ఒక రహస్యం
ఒక రహస్యం
నిన్న రాత్రి కూరలో ఉప్పు ఎవరో ఎక్కువ వేశారు. ఈశ్వర్ సాధనను చూస్తూ అన్నాడు.
సాధన ఇడ్లీ తింటూ అతణ్ణి చూసి మళ్లీ ఏమీ పట్టనట్లు చట్నీ వేసుకుని తినసాగింది.
కూరలో ఉప్పు ఎక్కువ వేసి కూరలోని రుచిని, అందునా వంకాయ కూర రుచిని చెడగొట్టిన వాళ్ళను నేనస్సలు వదిలిపెట్టను అన్నాడు ఈశ్వర్.
సాధన చేతులు కడుక్కుని, బాబూ షెర్లాక్ హోమ్స్ గారూ! కాస్త టిఫిన్ తిని నన్ను ఆఫీసు దగ్గర దింపండి అంది.
భర్తంటే అస్సలు లెక్క లేదు కానీ ఆఫీసు దగ్గర దింపాలట అని మొహం ముడుచుకున్నాడు.
ఒరేయ్ ఈశూ. ఆ ఉప్పు ఎక్కువ వేసింది నేనే అని తెలుసు కదా. ఎందుకు పొద్దున్నే సాధన బుర్ర తింటున్నావ్ అని ఈశ్వర్ వాళ్ళ అమ్మ కేక వేసింది.
