నేనే ఆదిని
నేనే ఆదిని
నేనే ఆదిని ౹
నేనే మహాఆదిగని ౹౹
దగ దగ మెరిసే నిప్పుని
డమ డమ మోగే డప్పుని
నేనే ఆదిని ౹
నేనే మహాఆదిగని ౹౹
నింగికెగిసిన తారల నిలువటద్దాన్ని
నిజాయితీకి నిలువెత్తు రూపాన్ని
నేనే ఆదిని ౹
నేనే మహాఆదిగని ౹౹
సమాజాన్నీ నడిపే శక్తిని
కాదంటే చీల్చే కత్తిని
నేనే ఆదిని ౹
నేనే మహాఆదిగని ౹౹
✍️నర్ర పాండు రావణ్ మహారాజ్ అశ్వగోష్ బుద్ధ
