STORYMIRROR

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Classics Children

4  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Classics Children

నల్లేరు మీద నడక

నల్లేరు మీద నడక

1 min
22

నల్లేరు మీద నడక

********************

పూర్వం చామలాపల్లి అగ్రహారంలో ఉన్న పెద్ద బుగత గారి కుటుంబం ఒకసారి పట్నం వెళ్ళవలసి వచ్చింది. 


రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో దూర ప్రాంతాలకు ఎడ్ల బండి మీద వెళ్ళేవారు.


పాలేరుని పిలిచి “మేమంతా పట్నానికి వెళ్ళాలి బండిని సిద్ధం చేయు.” అన్నారు బుగత గారు..


“సరే బాబు” అని బండిలో చాపను పరిచి మెత్తగా ఉండటానికి వట్టి గడ్డిని వేశాడు. ఎండకు, వానకు దొరక్కుండా గూడుని సిద్ధం చేశాడు. ఎడ్లకు గడ్డి వేసి నీళ్ళు పట్టాడు. నల్లేరు తీగలు బండికి అడుగుభాగాన భద్రపరిచి ప్రయాణానికి సిద్ధం చేశాడు. కాసేపటి తర్వాత బుగతగారి కుటుంబం గూడుబండిలో పట్నానికి బయలు దేరింది. 


కొంత దూరం ప్రయాణం చేసాక బండిని ఆపి, కిందకి దిగాడు పాలేరు. “బండిని ఎందుకు ఆపావు?” అని అడిగాడు బుగత గారి మనవడు.


“ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది. ఆ గోతిలోంచి బండి వెళితే ఇరుసు విరిగిపోతుంది. అంతేకాక బండి భారీ కుదుపుకు లోనై కూర్చున్నవారికి నడుం నొప్పి వస్తుంది అందుకే ఆపాను.” అన్నాడు పాలేరు.


“మరేం చేస్తావు ఇప్పుడు” అని అడిగాడు బుగత గారి మనవడు.


“నేను తీసుకు వచ్చిన నల్లేరు తీగలను గోతిలో ఉంచుతాను. దాని వల్ల బండి సాఫీగా వెళ్తుంది, ఎలాంటి కుదుపులు ఉండవు” అని చెప్పి నల్లేరును గోతిలో ఉంచి బండిని ముందుకు పోనిచ్చాడు పాలేరు. 


పాలేరు చెప్పినట్లు గానే ఎటువంటి కుదుపులు లేకుండా వారి ప్రయాణం సాఫీగా సాగింది. పాలేరు తెలివికి మెచ్చుకున్నారు బుగత గారు. నాటి నుంచి నల్లేరు నుపయోగించి ఎంతదూరం అయినా కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణం చేసేవారు. అలా “నల్లేరుమీద నడక” అనే జాతీయం వాడుకలోకి వచ్చింది.


ఏదైనా పని లేదా కార్యం, సునాయాసంగా జరిగినప్పుడు, ప్రయాణం లేదా జీవితం సాఫీగా సాగినప్పుడు నల్లేరు మీద నడక అనే జాతీయాన్ని ఉపయోగిస్తున్నాము.

 

ఇక నల్లేరు విషయానికి వస్తే దారిపొడవునా తాటి చెట్ల పైకి తీగలా ప్రాకుతూ కనిపిస్తుంది. ఇది ఆకుపచ్చగా మెత్తగా స్పాంజి వలె ఉంటుంది. ఇది ఎన్నో ఔషధ గుణాలు కలిగినది.


Rate this content
Log in

Similar telugu story from Classics