Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

పెసరట్టు బహురుచిహి..(మిథునం)

పెసరట్టు బహురుచిహి..(మిథునం)

1 min
706


బుచ్చీ! ఉప్మా పెసరట్టు తినాలని ఉందోయ్ అన్నాడు అప్పదాసు.


సరిపోయింది. ఇప్పుడే కదా అజీర్ణం చేసిందన్నారు. అప్పుడే ఆకలి గురించి ఆలోచనలా అంది బుచ్చి.


ఇవాళ మధ్యాహ్న భోజనం చేసినట్టే లేదు. చెట్టుకి చింత కాయలు ఎంత బాగున్నాయో. వీటిని పచ్చడి చేస్తాను అన్నాడు అప్పదాసు.


ఇంత వయసు వచ్చింది. చెప్పిన మాట వినడం నేర్చుకోలేదు. చిన్న పిల్లల్లా ఇప్పుడు చింతపండు పచ్చడి అంటారే అని బుచ్చి ఉప్మా చేయడం ప్రారంభించింది.


అప్పదాసు బాగా పండిన చింత కాయలు కోస్తూ ఉండగా ఉప్మా ఘుమఘుమలు అప్పదాసు ముక్కు పుటాలను తాకి అతను నిలుచున్న చోటి నుంచి పక్కకి తిరిగాడు. ఎత్తుగా ఉన్న బండ మీద ఎక్కి నిలుచుని ఉండడంతో కాలు కొద్దిగా జారి చింతకాయలు కట్టుకున్న మూట లోంచి కిందపడ్డాయి. అప్పదాసు కూడా కిందకి ఒరిగి కదలలేక కూర్చున్నాడు.


కాలు పట్టేసిందే అని ఆవుతో అరిచి చెప్పాడు. బుచ్చి పరుగెత్తుకుంటూ వచ్చి అతణ్ణి లేపి కట్టు కట్టి ప్లేటులో ఉప్మా పెసరట్టు తీసుకుని వచ్చింది.


వెధవ చింతపండు కోసం కాలు నొప్పి తెచ్చుకున్నారు అంది బుచ్చి. ఆ అంటూ నోరు తెరిచాడు అప్పదాసు.


బుచ్చి ఉప్మా పెసరట్టు కొద్దిగా తుంచి అతడికి తినిపించింది. పెసరట్టు బహురుచిహి.. అన్నాడు అతను.


సాయంత్రం ఈ చింతపండు రోట్లో వేసి కాస్త కారం, జీలకర్ర, ఉప్పు వేసి దంచితే ఎంత బాగుంటుంది అన్నాడు.


బుచ్చి కాస్త బెల్లం కూడా వాటితో కలిపి, బాగా దంచి చింతపండు ముద్దలా అయిన తరువాత లడ్డూలా చేసింది.


అప్పదాసు వాటికి పుల్లలు గుచ్చి బుచ్చికి కూడా ఒకటి ఇచ్చాడు. నాలుకకు కాసేపు తగిలించి అప్పదాసు చింతపండును ఆస్వాదించాడు.



Rate this content
Log in

Similar telugu story from Abstract