Dinakar Reddy

Abstract Comedy

4  

Dinakar Reddy

Abstract Comedy

పాస్ పోర్టు ప్రహసనం

పాస్ పోర్టు ప్రహసనం

2 mins
425


పాస్ పోర్టు అప్లయ్ చేసుకున్నావా? ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం మొదలవ్వగానే ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా వచ్చే ప్రశ్న ఇది.


అయినా ఇంజినీరింగ్ ఇంకా ఇంజినీరింగ్ పూర్తి కాలేదు. అప్పుడే ఫారిన్ వెళ్ళి MS చేయడమూ డాలర్లు పోగేయడమూ కళ్ళ ముందు జరిగినట్లు ఊహిస్తారు.


అదేం ఆనందమో. (దాన్నే ముందు చూపు, ఆశావహ దృక్పథం అంటారని, నేను అన్నిటికీ పెడ సరిగా మాట్లాడుతానని అందరూ చివాట్లు పెట్టారు.అది వేరే సంగతి అనుకోండి).


మొదట బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అప్పట్లో ఏమవసరం లే అని తీసుకొని ఉండరు చాలా మంది తల్లిదండ్రులు.


రెవిన్యూ ఆఫీసు చుట్టూ తిరిగి బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకునేసరికి నెల పట్టింది. మరో నెల్లో పాస్ పోర్టుకు అప్లయ్ చేయడమూ అది రావడమూ జరిగింది.


ఫరవాలేదు. ఆధార్ కార్డులో కంటే ఇందులో ఫోటో బాగానే వచ్చింది.


ఇక అప్పట్నుంచి ఆ పాస్ పోర్టు నా జీవితంలో విడదీయలేని భాగమైపోయింది.


GRE, IELTS ప్రయత్నించి చూడమని బంధువుల సలహా. అవును మరి. క్యాంపస్ సెలక్షన్లు లేని కాలేజీలో చదువుకుంటే అంతే. పాస్ పోర్టు తెచ్చుకున్నావ్. కాస్త కష్టపడి ఫారిన్ పొరాదూ. దగ్గరి బంధువుల ఉపదేశం.


మా తోడి కోడలు కొడుకు అమేరికా వెళ్ళాడు. డాలర్లు సంపాదిస్తున్నాడు. మన వాడు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని దూరపు చుట్టం ఒకావిడ ఆల్ మోస్ట్ ఆర్డరులా అంది.


నేను విదేశంలో చదివేందుకు వెళ్ళడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ నాకు ఆ పరీక్షలో ప్రశ్నలు అర్ధమయ్యి చస్తే ఒట్టు. 


నాకు అసలు ఫారిన్ వెళ్లాలని లేదని గ్రహించి మా అమ్మ ఇలా అంది. వీడు పాస్ పోర్టు తీసుకున్న వేళ బాగోలేదు. అందుకే మావాడు ఫారిన్లో కాలు పెట్టలేకపోతున్నాడు అని పాస్ పోర్టు కి దిష్టి తీసింది. అబ్బే. ఏం ప్రయోజనం 

ఉండదు అని తెలుసు. ఏదో తన కొడుకుని ఎవ్వరూ ఏమీ అనకూడదని ఆమె తాపత్రయం. అమ్మంటే అంతే కదా.


కాల చక్రం గిర్రున తిరిగింది.(అంటే దాని resolutions per minute దానికి ఉంటుంది లెండి. అందరూ అలా వ్రాస్తారని నేనూ వాడేశా. ఇక కాలానికి యూనిట్లు అవీ అడిగి నా పరువు తియ్యకండి.)


నేనేదో పుట్టిన దేశం లోనే ఓ మోస్తరు ఉద్యోగం ఓ మోస్తరు భార్య ( ఓ మోస్తరు భార్య ఏమిటిరా అక్కు పక్షి అని అంటారేమో). వద్దులెండి. ఓ చక్కని భార్యతో జీవితం అలా సాగిపోతోంది.


కానీ ఆ పాస్ పోర్టు చూసినప్పుడల్లా మా ఆవిడకు విదేశంలో విడిది చేయాలనే కోరిక గుర్తుకు వస్తోంది. ఇది నా బడ్జెట్ లో వీలు పడని కోరిక. అందుకే ఆ పాస్ పోర్టుని జాగ్రత్తగా తీసుకెళ్ళి టేపు వేసి పూజ గదిలో పీట కింద అతికించాను.


హమ్మయ్య ఇక మీదట పాస్ పోర్టు గొడవ లేదు అని దణ్ణం పెట్టుకుని బయటికి నడిచాను నేను.


Rate this content
Log in

Similar telugu story from Abstract