పాలు తాగే దెయ్యం
పాలు తాగే దెయ్యం
ఈ కథ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చిన్న గ్రామంలో జరిగింది. వంద ఇల్లులుండే గ్రామం అది.రంగయ్య ఒక పాల వ్యాపారి. రంగయ్య ఇంటి వెనకే గేదెల కొట్టం ఉంది. ఇంటి గోడకు ఆనుకొనే ఉన్న ఆ కొట్టం నుంచి గేదెల శబ్దం, మెడల గంటల శబ్దం రాత్రి అంతా ఇంట్లోకి
వినిపిస్తూ ఉంటుంది. రంగయ్య పాల వ్యాపారి కావడంతో ప్రతి రోజూ తెల్లవారుజామున మూడున్నరకి లేచి ఇంటి వెనక తలుపు తెరిచి కొట్టంలోకి వెళ్లి పాలు పితికి, కేంద్రంలో అమ్మేవాడు . ఇల్లు, కొట్టం మధ్య గోడ చాలా పలుచనిది. గోడ రెండు వైపులా రెండు వేరు జీవనలు ఉన్నా, రాత్రి ఆ గోడకి అవతల పశువుల కొట్టంలో ఏదో కదులుతున్నట్టు అనిపించడం మంగమ్మకు తరచూ భయాన్ని కలిగించేది. గేదెలు మనుషుల కళ్లకి కనిపించని దేనినో చూస్తున్నట్టు ఆమెకు అనిపించేది. రంగయ్య ఇవేం పట్టించుకునే వాడు కాదు.
ఒక అమావాస్య రాత్రి ఆమె భయం నిజం అయింది. అర్థరాత్రి వేళ మంగమ్మకు నిద్ర మధ్యలో గోడ దగ్గర ఎవరో చేతి గోళ్ళతో బలంగా గీస్తున్న శబ్దం వినిపించింది. అది ఎలుకల శబ్దం కాదు, గేదెల కదలిక కాదు. నెమ్మదిగా వెనక కిటికీ తెరిచి చూసిన ఆమెకు కొట్టం లోపల నల్లని నీడ రూపంలో ఒక ఆడమనిషి కనిపించింది. తెల్ల చీర, విప్పిన జుట్టు, కూర్చుని గేదె పొదుగు పట్టుకుని పలు పితుకుతుంది ఆ రూపం. ఆమె కాళ్లు నేలను తాకట్లేదన్న భావన మంగమ్మ గుండెల్లో దడపుట్టించింది. ఆ రూపం ఒక్కసారిగా తలెత్తి చూసినప్పుడు మంగమ్మ గట్టిగ అరిచి సృహతప్పి పడింది. ఆ రాత్రి తర్వాత ఆ ఇంట్లో ఎవరికీ నిద్ర రాలేదు.
మరుసటి ఉదయం రంగయ్య పాలు పితుకుతునపుడు వింత జరిగింది. మొదట పాత్రలో పాలు పడినట్టే కనిపించాయి. కానీ క్షణాల్లోనే వాటినుంచి దుర్వాసన వచ్చింది. రంగయ్య పాల గిన్నెలోకి చూస్తే పాలు నల్లగా మారిపోయి ఉన్నాయి. ఏంజరుగుతుందో అర్ధంకాలేదు రంగయ్యకి.పశువుల కొట్టం చుట్టూ తీక్షగా చూసాడు,గేదెలు మాత్రం అశాంతిగా నిలబడి, కొట్టం మూలవైపు చూస్తూనే ఉన్నాయి.గేదెలు దేన్నో చూసి భయపడ్డాయి అని అర్ధం చేసుకున్నాడు రంగయ్య. అప్పటి నుంచి ప్రతిరోజూ పాలు పితికే సమయంలో ఏదో మార్పులు కనిపించేది. ఎప్పుడూ పశువుల కొట్టంలో పద ముద్రలు, గేదెల మీద చిన్న చేతి గొల్ల గాట్లు అనిపించెవి.
రాత్రిళ్లు ఇంట్లో కూడా ఆ భయం చొచ్చుకొచ్చింది. వంటగదిలో పాత్రలు తమకుతామే కదిలినట్టు, ఇంటి లోపలే గేదెల గంటలు మోగినట్టు అనిపించేది. వెనక గోడ మీద చేతి ముద్రలు కనిపించేవి. గేదెల కొట్టం.
అప్పుడే మంగమ్మ తల్లి అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక చేదు నిజాన్ని చెప్పింది. "ఈ ఇల్లు కట్టకముందు, రంగయ్య తండ్రి ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమె గర్భవతి అని తెలిసాక . తన పరువు,మర్యాదలు కాపాడుకోడానికి అదే గేదెల కొట్టంలో గేదెలను కట్టే తాడుతో ఆమెను చంపి, శవాన్ని ఇంటి వెనకే పాతిపెట్టారని" ఆ గ్రామంలో అందరూ మాట్లాడుకునే వాళ్ళు అని ఆమె చెప్పింది.
ఆ నిజం బయటపడిన తర్వాత భయం మరింత పెరిగింది. రాత్రి రెండున్నర దాటితే గేదెలు ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టేవి . ఏదో నల్లటి నీడ గేదె పొదుగు దగ్గర కుర్చునట్టు కనిపించేది. కొన్నిసార్లు ఇంట్లోకి చిన్నపిల్ల ఏడుపు విన్పించేది. మంగమ్మకు ఒక రాత్రి, తలుపు దగ్గర ఒక చిన్న అమ్మాయి నుంచొని తననే చూస్తున్నట్టు కనిపించింది. ఆ దృశ్యం మంగమ్మను మరింత భయపెట్టింది. ఇంటి ఆడవాళ్ళూ భయంతో ఆ ఇంట్లో ఉండలేక పోతున్నారు.
బాగా ఆలోచించిన రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఇంట్లోవాళ్ళందర్నీ బంధువుల ఇంటికి పంపించి. అసలు ఎంజారుగుతుందో తెలుసుకోవాలని ఆ రాత్రి పశువుల కొట్టంలో పొలం సమన్లు,పత వస్తువులు పెట్టె చిన్న గది లాంటి దాంట్లో ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయం 2:౩౦ అయింది.
ఒక్కసారిగా ఏదో సుడిగాలి వచినట్టు అయింది. అది చూడటానికి నల్లటి ఆకారంతో ఎరుపెక్కిన కళ్ళతో ఏదో ఒక నల్లటి గాలి తిరిగినట్టు కొట్టం అంత తిరిగింది. దాన్ని చూసి గేదెలు భయపడి అరుస్తున్నాయి. ఆ నల్లటి గాలి ఒక స్త్రీ ఆకారంలోకి వచ్చింది. తెల్లని చీర,ఎర్రటి కళ్ళు ,చింపిరి జుట్టుతో చాల భయంకరంగా, అసహ్యంగా ఉంది. ఒక గేదె దెగ్గర కూర్చొని పాలు పితికి తాగుతుంది. వికృతంగా నవ్వుతు పశువులను భయపెడుతూ తిరుగుతుంది. నాలుగింటికి ఒక గాలి లాగా అక్కడ్నుంచి మాయం అయింది. అక్కడే ఉండి అంత చుసిన రంగయ్య. అక్కడ్నుంచి బయటకి వచ్చి. పనివాళ్ళతో ఇంటికి దేగ్గర్లో ఒక కొట్టాని కట్టించి, పశువుల్ని అక్కడికి మర్చి.
ఈ పశువుల కొట్టని పూర్తిగా కూల్చి నెలా మట్టం చేసి. పూజారులను పిలిచి ఆ ప్రదేసనాత శుద్ధి చేయించాడు.
అప్పటి నుంచి అక్కడ ఎలాంటి పీడా రాలేదు. అలా అని అక్కడ మళ్ళి ఎంకట్టలేదు.
Thank you❤
By: Anisa Tabassum SK (anu)

