స్ఫూర్తి కందివనం

Drama Romance Tragedy

4.5  

స్ఫూర్తి కందివనం

Drama Romance Tragedy

ఒక మజ్ను కోసం-4వ భాగం

ఒక మజ్ను కోసం-4వ భాగం

7 mins
197


ఏడేళ్ల క్రితం.....

"కంగ్రాట్స్ వినీ...కంగ్రాట్స్ వినీ...అల్ ది బెస్ట్...గుడ్ లక్..." వినీకి కాల్స్, మెసేజెస్ చేస్తున్నవాళ్ళు అందరూ చెబుతున్న మాట ఇదే. బంధువులు, ఫ్రెండ్స్ అంతా గ్రీట్ చేస్తున్నారు. వినీ చాలా సంతోషంగా ఉంది.

"కంగ్రాట్స్ తల్లి..." అంటూ రఘు, పార్వతి వినీని దగ్గరికి తీసుకొని స్వీటు తినిపించి తన నోరు తీపి చేశారు.

"కంగ్రాట్స్ మంకీ..." అన్నాడు రిషి అల్లరిగా.

"థాంక్యూ రా.." అంది వినీ నవ్వుతూ.

హ్యాపీ మూడ్ లో ఉండడం వల్ల ఈ సారి తమ్ముడు అలా సంబోధించినా వినీ పెద్దగా పట్టించుకోలేదు.

వినీ ఇంత సంతోషంగా ఉండడానికి కారణం...తనకి ఎంసెట్ లో మంచి ర్యాంకు రావడంతో తను ఆశించిన విధంగానే హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో బీ.టెక్. బయోటెక్నాలజీ విభాగం లో సీటు రావడం...

"జాయినింగ్ ఎప్పుడు తల్లి...", అడిగాడు రఘు.

"వచ్చే నెల నాన్న", చెప్పింది వినీ ఎక్సైట్ అవుతూ.

"హమ్మయ్య... ఇక నేను ప్రశాంతంగా ఉండొచ్చన్నమాట..", అల్లరిగా అన్నాడు రిషి వినీని ఏడిపించడానికి.

వినీ బుంగమూతితో, "చూడండి నాన్న ఎలా అంటున్నాడో. నేను వెళ్తున్నందుకు కొంచం కూడా ఫీలింగ్ లేదు", అంది రిషి వైపు గుర్రున చూస్తూ.

"ఫీలింగ్ దేనికి.....నువ్వేమైనా యూ.యెస్ వెళ్తున్నావా.. ఇక్కడున్న హైదరాబాద్ కి ఇంత బిల్డప్ ఎందుకు", అన్నాడు రిషి వినీని మరింత ఉడికించడానికి.

అప్పుడు పార్వతి..."నువ్వూరుకోరా..." అని రిషి తల మీద ఒక్కటి కొట్టి...."వాడి మాటలెం పట్టించుకోకు వినీ", అంది తనని కూల్ చేయడానికి.

అదే సమయంలో కావ్య వినీకి ఫోను చేసి తనకి సీటు ఎక్కడ వచ్చింది అన్న విషయం చెప్పింది. అది తెలిసాక, తనకి సీటు వచ్చిన కాలేజీలోనే తన స్నేహితురాలికి కూడా సీటు రావడం వినీకి సంతోషం రెట్టింపయ్యింది.

కావ్య, వినీకి ఇంటర్మీడియట్ లో పరిచయం. ఇద్దరూ ఒకే క్లాస్, ఒకే బెంచ్ అవడంతో చాలా క్లోజ్ అయిపోయారు.

*************

చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయాయి.

ఆ రోజు వినీ, కావ్యలకి జాయినింగ్ డే. వాళ్ళు ఉండేది గద్వాల్. ఇద్దరూ వాళ్ళ ఫ్యామిలిస్ తో గద్వాల్ నుండి హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు. వాళ్ళకి సీటు వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. అక్కడ జాయినింగ్ కి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాక క్యాంపస్ లో ఉండే గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళి, వాళ్ళు ఉండటానికి సౌకర్యంగా ఉండే రూం చూసుకొని, ఫీస్ కట్టి లగ్గేజెస్ పెట్టేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలవడానికి హాస్టల్ బయటకి వచ్చారు. హాస్టల్లో ఉండడానికి వారికి కావలసిన సామాగ్రిని తెచ్చుకున్నారు.

వినీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వాళ్ళు వినీ ని వాళ్ళ దగ్గరే ఉండి చదువుకొమ్మన్నారు కానీ వాళ్ళు ఉండే ఏరియా యూనివర్సిటీకి చాలా దూరమవడంతో హాస్టల్లో జాయినయ్యింది. ఎలాగో తోడుగా కావ్య కూడా ఉంది కదా ఇద్దరూ కలిసి ఉంటారని ఇంట్లో వాళ్ళకి కూడా కొంచం కంగారు తగ్గింది.

ఇద్దరి పేరెంట్స్ వాళ్ళకి బాగా చదువుకొమ్మని, తగిన జాగ్రత్తలు చెప్పి ఊరికి బయలుదేరారు. ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండటం ఇదే మొదటిసారి కావటంతో ఇద్దరూ కొంచం బాధపడినా చదువు కోసం తప్పదని మనసుకి సర్ది చెప్పుకొని హాస్టల్లోకి వెళ్లారు.

*************

ఇంటికి చేరుకున్నాక రఘు, పార్వతిలకు వినీ లేకపోవడంతో ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించింది.

"ఇంటిని వదిలి ఎప్పుడూ ఇలా దూరంగా ఉండలేదు. ఎలా ఉంటుందో ఏమో..." అని రఘు బాధపడుతుంటే..

"బాధపడకండి...మీరే ఇలా డల్ అయిపోతే దానికి హోమ్ సిక్ వచ్చేస్తుంది. మనం ధైర్యంగా ఉంటేనే అక్కడ అది సంతోషంగా ఉంటుంది", అని పార్వతి రఘుకి ధైర్యం చెప్పింది. పైకి అలా అన్నదే కానీ పార్వతి మనసుకి కూడా చాలా కష్టంగా ఉంది వినీకి దూరంగా ఉండటం.

ఎదురుగా ఉన్నంతసేపు ఎప్పుడూ అక్కతో గొడవపడే రిషికి కూడా ఒక్కసారిగా అక్క లేని లోటు బాగా తెలుస్తుంది.

***********

వినీ, కావ్య వాళ్ళ రూంకి వెళ్ళాక వాళ్ళ రూంమేట్స్ అయిన రాజీ, సుప్రియా, సిరి లను పరిచయం చేసుకున్నారు. వాళ్ళు ముగ్గురూ ఉండేది గద్వాల్ కి సమీపంగా ఉండే ఊర్లే కావడంతో వినీ, కావ్యకి కాస్త రిలీఫ్ గా అనిపించింది.

ఇక ఫ్రెషర్స్ రావడంతో సీనియర్స్ అందరికి పండగే పండగ. ఆ రోజు రాత్రి డిన్నర్ టైం అయిపోయాక, సీనియర్స్ లో కొంతమంది ఒక రూంలో చేరి ఫ్రెషర్స్ అందరిని వాళ్ళ రూంకి రమ్మని కబురు పంపారు.

గీత, రాధ...వినీ వాళ్ళ పక్క రూం వాళ్ళు. ఇద్దరూ వినీ వాళ్ళ రూం కి వచ్చి అందర్నీ పరిచయం చేసుకుని..."సీనియర్స్ రమ్మంటున్నారు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోడానికంట", అని చెప్పారు.

కాసేపయ్యాక ఫ్రెషర్స్ అందరూ సీనియర్స్ రమ్మన్న రూం కి వెళ్లారు. వినీ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఓ పది పదిహేను మంది దాకా సీనియర్స్ గ్యాంగ్ ఉంది. ఫ్రెషర్స్ అందరూ లోపలికి రాగానే అందులో ఒకమ్మాయి..."హేయ్... డోర్ పెట్టేయి.. వార్డెన్స్ ఆర్ ఎవరైనా స్టాఫ్ చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది", అని ఇంకో సీనియర్ అమ్మాయికి చెప్పడంతో వెంటనే ఆ అమ్మాయి వెళ్లి డోర్ లాక్ చేసింది.

అప్పుడు వినీ వాళ్ళకి అర్థమయ్యింది, వాళ్ళు పిలిచింది పరిచయం చేసుకోడానికి కాదు ర్యాగ్గింగ్ చేయడానికని. ర్యాగ్గింగ్ చేయడానికి వీల్లేదని అంతకు ముందే మేనేజ్మెంట్ వాళ్ళు సీనియర్స్ ని హెచ్చరించడంతో కొంతమంది ఆకతాయి గ్యాంగ్ ఇలా రహస్యంగా హాస్టల్ రూంలో ప్లాన్ చేసారు.

సీనియర్స్ అంతా ఒక బెడ్ మీద కూర్చున్నారు. అందులో ఒకమ్మాయి లావుగా ఎత్తుగా ఉంది, అందరికీ మధ్యలో కూర్చుంది. తనను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది వాళ్లందరికీ లీడర్ తనేనని.

ఫ్రెషర్స్ అందరినీ వాళ్ళ ముందు వరుసగా నిలబడమన్నారు. తరువాత వరుసగా ఒక్కొకరిని ఇంట్రడ్యూస్ చేసుకొమ్మని చెప్పి, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని హేళన చేస్తూ కొన్ని యాక్టివిటీస్ చేయిస్తున్నారు. ఇద్దరు ఫ్రెషర్స్ అమ్మాయిలు పల్లెటూరి నుంచి వచ్చారు. వాళ్ళకి ఇంగ్లీష్ లో మాట్లాడడం అంతగా రాదు. వాళ్ళు సీనియర్స్ ని చూసి భయపడి ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళలా ఏడుస్తుంటే సీనియర్స్ నవ్వుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న వినీ కి వాళ్ళ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. చాలా కోపం వచ్చింది. వినీ కి మామూలుగానే ర్యాగ్గింగ్ అంటే అస్సలు నచ్చదు. దాని వల్ల ఎంతో మంది విద్యార్థులు మానసిక వత్తిడికి లోనవడం, దాని వల్ల ఎన్నో అనుకోని సంఘటనలు జరుగుతుండటం వినీ అనేక సార్లు వార్తల్లో వినడం వల్ల తనకి ర్యాగ్గింగ్ అంటే కోపం. అదీ కాక కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యే విద్యార్థులు వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలి చదువుకోడానికి దూరంగా వచ్చి ఉన్నప్పుడు చేతనైతే వాళ్ళకి ధైర్యం చెబుతూ సపోర్ట్ గా ఉండాలే కానీ ఇలా వాళ్ళని మానసికంగా మరింత వత్తిడికి గురిచేయకూడదు అని వినీ ఫీలింగ్.

అందరూ అయిపోయాక ఫైనల్లీ వినీ టర్న్ వచ్చేసింది. వినీ చివరగా నిలబడడంతో ప్లేస్ లేక గోడకి ఆనుకొని నిలబడింది. అది సీనియర్స్ కి నచ్చలేదు.

"ఏంటి...సీనియర్స్ అంటే గౌరవం లేదా. అలా స్టైల్ గా ఆనుకొని మరి నిలబడ్డావ్", అందులో ఒకమ్మాయి కాస్త దురుసుగా అంది.

"అలా ఏం లేదండీ....ప్లేస్ లేదు... సో..అలా నిలుచున్నాను", అంది వినీ.

"పేరేంటీ...ఏ ఊరు..", పొగరుగా అడిగింది సీనియర్స్ గ్యాంగ్ కి లీడర్.

అసలే కోపంగా ఉన్న వినీ వాళ్ళకి తగ్గట్టే దురుసుగా సమాధానం ఇచ్చింది.

"మీ ఊర్లో ఇట్లే మాట్లాడ్తారా..", అంది ఆ అమ్మాయి కొంచం వెటకారంగా. సీనియర్స్ అంతా నవ్వారు.

"అవును... మా ఊర్ల ఇట్లే మాట్లాడ్తర్..", వినీ కూడా వెటకారంగా సమాధానం ఇచ్చింది.

ఇంకేముంది....సీనియర్స్ కి పీకలదాకా మండింది. "ముందు, వెనక అక్క, మేడం అవేం వాడేది లేదా...రెస్పెక్ట్ తెలీదా...", అన్నారు.

వినీ కి వాళ్ళ బిహేవియర్, మాటతీరు అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళతో వాళ్ళకి తగ్గట్టే దురుసుగా ప్రవర్తించింది. "వీళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నారు..", అనుకుంది మనసులో.

వినీ చాలా సెన్సిటివ్ అండ్ రిజర్వ్డ్ గా ఉండే అమ్మాయి, కొంచం భయస్థురాలు కూడా. కానీ అదేంటో ఆ టైంలో తనకి ఏదో తెలియని ధైర్యం వచ్చింది.

ఆ తరువాత రూం కి వెళ్ళాక..."ఏంటే అలా మాట్లాడవు వాళ్ళతో ఏదన్నా ప్రాబ్లెమ్ అవుతుందో ఏమో", అంది రాజీ టెన్షన్ పడుతూ.

"హ్మ్..ఏమి కాదులే వాళ్ళకి అలానే అవ్వాలి. ఫస్ట్ టైం మా వినీ ఇంత డేరింగ్ గా మాట్లాడడం...వినీ సూపర్ గా ఇచ్చావ్ డోస్", అంటూ కావ్య నవ్వుతూ వినీ భుజంపై చెయ్యెస్తూ చెప్పింది.

"ఏమో ఏమవుతుందో ఏమో...", అనుకున్నారు మిగతావాళ్ళు టెన్స్డ్ గా ముఖాలు పెట్టి.

***********

మరుసటిరోజు వినీ... వాళ్ళ నాన్న ఫోన్ చేసినప్పుడు సీనియర్స్ ప్రవర్తన, ర్యాగ్గింగ్ విషయం చెప్పింది. రఘు వెంటనే కాలేజీ యాజమాన్యంకి ఫోన్ చేసి ర్యాగింగ్ విషయం కంప్లైంట్ చేశారు. రఘు అడ్వకేట్ అవడంతో ఏదైనా ఇష్యూ అవుతుందేమో అని వెంటనే హాస్టల్లో ర్యాగ్గింగ్ చేసిన సీనియర్ విద్యార్ధులని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. ముందుగా హెచ్చరించిన తరువాత కూడా వాళ్ళు అలాంటి చర్యలకు పాల్పడినందుకు చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది కాలేజీ యాజమాన్యం. మళ్ళీ రిపీట్ అయితే అందరికి టి.సి ఇచ్చేసి కాలేజీ నుంచి పంపించేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో కంప్లైంట్ ఇచ్చింది వినీ నే అయ్యుంటుందని వాళ్ళకి అర్థమైంది.

అదే రోజు వినీ, కావ్య వాళ్ళ క్లాస్ కి వెళుతుంటే దారిలో ర్యాగ్గింగ్ చేసిన సీనియర్స్ గ్యాంగ్ ఎదురుపడి..."కంప్లైంట్ చేసింది ఎవరో మాకు తెలుసు. మేమూ చూస్తాం నీకెవరు నోట్స్ ఇస్తారో...రికార్డ్, ప్రాక్టీకల్స్ లో ఎవరు హెల్ప్ చేస్తారో, సీనియర్స్ నుండి ఎలాంటి హెల్ప్ ఉండదు నీకు", అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.

ఆ బెదిరింపులకి వినీ అస్సలు భయపడలేదు. వినీ చదువులో చాలా షార్ప్. ఏదైనా పాఠాలు వినడం మిస్ అయినా కూడా తాను బుక్స్ రెఫెర్ చేసి సొంతంగా చదువుకోగల సామర్థ్యం ఉంది వినీ కి. సో వాళ్ళ మాటలని అస్సలు లెక్కచేయలేదు తను.

************

సంవత్సరం గడిచిపోయింది...

ఫస్ట్ ఇయర్లో వినీ నే టాపర్. దానితో తనకి వార్నింగ్ ఇచ్చిన సీనియర్స్ నోర్లు మూతపడ్డాయి. అలాగని మన వినీ వట్టి పుస్తకాల పురుగు అనుకునేరు. చదువుకునే టైంలో చదువు, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్మెంట్ ఏదీ మిస్ అవ్వదు. కాకపోతే తను క్లోజ్ గా ఉండేవాళ్ళతోనే వినీ ఫ్రీ గా ఉంటుంది. ఎవ్వరితోనూ తొందరగా కలవదు కాని ఒక్కసారి ఎవరితోనైనా క్లోజ్ అయ్యిందంటే చాలా జెన్యూన్ గా హోల్హార్టెడ్ గా ఉంటుంది. వినీ వీక్నెస్...ఎవరినైనా ఈజీగా నమ్మేయడం.

ఇదిలా ఉండగా వినీ వాళ్ళు ఇపుడు సెకండ్ ఇయర్.

ఓ రోజు విద్యార్థులందరికీ కోయంబత్తూర్లో బయోసైన్సెస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగబోతుందని నోటీసు వచ్చింది. దానికి హాజరవ్వాలనుకునే విద్యార్థులంతా వారి పేర్లని డిపార్ట్మెంట్ హెడ్ కి ఇవ్వాలని, ఇంట్రెస్టడ్ కాండిడేట్స్ పోస్టర్ ప్రెసెంటేషన్స్ కి రిజిస్టర్ చేసుకుని వాళ్ళ అబ్స్ట్రాక్స్ పంపమని తెలిపారు. వినీ, కావ్య, రాజీ, సుప్రియా, రాధ, సిరి, గీత పోస్టర్ ప్రెసెంటేషన్ కి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ కాన్ఫెరెన్సుకి బీ.టెక్ బూటెక్నాలజీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ విద్యార్థులందరినీ తీసుకెళ్లనున్నారు. ఎలాగూ కాన్ఫెరెన్సుకి వెళుతున్నాము కదా అని విద్యార్థులందరి రిక్వెస్ట్ తో కాన్ఫరెన్స్ పూర్తయినాక అక్కడ కొన్ని ప్లేసెస్ చూడడానికి మేనేజ్మెంట్ అనుమతించింది. ఓ పది రోజులు అంతా అక్కడే ఉండబోతున్నారన్నమాట. కాన్ఫరెన్స్ నాలుగు రోజులు జరుగనుంది. మిగతా రోజులు టూర్ కి ప్లాన్ చేశారు.

************

కాలేజీ యాజమాన్యం అరెంజ్ చేసిన బస్సులలో విద్యార్థులు, కొంతమంది స్టాఫ్ అంతా కోయంబత్తూరుకి ప్రయాణమయ్యారు. ఆటలు, పాటలు, విద్యార్థుల కేరింతలతో ప్రయాణమంతా చాలా సంతోషంగా సాగింది. కోయంబత్తూరుకి చేరుకున్నాక కాలేజీ వాళ్ళు ముందుగా బుక్ చేసిన హోటల్లో విద్యార్థులందరికీ రూమ్స్ ఇచ్చారు. కొందరు విద్యార్థులు వాళ్ళ ప్రెజెంటేషన్ కి రిహార్సల్స్ చేసుకుంటూ సిద్ధమవుతున్నారు, ఇంకొందరు వారికి సహాయపడుతున్నారు, మరికొందరు పాల్గొనని వాళ్ళు కాన్ఫెరెన్సుకి రెడీ అవుతున్నారు.

అందరూ రెడీ అయ్యాక విద్యార్థులు, స్టాఫ్ అంతా కలిసి కాన్ఫెరెన్సు ఆరెంజ్ చేసిన వెన్యూకి చేరుకున్నారు. ప్రెజెంటేషన్స్ ఇచ్చే వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళ పోస్టర్స్ ని వాళ్ళకి ఇచ్చిన స్లోట్స్ లో ఆరెంజ్ చేస్తున్నారు. డెలిగేట్స్, స్పీకర్స్ సెమినార్స్ అయిపోయాక విద్యార్థులు వరుసగా వాళ్ళ ప్రెసెంటేషన్స్ ఇస్తున్నారు. వినీ వాళ్ళు కూడా వాళ్ళ టర్న్ కోసం వేయిట్ చేస్తూ ఆడియన్స్ లో కూర్చున్నారు.

ఇంతలో ఒకతను తన ప్రెసెంటేషన్ ఇవ్వడానికి స్టేజీ ఎక్కాడు. కొంతమంది విద్యార్థులంతా అతనికి అల్ ది బెస్ట్ చెప్తూ చప్పట్లు కొడుతున్నారు.

తన నోట్పాడ్ లో ఏదో రాస్తూ వాళ్ళ అల్లరికి వినీ తలెత్తి స్టేజీ వైపు చూసింది. స్టేజీపై ఉన్న అతను వినీ కి కొంచం ఇంట్రెస్టింగ్ గా అనిపించాడు. అతను తన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసాడు. అతను సీరియస్ గా సెమినార్ ఇస్తుంటే ఎందుకనో వినీ కి అతను ఫన్నీగా అనిపించి నవ్వింది. అతని సెమినార్ అయ్యేంతసేపు వినీ అండ్ గ్యాంగ్ అతన్ని కామెంట్ చేసుకుంటూ నవ్వుతూనే ఉంది. ఇదంతా అతను గమనిస్తూనే ఉన్నాడు.

ప్రెజెంటేషన్ అయ్యాక స్టేజీ దిగి వస్తున్నాడు. అతను వస్తున్న వే లోనే పక్క రో లో వినీ కూర్చుంది. అటు నుండి వెళ్తూ వెళ్తూ వినీ వైపు చూసాడు.

అది గమనించిన వినీ చప్పున తన చేతిలో ఉన్న పేపర్స్ ని తన ముఖానికి అడ్డుగా పెట్టి కనపడకుండా కవర్ చేసుకుంది. అతను వెళ్లిపోయుంటాడని తన కళ్ళు మాత్రమే కనపడేలా మెల్లగా పేపర్స్ కిందకని చూసింది.

అతను వినీ వైపు బాణం లాంటి ఓ చూపు విసిరాడు....

"ఓ షీట్...", అంటూ పక్కకి తిరిగింది వినీ అతని చూపుకి కాస్త జంకి.

అతను తన ప్లేస్ కి వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్... "వినయ్....వినయ్....", అంటూ క్లాప్స్ కొడుతున్నారు.

వెంటనే సిరి... "హేయ్... అతను మన సూపర్ సీనియర్ వినయ్ యే...", అంది వినీతో.

"అవునా...! వినయ్ అంటే ఇతనేనా... బుక్ అయిపోయామంటావా....", అంది వినీ టెన్స్డ్ గా.

"ఏమో...చూడాలి...అంతా నీ వల్లే...అప్పటికి చెప్తూనే ఉన్నా కంట్రోల్ అని...వింటే కదా...", అంది సిరి కోపంగా.

"ఏంటే మీ గుసగుసలు... ఆపండి...మన స్టాఫ్ చూశారంటే మనకుంటది...", అంది కావ్య.

వినయ్, వినీ వాళ్ళ సూపర్ సీనియర్. ఇంతవరకు కాలేజీలో అతని పెరు వినడమే కానీ ఎప్పుడూ అతన్ని చూడలేదు వినీ. అతనికి చాలా ఫాలోయింగ్ ఉందని మాత్రం తెలుసు.

కాసేపయ్యాక వినీ మెల్లిగా వెనక్కి తిరిగి వినయ్ వైపు చూడగా అతను కూడా వినీ ని చూసాడు. అంతే వినీ గుండె వేగం హెచ్చించినట్లైంది, చప్పున మళ్ళీ ముందుకు తిరిగింది.

ఆ క్షణం తనకి మాత్రం ఏం తెలుసు ఆ నవ్వు వల్ల తన జీవితమే మలుపు తిరగబోతుందని.....

(ఇంకా వుంది....)


Rate this content
Log in

Similar telugu story from Drama