నా కలం
నా కలం
నా కలం
నన్ను ఆప్యాయంగా పిలిచి నన్ను ఆదరించే నా బాహ్య ఆత్మ నా కలం
నా ఆనందాలను అందమైన జ్ఞాపకాలుగా మలిచిన మంత్రదండం నా కలం
నా మనస్సును ఎంతో మనోహరంగా వ్యక్త పరిచిన వ్యక్తిత్వం నా కలం
సూర్యోదయాన నా ఊహలకు ఊపిరిపోసే అక్షరదాత నా కలం
నా బాధలను ఎంతో ఓర్పుగా పంచుకునే ఏకైక నేస్తం నా కలం
నా ఒంటరితనాన్ని ఓడించి నాతో జతకట్టే నా చెలి నా కలం
అలసిన మనస్సుకు ఆనందంగా అక్షర బక్షానిచ్ఛేది నా కలం
భాధల్లో కన్నీటిని ఆనందంలో ఆనందభాష్పాల్ని సిరగా నింపుకొని పలికే వాణి నా కలం
ఇన్ని చేసిన నీకు నేను చేసేది ఒట్టి సలాం
అందుకే అందుకో నా సలాం ఓ నా కలం-నర్ర పాండు✍️
