Jyothi Muvvala

Drama Classics Inspirational

4  

Jyothi Muvvala

Drama Classics Inspirational

పెళ్లి కానుక!

పెళ్లి కానుక!

7 mins
764



              

రఘు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, రఘు వాళ్ళది సాంప్రదాయ కుటుంబం. వాళ్ళ అమ్మగారు వనజాక్షి ! చాలా నియమాలు, పద్ధతులు కలిగిన వారు. ఆమె దృష్టిలో కోడలు అంటే అనుకువగా ఆవిడ చెప్పు చేతుల్లో ఉండాలని అనుకునేది. ఎందుకంటే ఆవిడ అత్తగారు ఆమేని అలానే అదుపు ఆజ్ఞలలో పెట్టారు. అందుకే కాబోలు అవే పద్ధతులు పాటించి అత్తమామల ముందు మాట్లాడకూడదు. వారు కుర్చీలో కూర్చుంటే కోడలు కిందే కూర్చోవాలి. ఆధునిక దుస్తులు ధరించకూడదు. ఎప్పుడూ చీరలు మాత్రమే కట్టుకొని అత్తమామల దగ్గర అనిగిమనిగి ఉండాలి అని ఒక చాదస్తపు నియమాని ఒంటపట్టించుకున్నారు. అదే మూసలో ఆలోచిస్తూ తనకి కాబోయే కోడలు కోసం వెతకడం మొదలు పెట్టారు. రఘుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా అబ్బాయికి అయితే అమ్మాయిలు నచ్చూతున్నారు గాని వాళ్ళ అమ్మగారికి మాత్రం నచ్చటం లేదు.ఏదో వంక చెప్పుతూ వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తూ ఉండేది వనజాక్షి! ఆవిడ సమస్య ఒక్కటే... బాగా చదువుకున్న ఆడపిల్లల అయితే కొడుకునీ ఆమె నుంచి దూరం చేస్తారని, ఆధునిక దుస్తులు (జీన్స్, మోడల్ డ్రెస్) వేసుకున్న అమ్మాయిలు అత్త మామలకి సేవలు చెయ్యరు అని ఆవిడ అపోహ... అందుకనే ఎంత అందంగా ఉన్నా ఎంత బాగా చదువుకున్న ఏదో వంక చెప్పి సంబంధాన్ని తిరస్కరించేది.

ఇదిలా ఉండగా రఘు వాళ్ళ ఆఫీస్లో శృతి అనే అమ్మాయి రఘునీ చాలా రోజుల నుంచి ఇష్టపడుతూ ఉంటుంది.

శృతి అనాధ! చిన్నప్పుడే కారు యాక్సిడెంట్లో తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకుంది. అప్పటి నుంచి ఒక అనాధాశ్రమంలో పెరిగి పెద్దదయింది. అదొక మిషనరీ అనాధాశ్రమం. ఆ ఆశ్రమానికి సిస్టర్ మేరీ హెడ్గా ఉండేవారు. ఆవిడ చిన్నప్పటినుంచి శృతిని కన్నబిడ్డలా చూసుకునేవారు.

శృతి మంచి నడవడిక, తెలివితేటలు కలిగిన చలాకీ పిల్ల కనుక బాగా చదువుకొని, తనకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకొని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం తెచ్చుకుంది. రఘు, శృతి ఇద్దరూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు.రఘుకి చిన్నప్పట్నుంచి కాస్త బిడియం ఎక్కువ. అమ్మాయిలను అస్సలు చూడడు మాట్లాడడు. కానీ చూసిన మొదటి రోజే శృతి! రఘుకి నచ్చింది.

శృతి ఆఫీసులో చేరినప్పటి నుంచి రఘు ప్రవర్తనా మరియు మంచితనాన్ని చూసి రఘుని ప్రేమించడం మొదలు పెట్టింది. ఒకరోజు తన మనసులోని ప్రేమను రఘుకు చెప్పాలని అనుకుంటుంది శృతి . కానీ రఘు తిరస్కరిస్తాడేమో అన్న భయంతో చెప్పలేక ఆగిపోతుంది.


రఘుకి! శృతి మీద మంచి అభిప్రాయమే ఉంది. శృతి అందం తెలివితేటలకి పడని మగవారు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి అందం ఆమెది.

అదే ఆఫీసులో పని చేస్తున్న చాలామంది అబ్బాయిలు శృతిని పెళ్లి చేసుకుంటామని చాలాసార్లు అడిగారు. కానీ శృతి మనసులో రఘు ఉండటంతో తను ఎవరినీ అంగీకరించేది కాదు. అక్కడ చూస్తే రఘు ఇంటి పరిస్థితులు కారణంగా తన తల్లి మనస్తత్వం తెలిసిన రఘు! శృతి అంటే ఇష్టం ఉన్నా తన ప్రేమని తెలపలేకపోతున్నాడు.ఒకరోజు శృతికి... రఘుకి పెళ్లి చూపులు చూస్తున్నారని తెలిసి ఇక ఆలస్యం చేస్తే రఘు దక్కడు అనే అభిప్రాయంతో తన మనసులో మాట రఘుతో చెబుతుంది.శృతి ప్రేమిస్తున్నాను అని చెప్పిన వెంటనే రఘు! శ్రుతితో తన మనసులో మాట చెప్తాడు.


" నువ్వు వచ్చిన మొదటి రోజే నాకు చాలా బాగా నచ్చావు శృతి.  నీ టాలెంట్ చూసి ఇంకా బాగా నచ్చేసావు.""ఓకే ప్రాజెక్టులో కలిసి చేస్తున్న ఎప్పుడు నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా?"

" నిన్ను ప్రేమించి నా జీవితంలో నీకు చోటిస్తే అది నేను నీకు అన్యాయం చేసినట్టే అవుతానని చెప్పాడు "

రఘు మాటలు విన్న శృతి ఆశ్చర్యపోయింది.

"అదేంటి రఘు ప్రేమించినప్పుడు జీవితంలో స్థానం ఇవ్వడానికి ఏమీ అభ్యంతరం నీకు అని అడుగుతుంది"

" శృతి నీకు తెలీదు! మా అమ్మవి అన్ని పాత కాలం పద్ధతులు. ఆడపిల్లలు జీన్స్ వేసుకున్న, ఫ్యాషన్గా తయారైనా, ఉద్యోగాలు చేసిన ఆవిడకి నచ్చరు. ఇప్పటికి ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. కానీ ఇవే కారణాలు చెప్పి అన్ని క్యాన్సిల్ చేశారు. అని తన ఆవేదన శృతితో చెప్పాడు రఘు.

"నీ సమస్య ఇదే అయితే నా దగ్గర పరిష్కారం ఉంది రఘు , నాకు నువ్వు కావాలి! నా జీవితంలో తల్లిదండ్రులను కోల్పోయాను, నన్ను సిస్టర్ మేరీయే పెంచారు."

"నిన్ను చూసిన మొదటి రోజే నాకెందుకో నీలో నాకు కోల్పోయిన ప్రేమ దొరుకుతుందని ఆశ ఏర్పడింది."

"అందరూ అబ్బాయిలాగా అమ్మాయిలని చూసి వెంట పడవు." "నీ పనేదో నువ్వు చూసుకుంటావు . నువ్వు ఆడ వాళ్లకు ఇచ్చే మర్యాద నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం నన్ను నీకు కట్టి పడేశాయి."

"నీకు మీ తల్లిదండ్రులకు నచ్చే విధంగా నేను ఉంటాను. మీ అమ్మగారికి నేను చేసే ఉద్యోగం నా వస్త్రధారణ అభ్యంతరమైతే నీకోసం వాటన్నింటిని వదులుకొని వస్తాను అని అంది."

 తనకు నచ్చిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా వస్తానంటే అంతకన్నా ఇంకేం కావాలి. తన తల్లిదండ్రులను వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తాను అంటే జీవితంలో కావాల్సింది ఏముంది.?శృతి మాటలకి చాలా సంతోషిస్తాడు రఘు!

"రఘు వెళ్లి వాళ్ళ అమ్మకి తన మనసులో మాట చెప్పాడు." నాతో పాటు ఉద్యోగం చేస్తున్నా అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అమ్మ" ."ఒకసారి తనని చూడు మీకు తప్పకుండా నచ్చుతుంది". "ఆ అమ్మాయికి కూడా నేను అంటే చాలా ఇష్టం" ."మన సాంప్రదాయాలను కట్టుబాట్లుకి తగ్గ పిల్ల ఒకసారి నువ్వు చూస్తావ్గా నీకే తెలుస్తుంది" అని అంటాడు రఘు.


శృతి కూడా సిస్టర్ మేరీకి వెళ్లి రఘు విషయం చెప్తుంది.   " మీ బ్లెస్సింగ్స్తో మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. కాకపోతే చిన్న ప్రాబ్లం సిస్టర్" అని చెప్పింది.

"ఆ మాటలు విన్న సిస్టర్ ఏంటి శృతి అని అడుగుతుంది.

"వాళ్ళ అమ్మగారు సాంప్రదాయాలు కట్టుబాట్లు కలిగిన మనిషి. ఆవిడకి కోడలు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే నేను ఈ ఉద్యోగాన్ని మానేయాలి. ఇక ఇంట్లో ఉంటూ వారి సేవ చేసుకుంటూ నా జీవితాన్ని నేను ఒక కొత్త మలుపు తిప్పుకోవాలి సిస్టర్ అని చెప్పింది."


ఆ మాటలు విన్న సిస్టర్కి అది నచ్చలేదు. "శృతి! ఏరోజుల్లో ఉన్నావు నువ్వు?ఆడ పిల్లలు వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడడానికి స్వేచ్ఛ కోరి, కట్టుకున్న భర్తనే ఎదిరించి, అవసరం అనుకుంటే వదిలేసివిడిగా వచ్చి బతుకుతున్న రోజులు ఇవి. 

అలాంటిది నీకు తల్లిదండ్రులు తోడు లేదు.నీకు ఆధారమైన ఈ ఉద్యోగాన్ని కూడా వదులుకొని రఘు కోసం నీ జీవితాన్ని పణంగా పెడతావా? మతి గాని పోయిందా?? అని తిడుతుంది సిస్టర్.

"ఏమో సిస్టర్ నేను అవన్నీ ఆలోచించలేదు. రఘు నాకు తోడు ఉంటే నా జీవితం అంతా హాయిగా ఉంటుందని ఏదో తెలియని భరోసా! రఘు కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది" అని చెప్పింది.

"ప్రేమ గుడ్డిది శృతి. ప్రేమలో ఉంటే కళ్ళ ముందు నిజాలు కనిపించవు.సరే శృతి నీ ఇష్టం కానీ...నీకు నేను కన్న తల్లిని కాకపోయినా ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని పెంచాను అమ్మ". "నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటాను" అంది సిస్టర్.

ఇక శృతిని వాళ్ళ అమ్మకు చూపించాలని రఘు అనుకుంటాడు. అందుకనే చీర కట్టుకొని లక్షణంగా తయారయ్యి వాళ్ళ ఇంటికి రమ్మని శ్రుతికి చెబుతాడు.

రఘు చెప్పినట్టే శృతి అందంగా చీర కట్టుకొని బాగా ముస్తాబై రఘు ఇంటికి వెళ్తుంది. శ్రుతిని చూసిన వనజాక్షి "పిల్ల బానే ఉంది" "వంటావార్పు ఏమైనా వచ్చా?" అని అడుగుతుంది. ఆ మాటలకు శృతి "కొద్దిగా తెలుసు ఆంటీ అని చెబుతుంది. అంటే ఇప్పటివరకు అనాధాశ్రమంలో ఆయమ్మ చేసి పెట్టేది. అందుకే నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకుంటాను. అని చెబుతుంది. 

"అనాధాశ్రమంలో ఉండడం ఏంటి? నీకు తల్లిదండ్రులు లేరా?" అని వనజాక్షి అడుగుతుంది. అంటే అది... అంటూ శృతి నానుస్తూ... మీకు రఘు చెప్పలేదా? అని అడుగుతుంది. "రఘు నాకేమీ చెప్పలేదే అంటే నీకు తల్లిదండ్రులు లేరా "అని అడుగుతుంది వనజాక్షి.

"లేరు ఆంటీ! చిన్నప్పుడే అమ్మానాన్న ఆక్సిడెంట్లో పోయారు. అప్పటినుంచి నేను అనాధాశ్రమంలోని సిస్టర్ మేరీ దగ్గర పెరిగాను." అని చెప్తుంది.

చర్చిలో పెరిగావ? నీకు పూజాపునస్కారాలు వచ్చా?? అసలు మా దేవున్ని పూజిస్తావా? అంటూ వనజాక్షి! శృతిని ప్రశ్నలతో సంధించింది.

"నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏసుప్రభుని ప్రార్థించాను. అంటే భగవంతుడు రూపాలు వేరైనా సర్వాంతర్యామి కదా ఆంటీ! అయినా సరే నేను రఘు కోసం నా అలవాట్లు పద్ధతులు మార్చుకుంటాను" అని చెప్పింది.

ఇంతలో రఘు వాళ్ళ అమ్మ వనజాక్షి అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది. రఘు తండ్రి ఆనందరావు మాత్రం మంచి వాడు అతనికి అమ్మాయి నచ్చింది . తను పెరిగిన వాతావరణం పద్ధతులు అన్నీ రఘు కోసం వదులుకొని తన వ్యక్తిత్వాన్ని కూడా మర్చిపోయి చేస్తున్న ఉద్యోగం మానుకొని వస్తాను అని చెప్పిన తన మాటల్లో రఘు మీద ప్రేమను చూసి మురిసిపోయాడు. ఇలాంటి అమ్మాయి నా కొడుక్కి జీవిత భాగస్వామి అయితే వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాడు. శృతి ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

రెండు రోజులు అయింది రఘు ఏ విషయం శృతికి చెప్పలేదు. ఆఫీస్కి కూడా రావడం లేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో అని ఒకపక్క కంగారు!మరోపక్క ఇంటికి వెళితే రఘు అమ్మగారు ఏమంటారో అని భయంతో సతమతమవుతూ వెళ్ళలేక పోయింది. 

రఘు వాళ్ళ అమ్మగారికి శృతి నచ్చలేదు. కానీ రఘు తండ్రి ఆనందరావు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. "ఆ అమ్మాయికి ఎవరు లేరు. మనం ఎలా చెప్తే అలా వింటుంది.మన ఇంట్లో కూతురిల్లా మన కళ్ళ ముందే మన కొడుకుతో పాటు ఉంటుంది". "నీకు వచ్చే భయమేమీ లేదు! తను రఘుని ఎంతగానో ప్రేమిస్తుంది." "మన వాడి కోసం కూడా కొంచెం ఆలోచించు...వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా ? ఇంక నీకు ఏంటి సమస్య అని అడిగాడు."

అయినా కూడా వనజాక్షి ససేమిరా ఒప్పుకోదు. ఎవరికి పుట్టిందో ఏ కులమో? చర్చిలో పెరిగి పెద్దదయింది అంట? పెళ్లి అయ్యే వరకు అన్ని మాటలు వింటారు, పెళ్లి చేసుకున్నాక మారిపోతే నా కొడుకుని మార్చేసి నాకు దూరం చేస్తే ? అప్పుడు చేసేది ఏమీ లేదు అంటూ కోపంగా ఇంటి నుంచి బయటికి వెళ్లి పోయింది.

అమ్మ... ప్లీజ్ అమ్మ అంటూ వెనకాతల రఘు పరిగెట్టాడు. మీ అమ్మకి కోపం వస్తే కాసేపు గుడికి వెళ్లి కూర్చుని వస్తుంది ఏం కాదులే అన్నాడు ఆనందరావు.

రఘు ఇంట్లో పరిస్థితి ఇలా ఉండగా! రెండు రోజుల నుంచి రఘు ఫోన్ ఎత్తకపోవడంతో ధైర్యం తెచ్చుకొని శృతి! విషయం తెలుసుకోవడానికి రఘు ఇంటికి వచ్చింది.

 కొడుకు బాధ చూడలేక ఆనందరావు ఒక నిర్ణయానికి వచ్చి రఘుతో ఇలా చెప్పాడు. రఘు! "తల్లిదండ్రుల్ని గౌరవించాలి ,ప్రేమించాలి అది మన సంస్కారం. కట్టుబాటు అని మన శాస్త్రాలు గ్రంథాలలో చెప్పారు. చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు."

"కానీ మన కోసం ప్రాణం ఇచ్చే మనిషి దొరికినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ప్రేమను అర్థం చేసుకోలేనప్పుడు నీకోసం వచ్చిన అమ్మాయి చెయ్య వదిలి పెట్టకూడదు.అలా వదిలి పెడితే అది మహా పాపం."

"మీ అమ్మకు నేను ఉన్నాను. మీ చెల్లి కూడా ఉంది కానీ శృతికి ఎవరూ లేరు, అన్ని నువ్వేనని నీమీద ఆశలు పెట్టుకుంది. ఈ రోజు కాకపోతే రేపు మీ అమ్మ అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతే చస్తుందా.?"

"కానీ నువ్వు దక్కకపోతే శృతి ఏమైపోతుందో అందుకే నా మాట విని మీ అమ్మ వచ్చేలోపే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో... శృతిని పెళ్లి చేసుకొని హాయిగా ఉండండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు." 

ఈలోపు కాలింగ్ బెల్ శబ్దం వచ్చింది. వనజాక్షి తిరిగి వచ్చిందేమో అని అందరూ కంగారు పడ్డారు. మెల్లగా రఘు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా శృతిని చూసిన రఘు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా నిలబడి పోయాడు.

ఆనందరావు శృతిని చూసి నవ్వుతూ రా... అమ్మ !అని ఆహ్వానించాడు. ఇంటిలో వనజాక్షి ఉంటే గొడవ చేస్తుందేమో అని భయంతో బిక్కు బిక్కుమంటూ... అటూ ఇటూ చూస్తూ శృతిలో లోపలికి అడుగుపెట్టింది. మరేం భయం లేదమ్మ ఇంట్లో మీ అత్తగారు లేరు అన్నాడు ఆనందరావు."ఇంకేం శ్రుతి కూడా వచ్చేసింది. ఇద్దరూ వెళ్లి హాయిగా పెళ్లి చేసుకోండి అని చెబుతాడు.

అందుకు శృతి "అంకుల్  చిన్నప్పటినుంచి రఘుని ఆంటీ ఎంత ప్రేమగా పెంచిందో మీకు తెలియదా?

అలా పారిపోయి పెళ్లి చేసుకునే పనైయితే ఇన్ని రోజులు రఘు ఆంటీ చూపించిన సంబంధాలంన్నిటికీ వెళ్లే వాడే కాదు. మీ దీవెనలతో పెళ్లి చేసుకోవాలని నన్ను ప్రేమిస్తున్నా ఆమాట చెప్పకుండా తన మనసులోనే దాచి పెట్టుకున్నాడు. నేను నా ప్రేమ విషయం చెప్పినప్పుడు మా అమ్మకు ఆచారవ్యవహారాలు ఎక్కువ నిన్ను చేసుకొని నిన్ను బాధ పెట్టలేను అని అన్నాడు. 

రఘు మీద ప్రేమతో నా ఆచార వ్యవహారాలన్నీ మార్చుకుంటాను అని చెప్పాను. తల్లిదండ్రుల విలువేంటో తల్లిదండ్రులు లేని నాకు బాగా తెలుసు అంకుల్. మీ కుటుంబాన్ని నా కుటుంబంగా చేసుకొని అందరం సంతోషంగా ఉండాలని ఎంతో ఆశ పడుతున్నాను. ఆంటీని బాధ పెట్టి మేము పెళ్లి చేసుకున్న సంతోషంగా ఉండలేము. మాకు మీ దీవెనలు కావాలి శాపాలు కాదు. అని కన్నీరు పెట్టుకుంది శృతి. అప్పుడే బయటనుంచి వచ్చిన వనజాక్షి తలుపు చాటునుంచి శృతి మాటలు విని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి కరిగిపోయింది. నా కొడుకు నా కోసం తన ఇష్టాలను త్యాగం చేసినప్పుడు నా కొడుకు కోసం నేను నా పద్ధతులను మార్చుకోలేనా? అని అనుకుంది. లోకమే మారిపోయింది. చాదస్తలతో పిల్లల మనసులను బాధపెట్టడం మూర్ఖత్వమని  ఆలోచించుకొని శృతి దగ్గరికి వెళ్లి శృతిని దగ్గరికి తీసుకొని నన్ను క్షమించు అమ్మా! నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి నా కోడలు కూడా నన్ను నా కొడుక్కి దూరం చేస్తుంది అనే భ్రమలో మూర్ఖంగా ఆలోచించి అలా ప్రవర్తించానే తప్ప... మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. మీ ఇద్దరూ నన్ను క్షమించండి. నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేస్తాను. అని ఇద్దరినీ దగ్గరికి తీసుకుని దీవించింది. తల్లిలోని మార్పును చూసి రఘు చాలా సంతోషించాడు. తమ ప్రేమకు అంగీకారం తెలిపినందుకు శృతి సంతోషంతో వనజాక్షి కాళ్ళకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపింది. శృతిని పైకి లేపి "నా కొడుకు కోసం నీ పద్ధతులు మార్చుకుంటాను అని చెప్పినప్పుడే నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోయింది"." ఎవరి కోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన పని లేదు". నీకు నచ్చినట్టు ఉండు. నీ ఉద్యోగాన్ని నువ్వు కంటిన్యూ చెయు. నాకు ఒక ఆడపిల్ల ఉంది. రేపు పొద్దున్న నా బిడ్డకి ఇవే కష్టాలు వస్తే అది ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకున్నాను. అజ్ఞానంతో మీ అందర్నీ బాధపెట్టాను.అదేవిధంగా నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో 

నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాలంతో పాటు మనుషులు మారాలి. తరాల అంతరాలను మార్చుకోవడమే ఆధునికత అని తెలుసుకున్నాను

అని అంది వనజాక్షి. శృతికి, రఘుకి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశారు.అలా శృతికి కోరుకున్న జీవితం శృతికి పెళ్లి కానుకగా లభించింది.


శుభం!


                          

 జ్యోతి మువ్వల.

బెంగళూరు


Rate this content
Log in

Similar telugu story from Drama