Dinakar Reddy

Abstract Drama Action

4  

Dinakar Reddy

Abstract Drama Action

నేస్తమా! ఇద్దరి లోకం..

నేస్తమా! ఇద్దరి లోకం..

1 min
815


అదేంట్రా! షాలిని అందర్నీ పిలిచి నిన్ను మాత్రం పెళ్లికి పిలవలేదు. ఏమైనా గొడవ పడ్డారా? సంతోష్ అడిగాడు.


మధుకర్ అడ్డంగా తల ఊపుతూ అలాంటిదేం లేదురా అని అన్నాడు. 


ఆ రోజు మధుకర్ ఫేస్బుక్ అకౌంట్ కి ఒక సుదీర్ఘమైన మెసేజ్ వచ్చింది. అది షాలిని దగ్గర నుంచి.


హాయ్ మధూ. సారీ మధుకర్ గారూ! అవును. నేనిప్పుడు అలానే పిలవాలి. నిన్నే కాదు. నా భర్తను తప్ప ఏ మగ వ్యక్తితోనూ చనువుగా ఉండడం సాధ్యపడదు. ఆయన చెడ్డవారు అని నేను అనను. ఎంత మంది భర్తలు తమ భార్యల స్నేహ సంబంధాల్ని అర్థం చేసుకోగలరు? 


మనం చాలా విషయాల్లో డెవలప్ అవుతూ ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ మధుకర్, ఒక ఆడా మగా మధ్య స్నేహాన్ని సమాజం ప్రేమ లేదా మరో బంధంగానే చూడగలుగుతోంది. ఏ కొద్ది మందో స్వచ్ఛమైన మన స్నేహాన్ని అర్థం చేసుకోగలుగుతారు. మిగతా వారికి మనం పనిగట్టుకుని చెప్పలేం కదా. 


అందుకే. నిన్ను నా ప్రాణ స్నేహితుడిగా మనసులోనే నిలుపుకుంటాను. నిన్ను ముందు పెట్టుకుని నాకేం పట్టనట్లు నేను ప్రవర్తించలేను. అందుకే పెళ్లికి పిలవలేదు. ఇకపై నీకు ఈ మాత్రం స్వేచ్ఛగా కూడా మెసేజ్ చేయలేకపోవచ్చు. 


నా హితాన్ని కోరే స్నేహితుడికి గుడ్ బై..


షాలిని పంపిన మెసేజ్ చదివి అతను బాధ పడలేదు. కానీ.. ఎక్కడో ఆలోచన.. అంతలో కన్నీటి బొట్లు జల జలా రాలి పడ్డాయి.


నేస్తమా! ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అంటూ అతడు హమ్ చేశాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract