పనసకాయల దొంగ
పనసకాయల దొంగ
ముత్యాల పురం అనే ఊరిలో తాజు అనే చిన్న వ్యాపారి తన భార్య పుష్పాతో సంతోషంగా జీవించేవాడు.భార్యాభర్తలిద్దరూ మంచి మనసు గల వారు,సాధారణంగా ఉండేవారు.
తాజు వళ్ళ పెరట్లో చాలా జామచెట్లు ఉన్నాయి,ఆ చెట్లు ఎల్లకాలం దోరగా పండిన జామకాయలతో ఉండేవి. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా జీవనం సాగించేవారు.
తాజు ఒకరోజు రుచిగా ఉండేజామకాయలను అమ్మడానికి పొరుగూరికి వెళ్తాడు.
అక్కడ సంతలో జామకాయలు అమ్ముతుండగా అక్కడికి సోమరాజు అనే వ్యక్తి ఒక ముళ్ళతో పచ్చగా పెద్దగా ఉన్న ఒక పండును తీసుకువచ్చి పక్కగా కూర్చుంటాడు. అతనినే చూస్తున్న తాజు ఇలా అనుకుంటాడు "అయ్యో...ఎంత అమాయకుడు ఈ వ్యక్తి లేకపోతే ఇన్ని ముళ్ళు ఉన్న ఈ పండును అమ్మడానికి వచ్చాడా మూర్ఖులు తప్ప దీనిని ఎవరు కొంటారు"అని మనసులోనే నవ్వుకున్నాడు.తాజు అలా చూస్తూ ఉండగా సోము తెచ్చుకున్న వస్తువుల నుంచి ఒక పెద్ద కత్తి ఒక నూనె డబ్బా తీశాడు.దీనితో ఏం చేస్తా డబ్బా... అని అలానే చూస్తున్నాడు తాజు, సోము ఆ నూనె డబ్బాను తెరిచి తన మోచేతి దాకా నూనెను పూసుకొని ఆ పెద్ద కత్తికి నూనె పూసాడు.ఆ పండును కోయగానే మంచి కమ్మటి తీయటి వాసన తాజుని మైమరిపించింది.సోము ఆ పండును కోసి ఒక్కొక్క తొనలను బయటికి తీశాడు.తాజు వాటి రుచి చూడాలి అనుకునే లోపు ఆ కమ్మటి వాసన కి అందరూ వాటిని కొనేశారు.ఖాళీ అయిన బుట్టను చూసి తాజు వెంటనే సోము దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు "అరె!.. ఆ ముళ్ళున్న పండు ఏమిటి?.. చాలా మంచి రుచికరమైన వాసన వస్తుంది, ఏం చేస్తారు దానితో అన్నాడు".అది విని నవ్విన సోము "భలేవాడివే ఈ పండు పేరు తెలీదా నీకు!.. దీనిని పనస పండు అంటారు, దీనిని తినాలన్నా అదృష్టం ఉండాలి!.. మహారుచిగా ఉంటాయి.."అని బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు.
ఆ రోజంతా తాజు బుర్రలో పనసపండు గురించే ఆలోచనంతా...
సంత అయిపోయాక ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న తాజుకి నిద్ర రావడం లేదు,ఎందుకంటే అతని ఆలోచనలు ఇంకా ఆ పనస పండు మీదే ఉన్నాయి.తాజుని గమనించిన అతని భార్య ఏమైందో అడిగింది!
తాజు మాటలు విన్న పుష్పాకీ నోరూరింది🤤,ఎలాగైనా ఆ పనస పండు తినాలనుంది.అదే మాట భర్తతో చెప్పింది ఎలాగైనా తీసుకొని రమ్మని ఆర్డర్ వేసి పంపించింది.
ఆ చీకటిలో పక్క ఊరికి చేరుకొని ఊరంతా వెతికినా తాజుకి పనస చెట్టు ఎక్కడా కనిపించలేదు.
అలా వెతుకుతుండగా సోము ఇంట్లో పెద్ద పనస చెట్టు.. పెద్ద పెద్ద కాయలతో కనిపించింది.😁
తాజు ఎంతో సంతోషంతో..ఒక పెద్ద పనసకాయ తెంపి దొంగిలించి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.
భర్తని పనసకాయతో చూసిన పుష్పా తినేదాకా ఉండబట్టలేక ,తొందర...తొందరగా...పనసకాయ తీసుకువెళ్లి , భర్త చెప్తుంది వినిపించుకోకుండా కోసేసింది. ఇంకేముంది...జిగురుతో రెండు చేతులు అతుక్కు పోయాయి.చేతులని లాగడానికి ప్రయత్నిస్తున్న భార్యని చూసి అప్పుడు అర్థమైంది తాజుకి,ఆ సోము ముందుగా నూనెను ఎందుకు ఉపయోగించాడు అని..
చూసి నవ్వుకున్న తాజు , తొందర...తొందరగా వంటింట్లో నుంచి నూనె డబ్బా ను తీసుకువచ్చి ,నూనెను తన చేతులకి పూసుకుని పుష్ప చేతులకి పోశాడు. అతుక్కున్న చేతులు విడిపోయాయి.
ఆ తరువాత ఇద్దరూ ఆ రుచికరమైన తీయటి పనసపండును ఆస్వాదిస్తూ ఆరగించారు.ఆ భార్యాభర్తలిద్దరికీ ఆ రుచి ఎంతో నచ్చింది
ఆ రుచికి అలవాటు పడ్డ ఇద్దరు పనసపండు తినకుండా ఉండలేకపోయారు.
అలా ప్రతిరోజూ రాత్రి ..తాజు పనసకాయలనీ సోము ఇంట్లో దొంగలిస్తూ ఉండేవాడు.
ఇదంతా చూసిన ఆ ఊరి జనాలు ...ఊర్లో ఎవరో పనసకాయల దొంగ పడ్డాడు అని చెప్పుకోసాగారు.
అలా తాజు పనసకాయల దొంగగా మారాడు.
By: ANISA TABASSUM SK.
Thank you, comment your opinion on this story😊
