Dinakar Reddy

Abstract Drama Romance

4.5  

Dinakar Reddy

Abstract Drama Romance

ఓ కవిత చెప్పరూ..

ఓ కవిత చెప్పరూ..

1 min
581


ఏమండోయ్ కవి గారూ! బయట వర్షం పడుతోంది అంది శశి. మరి వేడి వేడిగా పకోడీలు.. అన్నాను.


ఓ మంచి కవిత చెప్పండి. అది నచ్చితే అప్పుడు పకోడీలు చేస్తాను అన్నది ఆమె.


భార్య అడగడమూ భర్త కవిత చెప్పకపోవడమూనా? వెంటనే ఇలా చెప్పేశాను.


బయట వర్షం

నా లోపల ఆలోచనల హర్షం

నిన్ను కలిసిన వేళ

నా ప్రేమ పేర్లు సహస్రం


తెలిసీ తెలియని అయోమయంలో

ఆలపించనా చక్కిలిగింతల గాంధారం

నవయవ్వనపు కెంపుల పొంగులో

నీ మెడలో నే కానా చంద్ర హారం (ఈ మధ్య కొనిమ్మని బాగా నస పెడుతుంటేను!)


కదిలీ కదలని మన వ్యవహారం

కొద్దిగా జరిపితే ఘనకార్యం

జామాతనై నీ కుటుంబమును చేయనా పావనం(ఇది పెళ్లికి ముందు అన్న డైలాగ్ లెండి)

అంగరంగ వైభవంగా చేసుకుని పరిణయం


ఏమంటావు నా శశీ!

నేనే కదా నీ అభిమన్యుడను

మనం కలిసి చెప్పుకుందామా మాయాబజార్ వ్యాఖ్యానము


ఆ సాయంత్రం వర్షాన్ని చూస్తూ నేను పకోడీలనూ తింటూ ఆమె సాంగత్యం ఇచ్చే అందమైన అనుభూతిని ఆస్వాదించాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract