కంపౌండర్ : ohh అవునా... నాకు తెలియదు..!


అప్పుడే రమ్య వాళ్ళ అమ్మ జయంతి గారు వచ్చి


జయంతి రమ్య వాళ్ళ అమ్మ: ఏయ్ ఎవ్వరితో మాట్లాడుతున్నావ్ ఫోన్లో...?


సర్వెంట్ : ఆ మేడం హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం రమ్య మేడం కి ఏదో అర్జెంట్ అంటా అందుకే కాల్ వచ్చింది.


జయంతి : ఒకే ఒకే ముందు ఫోన్ పక్కన పెట్టేసి స్వామిగారికి పువ్వులు కావాలి అంట వెళ్లి ఇచ్చేసి రాపో..


సర్వెంట్ : అలాగే మేడం....


హాస్పిటల్ లో వినయ్ మరింత అదుపు తప్పడంతో డాక్టర్ చంద్రమనోహర్ ఏం అయ్యింది డాక్టర్ రమ్య ఇంకా రాలేదా అక్కడ పేషెంట్ మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు లేట్ అయితే అతని ప్రాణాలకే ప్రమాదం అని సీరియస్ గా అడగడంతో 


కంపౌండర్ జరిగిన సంఘటనను వివరంగా వివరించడంతో అది అర్ధం చేసుకున్న డాక్టర్ చంద్రమనోహర్ స్వయంగా డాక్టర్ రమ్యకి కాల్ చేసాడు.


రింగ్..రింగ్......రింగ్రింగ్...


డాక్టర్ చంద్రమనోహర్ : హల్లో నేను డాక్టర్ చంద్రమనోహర్ ని మాట్లాడుతున్నాను మే ఐ స్పీక్ విత్ డాక్టర్ రమ్య ప్లీజ్ ....? అనడంతో..


ఓహ్ హెల్లో డాక్టర్ చంద్రమనోహర్ గారు ఎలా వున్నారు నేను రమ్య వాళ్ళ నాన్న జగదీశ్ వర్మని మాట్లాడుతున్నాను అని చెప్పగా 


డాక్టర్ చంద్రమనోహర్ : ఓహ్ హెల్లో...నమస్తే సార్ మేము బాగున్నాము మీరు ఎలా వున్నారు...,ఇంట్లో వాళ్లంతా ఎలా వున్నారు సార్....అంత క్షేమంగా వున్నారుగా.

జగదీశ్ వర్మ : హాన్ హాన్ ఇక్కడ అందరం బాగున్నాము...అక్కడ హాస్పిటల్ లో అందరు ఎలా వున్నారు అంతా ఒకే కదా. ఏమైనా ప్రోబ్లమా ఎంటి...!కాల్ చేశారు.


డాక్టర్ చంద్రమనోహర్: ఆ సార్ డోంట్ వర్రీ సార్ ఇక్కడ అంతా ఒకే జస్ట్ రమ్య మేడంతో కాస్త మాట్లాడుదాం అని కాల్ చేసాను అంతే....


జగదీశ్ వర్మ: ఓహ్ అవునా ఒకే ఒకే అమ్మాయి హోమంలో కూర్చుంది లేపకూడదు.


డాక్టర్ చంద్రమనోహర్ : జస్ట్ ఒక రెండు నిముషాలు చాలు సార్ అంతే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసాడు...?


జగదీశ్ వర్మ : ఒకే కాస్త లైన్లో వుండండి ఫోన్ ఇస్తాను..


డాక్టర్ చంద్రమనోహర్ : ఒకే సార్....


వేద పండితుల మధ్య పెద్ద పెద్ద పీఠాధిపతుల సమక్షంలో రమ్య హోమం ముందు కూర్చుని పూజ చేస్తుంది.


పండితులు పీఠాధిపతులు : అమ్మాయి రమ్య ఇప్పుడు ఈ టెంకాయిని తీసుకొని నీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని కోరిక కోరుకో అమ్మ అని అన్నారు.


రమ్య : అలాగే పూజారి గారు .


రమ్య మనసులో : భగవంతుడా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని ఏమి కోరలేదు అందరు బాగుండాలి అని తప్ప. కానీ ఈరోజు ఎందుకో పెద్దమ్మ హోమం చేయమని చెప్పింది. అందుకే నానమ్మ ఈ గురువు గారితో మాట్లాడి హోమం ఏర్పాటు చేయించింది.  కానీ నాకు ఇంకా అర్ధం కావట్లేదు ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఉదయం నుంచి నా మనసుకి ఎందుకో ఎదో తెలియని భయం కలిగిస్తుంది. ఎవరి తెలియదు కానీ ఎవరో బాధలో వున్నారు అని మాత్రం బాగా తెలుస్తుంది. అది ఎవ్వరు, ఎక్కడ ,అతనికి నాకు మధ్య వున్న సంబంధం ఏంటో కూడా తెలియదు కానీ ఒకటి మాత్రం బాగా తెలుసు అతను ఎదో బాధతో బాధ పడుతున్నాడు ఏదో సమస్యలో వున్నాడు అని మాత్రం తెలుసు అతను ఎవరో ఎలా ఉంటాడో తెలియని నేను అతను క్షేమంగా పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అతను సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దయచేసి నా ఈ మొట్టమొదటి కోరికని నెరవేర్చరా స్వామి అని ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించుకొని కోరుకుంది.


అప్పుడే హోమం మధ్యలోకి వచ్చింది. ఇంతలో పెద్ద గురువు గారు మరియు పెద్ద పెద్ద శక్తి పీఠాధిపతులు అందరూ కలిసి ఒక శక్తివంతమైన ఒక కంకణాన్ని తయారుచేసి రమ్య చేతికి తొడుగుతూ..


పీఠాధిపతి : చూడు అమ్మ ఇది చాలా ముఖ్యమైన కంకణం ఎట్టి పరిస్థితిలో దీనిని మాత్రం నీ నుండి దూరం చేసుకోకు ఇది నిన్ను అన్ని వేళలో రక్షిస్తుంది నేను చెప్పేది నీకు అర్థమైందా అమ్మ అని అడిగాడు.


రమ్య : హాన్ అర్ధమైంది పీఠాధిపతిగారు...


అదే సమయంలో రమ్య వాళ్ళ నాన్న గారు వచ్చి.


జగదీశ్ వర్మ : అమ్మ స్వీటీ...!


రమ్య : హాన్ చెప్పండి నాన్న .


జగదీశ్ వర్మ : నీకు ఎదో కాల్ వచ్చింది అమ్మ.


రమ్య : అవునా ఇంతకీ ఎవరు నాన్న.


జగదీశ్ వర్మ : డాక్టర్ చంద్రమనోహర్ కాల్ చేసాడు అమ్మ ఏదో మాట్లాడాలి అంట నీతో.


రమ్య : అవునా ఇటివ్వండి నాన్న అని ఫోన్ తీసుకొని హెల్లో..హలో...డాక్టర్ చంద్రమనోహర్ సార్ మిమ్మల్నే ఉన్నారా హలో... హలో అని అంటుండగానే కాల్ కట్ అయిపోయింది.


జగదీశ్ వర్మ : ఏమైంది అమ్మ...?


రమ్య : తెలియదు నాన్న కాల్ కట్ అయిపోయింది.


కాల్ కట్ అవ్వడంతో రమ్య మళ్లీ డాక్టర్ చంద్రమనోహర్ కి కాల్ చేయడానికి ప్రయత్నించింది కానీ కాల్ కనెక్ట్ అవ్వలేదు సరే ఇక ఫోన్ పక్కన పెట్టేసి హోమంలో ధ్యానం పెడుతుండగా అప్పుడే మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది అది చూసిన జగదీశ్...


జగదీష్ వర్మ : ఇప్పుడు ఎవరమ్మా ఫోన్ చేసింది,


రమ్య : హాస్పిటల్ నుండి డాక్టర్ చంద్రమనోహర్ కాల్ చేస్తున్నారు నాన్న.


జగదీశ్ వర్మ : అవునా విషయం ఏంటో కనుక్కో అని అన్నారు.


రమ్య : అలాగే నాన్న అని కాల్ రిసీవ్ చేసి.


హలో డాక్టర్ చంద్రమనోహర్ సార్ చెప్పండి ఏంటి విశేషం. హాస్పిటల్ లో అంత ఒకే కదా. ఏమైనా ప్రాబ్లెమ్ వచ్చిందా ఏంటి అని అడిగేసరికి.


డాక్టర్ చంద్రమనోహార్కి ఏం చెప్పాలో తెలియక తడపడుతూ.


డాక్టర్ చంద్రమనోహర్ : అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్ధం కావట్లేదు ఇలా నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని అస్సలు అనుకోలేదు కానీ ఇక్కడ పరిస్థితి కాస్త ప్రమాదంగా వుంది అందుకే నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమో అని కాల్ చేసాను రమ్య.


రమ్య : ఏమైంది డాక్టర్ అస్సలు ప్రాబ్లెమ్ ఏంటి కాస్త డిటైల్ గా చెప్పండి అని అడగడంతో.


డాక్టర్ చంద్రమనోహర్ జరిగిందంతా రమ్యకి క్లియర్ గా చెప్పడంతో 


అది విన్న రమ్య షాక్ తో..


రమ్య : OMG.... ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నిజంగా నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది.


డాక్టర్ చంద్రమనోహర్ : అవును రమ్య ఇక్కడ అతను ఒక రాక్షసుడిలా మారిపోతున్నాడు ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు అందుకే నీకు కాల్ చేసాను.


రమ్య : డోంట్ వర్రీ సార్ నేను వస్తున్నాను.


డాక్టర్ చంద్రమనోహర్: కానీ నువ్వేదో హోమంలో వున్నావని విన్నాను.


రమ్య : ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు సార్ మనకి. యాస్ ఏ డాక్టర్ గా ప్రాణాలను కాపాడటమే మన మొదటి కర్తవ్యం అని చెప్పి కాల్ కట్ చేసింది.


అదే సమయంలో పీఠాధిపతులు కలిసి రక్ష మంత్రాలు చదువుతూ తన చేతికి ఆ మహిమగల కంకణం కడుతుండగా అదే సమయంలో రమ్య కాల్ కట్ చేసి హడావిడిగా హోమం నుండి లేచి హాస్పిటల్ కి బయలుదేరింది.


అంతలో ఆగమ్మ ఏంటి నువ్వు చేసేది ఇలా హోమం మధ్యలో లేవడం మంచిది కాదు. హోమం పూర్తి అయ్యాకే లేవాలి అప్పటిదాకా లేవకూడదు తల్లి.


రమ్య : నిజమే పీఠాధిపతి గారు కానీ అక్కడ ఒక ప్రాణం విలవిలా కొట్టుకుంతుంది ఈ సమయంలో ఆ ప్రాణానికి నా సహాయం చాలా చాలా అవసరం వుంది దయచేసి అర్ధం చేసుకోండి అని అంటుండగా.


జగదీశ్ వర్మ : అదెలా కుదురుతుంది అమ్మ స్వీటీ ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలా ఈ హోమం చేయించేదే నీకోసం అలాంటిది నువ్వే లేనప్పుడు ఇంకెవరి కోసం చేయించాలి ఈ హోమం అని కాస్త కోపంగా అన్నాడు.


రమ్య : అది కాదు నాన్న ప్లీజ్ అర్ధం చేసుకోండి ఈ హోమం ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడైనా చేయచ్చు కానీ అక్కడ ఒక ప్రాణం నాన్న ఆగుతుందా మీరే చెప్పండి. కాస్త ఆలస్యమైనా ప్రాణాలు పోతాయి నాన్న .


జగదీశ్ వర్మ : అయితే హాస్పిటల్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఇంకెవ్వరు లేరా డాక్టర్ చంద్రమనోహర్ నీ సీనియర్ డాక్టర్ పైగా ఆయన హెడ్ డాక్టర్ కదా ఆయనకి చేయడం రాదా.


రమ్య : నాన్న ఆయన వల్ల కావట్లేదు అనేగా నన్ను హెల్ప్ అడిగింది అని బాధతో అన్నది.


ఇంతలో ఏం జరుగుతుంది ఇక్కడ. హోమం ఎందుకు ఆగింది అని ఒక గొంతు వినపడింది.


ఎవ్వరు అని తిరిగి చూస్తే ఆవిడ ఎవరో కాదు రమ్య వాళ్ళ పెద్దమ్మ లలిత దేవి.


లలిత దేవి : ఏం జరుగుతుందో కాస్త చెప్తారా ఎవ్వరైనా.


అంతలో రమ్య వాళ్ళ మామయ్య పశుపతి వచ్చి.


పశుపతి మామయ్య : అదేం లేదు పెద్ద అక్క పాపం హాస్పిటల్ లో ఎవ్వరికో సీరియస్గా వుందంటా అందుకు హెల్ప్ కావలి అని కాల్ వస్తే రమ్య హోమం మధ్యలో లేచి వెళ్తాను అని ఒకటే పట్టుపడుతుంది. అంతే..


లలిత దేవి : నిన్ను అడిగానా పశుపతి...


పశుపతి మామయ్య : లేదక్కా.


లలిత దేవి : మరి నువ్వెందుకు అని నీ నోరు తెరుస్తున్నావు హాన్.


పశుపతి మామయ్య : సారీ పెద్ద అక్కయ్య.


లలిత దేవి : ఏంటి స్వీటీ ఇది హాన్ నీ కోసం అని ఇంత ముఖ్యమైన హోమం చేయిస్తుంటే నువ్వు ఇలా మధ్యలో లేచి వెళ్ళిపోతే ఎలా అమ్మ హాన్. నువ్వు క్షేమంగా బాగుండాలనే కదా రా తల్లి మేమంతా తపించేది ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఎలా అని బాధతో అడిగింది.


రమ్య : ఐయాం రియల్లీ సో సారీ పెద్దమ్మ కానీ నాకు వేరే దారి లేదు అందుకే వెళ్లాల్సి వస్తుంది. పైగా నేను ఒక డాక్టర్ ని పెద్దమ్మ అక్కడ ఒక ప్రాణం విలవిలలాడుతూ సహాయం కోసం కోరుకుంటుంటే ఇందంతా తెలిసి నేను ఇక్కడ ప్రశాంతంగా హోమం ఎలా చేయగలను చెప్పండి.


పైగా మీరే చిన్నప్పుడు అనేవారుగా పెద్దమ్మ మనవల్ల ఒకరికి సహాయం కలిగితే చాలా మంచింది అని..


పైగా మీరే చిన్నప్పుడు చెప్పేవారుగా మనకు సహాయం చేయగలిగే అవకాశం వుంది కూడా చేయకపోతే అది చాలా పెద్ద తప్పు ఒక హత్య చేసినంత నేరం అది, అలా చేయడం మానవ ధర్మం కాదు,


కుదిరితే మన నుండి వాళ్ళకి వీలైనంత సహాయం చేయాలి అంతే కానీ మనకు సహాయం చేసే అవకాశం వుండి కూడా చేయకపోతే అది చాలా పెద్ద నేరం అని.


ఇప్పుడు మీరే చెప్పండి నా చేతిలో ఆ అవకాశం ఉంది అతనికి సహాయం చేయడానికి కానీ మీరంతా వద్దు అని అంటున్నారు ఇప్పుడు మీరే చెప్పండి నా చేతిలో వున్న ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక ప్రాణాన్ని కాపాడాల లేక నా స్వార్ధం కోసం చేస్తున్న ఈ హోమంలో కూర్చొని అక్కడ అతని ప్రాణం తీసి ఒక హంతకురాలిగా మారాలా చెప్పండి పెద్దమ్మ.


లలిత దేవి రమ్య చెప్పిన మాటలకు మౌనంగా ఉండిపోయింది.


లలిత దేవి : ఏం చాముండి ఇదేనా నీ పెంపకం హాన్... అయినా అమ్మ స్థానంలో ఉంటే సరిపోదు అమ్మ అయితే అప్పుడు తెలిసేది.


రమ్య : ఇందులో అమ్మ తప్పేం లేదు పెద్దమ్మ ఈ నిర్ణయం తీసుకుంది నేను. దయచేసి నన్ను వెళ్లనివ్వండి పెద్దమ అని చేతులు జోడించి మరి వేడుకుంది.


లలిత దేవి : మరి నాన్నమ్మకి ఎవరు చెప్తారు ఏం అని చెప్తారు. ఇంకా నీకోసమే ప్రత్యేకంగా ఎంతో పెద్ద పెద్ద పీఠాధిపతులు, యోగులు, గురువులు వీళ్లందరితో పూజ చేయించి మరి తెచ్చిన మహిమగల ఆ కంకణంని కూడా నువ్వు ఇంకా ధరించలేదు అని కోపంగా చెప్పింది.


రమ్య : నాన్నమ్మకి తిరిగి వచ్చాక నేను చెప్తాను పెద్దమ్మ ఇక ఈ కంకణం గురించి అంటారా అది ఎక్కడైనా ఎప్పుడైనా కట్టుకోవచ్చుగా పెద్దమ్మ అని చెప్పి ఆ మహిమగల దివ్యమంగళమైన కంకణాన్ని తీసుకొని తన చేతికి వేసుకుంది.



    


        నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలో




Rate this content
Log in

Similar telugu story from Comedy