నీ పయనం ఎటువైపు.. కులమా..మతమా?
నీ పయనం ఎటువైపు.. కులమా..మతమా?
నీ పయనం ఎటు వైపు...కులమా ? లేక మతమా ?
కరోనా వైరస్ కి కులం మతం తెలియదు,
కనిపిస్తే కాటువేయడమే..
ఆకాశం నుండి ఊడి పడే ఉల్కకు కులం మతం తెలియదు,
పడిన ప్రతిచోటా నాశనం చేయడమే..
సముద్రపు తీరాన సంబరాలు చేసుకుంటున్నప్పుడు వచ్చే సునామీకి కులం మతం తెలియదు,
ముందు ఎవరున్నా ముంచేయడమే..
గాలి , నీరుకి కులం మతం తెలియదు
గాలి, నీరు విషమైతే మిమ్మల్ని అందరిని చంపేసుకుంటూ పోవడమే...
మీ మూర్ఖపు ఆలోచనల నుండి విముక్తి పొందండి..
గాలి ఊపిరి అందివ్వకపోతే,
నీరు మీ దాహం తీర్చకపోతే,
నేల మీ ఆకలి చూడకపోతే,
ఒక్కక్షణం బతకలేని మీరు
ఈ రోజు మా మతం, మా కులమే గొప్పదని విర్రవీగుతూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తే...
రేపు మతం మాకు అక్కర్లేదు
మాకు మనుషులే ముఖ్యమని
మాకు కులాలు అక్కర్లేదు
మానవ హక్కులే ముఖ్యమని
గొంతెత్తే చైతన్య సమాజం వస్తే
అప్పుడు ఎటు వెళ్తారు ? కులం వైపా ? మతం వైపా ? వెర్రి జనాల్లారా...!
అది ఉల్కాపాతం కన్నా,
సునామి భీభత్సం కన్నా,
కరోనా విపత్తు కన్నా భయంకరమైనది మరి అప్పుడు ఎటు వెళ్తారో నేను చూస్తా...?? ఖబర్ధర్౼నర్ర పాండు
