STORYMIRROR

Magical letters

Drama Tragedy Classics

4.5  

Magical letters

Drama Tragedy Classics

90's లో మా ఊరి రమజాన్ తీపి జ్ఞపకాలు

90's లో మా ఊరి రమజాన్ తీపి జ్ఞపకాలు

3 mins
11

ఈ కథ నేను మా అమ్మ చిన్నప్పటి రమజాన్ ఉపవాసాల గురించి ఆ మధుర జ్ఞపకాలగురించి రాస్తున్న కథ. మాది ఒక చిన్న గ్రామం, ఊరికి తగ్గట్టు ముచ్చటగా ఒక మస్జీద్ ఉండేది. మా విధికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ ఆ మస్జీద్ ఏ. మా ముత్తాతగారు ( సుమారు వందేళ్లు బ్రతికారు)చీమకి కూడా హాని చేయని మంచి మనసున్న మనిషి మా ముత్తాతగారు)ఆ మస్జీద్ లో మా ముత్తాతగరే అజాన్ ఇచ్చేవారు. మా అమ్మమ్మ వాళ్లది ఉమ్మడి కుటుంబం, మా తాతయ్య వాళ్ళు ముగ్గురు అన్నతమ్ములు. వారు వారి సంతానంతో ఇళ్లెప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఇంటి ముందు చాలా పెద్ద ఖాళీ స్థలం. ఇంటి ముందు ఎప్పుడు పచ్చని చెట్లతో,మా చిన్న చిన్న తాతయ్య ప్రేమగా పెంచే పూల మొక్కలతో, కూరగాయ మొక్కలతో చాలా అందంగా ఉండేది. 

రంజాన్ నెల మొదలవ్వగానే మస్జీద్ లో వారు,ఊరి కుర్రాళ్లు అందరూ మస్జీద్ కి పెయింట్ వేయించడాలు, మరమ్మత్తులు చేసి లైటింగ్ తో అందంగా అలంకరించేవారు. ఆడవారందరు ఇల్లు శుభ్రం చేసుకోడం, ఆ నెలకి సరిపోయే సరుకుల చిట్టా చూసుకోడం చేసేవాళ్ళు. ఇక ఉపవాసాలు మొదలు పెట్టె ముందు నెలవంకను చూస్తారు, అల నెలవంకను చూసాక ఇక ఉపవాసాలు మొదలైనట్టే. ఆ రాత్రంతా చాలా హడావిడిగా ఉండేది.ఇంట్లో ఎవరెవరు ఉపవాసాలు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు అని మల్లి దాని గురించి చర్చలు.మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా ఉపవాసం ఉండటానికి ఆసక్తి చూపేవాళ్ళంట.

మొదటి సెహ్రి (తెల్లవారు ఝామున 4-am భోజనం చేసేదాన్ని సెహ్రి అంటారు) రోజు పెద్దవాళ్ళు పొద్దున్నే 3am కి లేచి సెహ్రికి అన్ని సిద్ధం చేసుకునే వారు. మా తాతమ్మ, అమ్మమ్మ వాళ్ళు అంత పొద్దున్నే వంటకం మొదలు పెట్టేవారు. అదంతా చూస్తున్న పిల్లలకు చాల సందడిగా ఉంటుంది. ఆ ఆనందంలో ఏమాత్రం నిద్ర మత్తు లేకుండా,ఎక్కడ సెహ్రి టైం అయిపోతుందో అని గబా గబా లేచి పళ్ళు తోముకొని,మొఖాలు కడుక్కొని ఎవరి ప్లేట్,గ్లాస్ వాళ్ళు తీసుకొని పిల్లలంతా కలిసి ఒక పక్కకి కూర్చునే ఐదింటికి నమాజ్ చేసి పడుకునే వాళ్ళు. ఒక్కసారి ఉపవాసం ఉంటె సాయంత్రం ఇఫ్తార్ దాక పచ్చి మంచినీళ్లు కూడా తాగకూడదు.

ఉదయం లేచాక ఉపవాసం ఉన్నారన్న సంగతి మర్చిపోయి నీళ్లు తాగబోయే వారంట. ఆ రోజులో ఇలాంటి పొరపాట్లు ఎన్నో జరిగేవి, కొంత మంది పిల్లలైతే మర్చిపోయి అలవాటులో తాగేసి ఏమవుతుందోనని భయపడి ఏడిచేవారు. సరదాకి ఇంటిపక్క పెద్దవాళ్ళు 'అయ్యో తాగేసావా,ఇంకా నువ్వు నరకానికేలే ఎంత పాపం చేసావ్" అని కావాలని భయపెట్టేవారు .ఆ భయానికి ఇంకా ఏడిచేవారు, ఇంట్లో వారు 'ఎం కాదులే మర్చిపోయి తాగితే" అని నచ్చజెప్పే దాకా ఉరుకునేవారు కాదు. ఉపవాసాలు ఉన్నకాని సాయంత్రం ఎపుడవుతుందో అని ఎదురుచూస్తూ ఆటల్లో పడిపోయేవారు.ఆడుకొని ఆడుకొని ఉపవాసం అయిపోడానికి(ఇఫ్తార్ ) ఇంకా పది నిమిషాలు ఉందనగా పళ్ళు తోముకొని, కాలు చేతులు కడుక్కొని కూచునేవాళ్ళు, వజూ చేసుకొని వెల్లేవారు. దస్తర్ ఖాన్(తినేటప్పుడు పరిచే క్లాత్) మీద 4-5 రకాల వంటకాలు,పుచ్చకాయ,అరటిపళ్లు,ఖర్జురాలు ,రూఆఫ్జా (చల్లని డ్రింక్ ల).మస్జీద్ లో సైరన్ మోగగానే దుఆ చదివి ఉపవాసం విరమించే వారు. ముందు అన్ని రకాల పదార్ధాలు ఉన్న ఫస్ట్ ఖర్జురా పండుతోనే ఉపవాసం విరమించాలి. ఇంట్లో మగవారు మస్జీద్ లోనే ఉపవాసం విరమించే వారు. ఇఫ్తార్ లో ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ ఫేమస్ ఐటెం మస్జీద్ లో చేసే గంజి. ఇంట్లో మగవాళ్ళు మస్జీద్ లో ఇఫ్తార్ చేసి, నమాజ్ చదుకొని మస్జీద్ లో ఇచ్చే గంజి-బూందీ,ఖర్జురా పల్లు తెచ్చేవారు. 

వేడి వేడి గంజి మీద బూందీ వెస్కొని తింటారు. ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు దానికి ఫ్యాన్స్ అయిపోవాల్సింది.అన్నట్టు రమదాన్ లో ఇచ్చే గంజికి-బూందీ కి మతంతో సంబంధం లేదండోయ్....హిందూ,ముస్లిం,క్రిస్టియన్స్ లో రమదాన్ గంజి-బూందీ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 

ఇంట్లో వాళ్ళు ఎంత చేసిన రమజాన్ లో మస్జీద్ లో చేసిన టేస్ట్ రాదెందుకో. 

ఇఫ్తార్ అయినా తరువాత, ప్రశాంతమైన చల్లని గాలిలో ఆరుబయట అంత చేరి కూర్చునేవారు ....మొదటి రోజా వాళ్లకు ఎలా ఉందో కాసేపు చర్చలు జరిపి. ఆలా ఆరుబయట పిల్లలంతా నులక మంచం పై పడుకొని ఆకాశంకేసి చూస్తే నెలవంక ఎంత అందంగా ఉండేదో. రాత్రి భోజనాలు చేసి తరావీ నమాజ్ చేసి పడుకుంటారు. ఈ రమజాన్ నెల మొత్తం మా ఊరి మస్జీద్ లైటింగ్ తో, నమాజ్ కి వెళ్లే జనాలతో వెలిగిపోతూనే ఉంటుంది.

ఇలా రమజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉంటారు. ఆ నెల మొత్తం ఒక కొత్త కళతో,సందడితో ప్రతి రోజు పండుగలానే ఉంటుంది. 

ఇది కేవలం కథ మాత్రమే కాదు ఎన్నో తీపిగుర్తులు. మరువలేని, తిరిగిరాని మధుర జ్ఞపకాలు. 

మా ముత్తాతగారు, తాతమ్మ కాలం చేసాక ఇంటికలతపింది.ఇప్పుడు మా ముత్తాతగారు లేరు ఇంటికి ఆ పండుగ కల లేదు. ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి వారి అత్తారింటికి వెళ్లిపోయారు, మగపిల్లలు ఉద్యోగాల పేరిట, చదువుల పేరిట పట్టణాలకు వెళ్లిపోయారు.ఈ జ్ఞపకాలన్నీ చెరపలేని మధుర జ్ఞపకాలుగా మిగిలిపోయాయి.


        - మరోక కథతో మళ్ళీ కలుదాం -

            మీ అనిసా తబస్సుమ్ sk


Rate this content
Log in

Similar telugu story from Drama