Srinivasa Bharathi

Drama

3  

Srinivasa Bharathi

Drama

మరణాన్ని జయించిన మానవుడు..

మరణాన్ని జయించిన మానవుడు..

5 mins
714


నాపేరెత్తకుండా ఎవడూ ఉండలేడు" గర్వంగా అన్నాడు వాడు.

"ఎవడ్రా నువ్వు"

"అది నేనే"

"ఎంత బుర్ర తిరుగుడు"

"నా యిష్టం"

"సిదగ్గోడతా"

"నేను తన్నలేనా"

ఇద్దరు ఒళ్ళు అలసిపోయేలా తన్నుకున్నారు.ఆ యుద్ధంలో వాడి చొక్కా భుజం వరకు చిరిగి పోయింది

అప్పుడు చూసాడు అప్పిగాడు..."ఒరేయ్ నువ్వు నిజంగా ఎవడ్రా నువ్వే.". అంటూ. మరుక్షణంలోనే ఇద్దరూ స్నేహితులై పోయారు.

కాలం పదేళ్ళని గొంగలిపురుగులా కొరికేసింది.

ఇప్పుడు వాళ్లిద్దరూ ఛోటా మోటా రౌడీలు.

అనాధాలుగా, అవమానాలు భరిస్తూ పెరిగిన శరీరాలు, పస్తులు పడుతూ ఛీత్కారాలు పొందిన మనసు..చాలాసార్లు ఎదురు తిరిగేలా చేసి రౌడీగా ముద్ర వేసింది ఇద్దరిని.

పోలీసు దెబ్బలు కూడా వాళ్లలో సున్నితత్వాన్ని చంపేసి మొరటు మనుషులుగా మార్చింది.

ఎవడ్రా నువ్వు కు పేరేమీ లేదు. తాగుబోతు వెధవఒకడు బాగా తాగేసి,తనకూ తాగించి,చేతిపై చెక్కిన పచ్చబొట్టు ఆ పేరు. వాడి సరదా అది. ఊహ తెలిసాక చాలా కాలం వాడి గురించి,ఎందరినో అడిగి అడిగి, చాలాచోట్ల వెదకి

వెదికి అలసి పోయినా ,దొరికితే వాడ్ని చావదన్నాలన్న కోరిక ఇంకా బ్రదికే ఉంది..ఎవడ్రా నువ్వు లో...చాలాకాలం.

మరో పదేళ్లు గడిచేందుకు పదినిముషాల ముందు ఎవడ్రా నువ్వు టీ షాపులో టీ తాగాడు. అటూ ఇటూ చూస్తూ ఎటు వెళ్లాలో ఆలోచించేలోగా మానవ బాంబు పేలింది.

రెండో నిమిషంలో ఎవడ్రా నువ్వు యమలోకం లో తేలాడు.

పిలుపు లోనే జాలికలిగింది యముడికి.

"నిన్ను చూసి నాకు జాలి వేస్తోంది. నిన్ను భూలోకం పంపిస్తున్నాను. నా ప్రతినిధిగా నువ్వు కొందరిని శిక్షించ వచ్చు. ఐతే ఒక షరతు. నువ్వు శిక్షించే వాడు ఖచ్చితంగా ప్రజల్ని దోచుకొన్న వాడై ఉండాలి. నువ్వు ఏమంటే అది జరుగు తుంది.తప్పు చేస్తే వందేళ్ల నరకం నీకు తప్పదు.. నీ మరణం నా నిర్ణయం పై ఉంటుంది. చావు భయం లేకుండా నీ బాధ్యత నువ్వు చేయు" అన్నాడు యుముడు.

"అలాగే స్వామి" అన్నాడు ఎవడ్రా నువ్వు.

యమధర్మరాజు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు వెనక యుగాల కందని అలసట ఉంది.సుమారుగా ఐదువందల ఏళ్ళ నుండి నరకంలో అందరూ యంత్రాల్లాఎంత పని చేస్తున్నా తరగడం లేదు. అదీ అసలు కారణం.

భూలోకం లోకి వచ్చిపడ్డాడు ...ఎవడ్రా నువ్వు.

వాడికెంతో ఆనందం వేసింది. పాపాత్ముల్ని భూలోకంలో శిక్షించే అధికారం వాడికి లభించిందని.

ఈలోగా భూలోకంలో మానవ బాంబు విషయం ప్రపంచ వ్యాప్తం ఐపోయింది.మరీ ముఖ్యంగా ...ఈ పచ్చబొట్టుగల తెగిపోయిన చెయ్యి, ఆ పేరు(ఎవడ్రా నువ్వు) మరింతగా మారుమోగి పోయింది.

భూలోకంలో ఐతే మళ్ళీ పడ్డాడు గానీ ,ఇప్పుడు తనేం చెయ్యాలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు.

"పాపం చెయ్యకూడదు...అంటే ఏ తప్పులు చెయ్యకూడదు...అంటే భూలోక నియమాల్ని దాటకుండా న్యాయ బద్దంగా బ్రదుకు సాగించాలి.ఎలా అన్నదే సరిగా ఆలోచించుకోవాల్సిన విషయం.యమధర్మరాజు తనను భూలోకానికి పంపి పెద్ద శిక్షే వేశాడ"నుకున్నాడు.

ఉన్న వస్త్రాలతోనే ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు.

రెండు గంటలు గడిచాయి. ఎండాకాలం. ఎదురుగా ఉన్న ఇంటి వాళ్లలో ఒకర్ని బ్రదిమాలి రెండు గ్లాసుల నీరు త్రాగాడు. ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది.

సమీపంలోనే ఒక గర్భిణీ ప్రసవ వేదన పడుతోంది సుమారు గంటనుండి. భర్త అక్కడనుండి అటూ ఇటూ తిరిగేస్తున్నాడు.

ఎవడ్రా నువ్వు అంతా గమనిస్తూనే ఉన్నాడు.

"ఏం పర్లేదు. ఆడపిల్ల.బుగ్గమీద చింత పిక్కంత పుట్టుమచ్చ..మంచి పేరు తెస్తుందిలే "అన్నాడు యధాలాపంగా.

ఇంటికి వైద్యానికి వచ్చిన మంత్రసాని, మరో డాక్టర్ పెద్ద ప్రాణం గురించి భయపడుతున్నారు..తల్లి బ్రతకడం..మీద వాళ్ళ అనుమానం.అదే అన్నారు వాలు కుటుంబ పెద్దతో

"ఇద్దరికీ ఏమీ కాదులే..గాభరా పడకండి."అనునయంగా అన్నాడు ఎవడ్రా నువ్వు.

అలాగే జరిగింది.

ఇది జరిగిన గంటలోగా అతడికి ఆ కుటుంబం అతిధి మర్యాదలు చేసింది.

ఇది ఆ నోట ఈ నోటా పాకి కోలనీ అంతా వ్యాపించింది.

ఆ చెట్టే ఆశ్రమం అయింది.

వచ్చేవారుపెట్టె నమస్కారాలు, చూపించేభయ భక్తులు పెరిగి పోతున్నాయి.

"ఎవడ్రా నువ్వు" ఆశ్రమం తయారైంది.ఇప్పుడతడు గురువు గారు అందరికి. -పేరుతో పిలవడం ఇష్టం లేక.

అందరూ చందాలు వేసుకొని ఒకయిల్లు పోరంబోకు స్థలంలో నిర్మించారు... ఎవడ్రా నువ్వు ఉచితంగా అసలు ఒప్పుకోలేదు.దాంతో ఆ స్థలం కొనిచ్చారు.

ఎవడ్రా నువ్వు పేరుతో ఆశ్రమం పురుడు పోసుకొంది.

"ఎవడ్రా నువ్వు"అని ఆలోచిస్తే మనిషి గురించి తాత్విక చింతన ఆ పదాల్లో కన్పిస్తుంది.

కొన్నాళ్లలో ఎన్నికలు... అన్న ప్రకటన టివిలో.

ఈ లోగా ఒక విశేషం జరిగింది.

ఒక రౌడీ వచ్చాడు..బెదిరిద్దామని..అలా తన బ్రదుకు నిశ్చింతగా వెళ్ళిపోతుందని.

"చావు భయం నిన్నీ రోజు రెండు సార్లు హెచ్చరిస్తుంది.ఫో ముందిక్కడ్నుంచి." కసురుకున్నాడు..ఎవడ్రా నువ్వు అలియాస్ గురువు గారు.

అలాగే జరిగింది. అప్పటినుండి వాడు పాదాక్రాంతుడై ఆశ్రమం పనులు చేసుకొని బ్రతకడం మొదలెట్టాడు. నాలుగు రోజులు అందరూ భయం భయంగా వచ్చినా రౌడీయిజం పోగొట్టిన ఆ మహిమనూ అందరికీ ప్రచారం చేశారు.

ఆరు నెలల్లోఎన్నికలని ప్రకటన వచ్చింది. రౌడికి కబురందింది వచ్చి కలవమని. తాను రానని, రాలేనని ,తమరే రండని వచ్చిన వాళ్లతో కబురు అందించాడు రౌడీ.

అవసరం ...అధికారం కోసం వచ్చి కలిసింది....

"గురుస్వామి ఏమి చెప్తే అదే "అన్నాడు రౌడీ.

అక్కడే ఉండి వింటున్న వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.

"ఏమిటీ ఈ ధైర్యం" అని.

నాయకుడికి ఒక మెట్టు దిగక తప్పలేదు. లోలోపల పళ్ళు కోరుక్కుంటూనే దీర్ఘంగాఆలోచిస్తున్నాడు..మొత్తం ఆ కోలని రెండువేల ఓట్లు..గంపగుత్తగా పడడం గురించి.

రౌడీ పెట్టిన గురుస్వామి పేరు బాగుందని అందరూ అనడంతో ..ఆ పేరు సార్ధకం అయ్యింది అందరి నోట్లో నాని. ఆశ్రమం పేరు మార్చడానికి ఒప్పుకోలేదు స్వామి.

రెండు రోజులు గడిచాయి.

"అయ్యా తమరేం చెప్తే అలాగే. నన్ను గెలిచేలా ఆశీర్వదించండి.."అన్నాడు నాయకుడు స్వామి రెండు కాళ్ళు పట్టుకొంటూ.

"దైవానుగ్రహం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది..లే నాయనా"

"మీరు ఆశీర్వదిస్తే చాలు."

"అది సాధ్యం కాదు. ఇంతవరకు నీ సంపాదనలో సక్రమం ఎంత , అక్రమం ఎంత?"

"అక్రమమే ఎక్కువ."

"దాన్ని పూర్తిగా ఖర్చు చెయ్యి. ఇక్కడ ఒక బడి కట్టించు.

ప్రయాణీకులకు విశ్రాంతి గది, మంచినీటి అవసరం ఉన్నచోట్ల బోర్లు,అలా ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటే గెలుపు సాధ్యం కావచ్చు. "అన్నాడు గురుస్వామి.

విసురుగా మొగం తిప్పి వెళ్ళిపోయాడు నాయకుడు.

"ఎన్నికల్లో ఓ విచిత్రం చూస్తారు మీరంతా" అన్నాడు గురుస్వామి.

కాలనీ వాళ్ళు తప్ప మరెవరూ నమ్మలేదు స్వామి మాటల్ని.

ఈలోగా స్వామి ప్రభావంతో ఆ కోలని వాళ్లంతా స్వామి చెప్పిన మాటలు విని అక్రమం,అన్యాయం లేకుండా బ్రతకడం మొదలు పెట్టారు.

కూలీ పనులకు వెళ్లినోళ్ళు త్రాగడం మానేశారు. చదువుకొని ఖాళీ గా ఉన్న వాళ్ళు పిల్లలకు ఉచిత విద్య అందించారు. విదేశీ కరెన్సీలో బాగా డబ్బున్న ఐదారు కుటుంబాలు స్థానిక ప్రజల అవసరాలు తీర్చేందుకు ముందుకొచ్చాయి.. కోలని భూలోక స్వర్గం గా మారింది.

ఆశ్రమం లో పండించిన కూరగాయలుఅక్కడి వారెవరైనా తీసుకోవచ్చు. పాతబట్టలు, పుస్తకాలు, ఇలా ఓ గది, ఒకఆసుపత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు...లేదన్న మాట లేకుండా.

పని చేయడం..కడుపునిండాతినడంతప్పనిసరి.రేపటికోసం దాచుకోవాలని ఆశ్రమ వాసులెవరూ అనుకోరాదు అంతే. పక్షి, జంతు జీవితం...బ్రతకడంలో.

ఎన్నికలు ప్రకటించారు.

స్వామివారిని కలిసాడు నాయకుడు. మర్యాదగాను,బ్రతిమాలి, బెదిరించి ,భంగపడ్డాడు.

స్వామికి కోపం వచ్చింది. "నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత గొప్ప వాళ్లే ప్రచారానికి వచ్చినా లక్ష ఓట్ల తేడాతో ఓడిపోతావ్. ఫో ఇక్కడినుండి" కోపంగా అన్నాడు స్వామి.

నాయకుడికి పట్టుదల పెరిగింది. "గెలిచి తీరుతా. నీ అంతు చూస్తా "అని వెళ్ళిపోయాడు.

స్వామి చిరునవ్వే సమాధానం.

ఇదంతా పత్రికల కెక్కింది.

ఇంతవరకు అక్కడికే పరిమితమైన సేవాభావం చాలా మందికి తెలిసింది....మరింత వివరంగా.

జనం తండోపతండాలుగా రాసాగారు. అతిథులకు ఒక్కపూట మాత్రమే ఉచిత భోజనం. రెండోపూటఉండాలంటే మాత్రం ఏదైనా పనిచేసి ఎంతోకొంత సంపాదిస్తేనే భోజనం ఇదీ అక్కడి రూల్.అతిధి భోజన ఖర్చుల బాధ్యత ఒక షావుకారుది.

అన్నిసార్లు ఉచితంగా పెడతానన్నా స్వామి అంగీకరించలేదు.

ఎన్నికల ప్రకటన వచ్చింది. నియోజక వర్గం ఓట్ల పండగతో వేడెక్కింది.

నాయకుడు ఎన్నడూ ఖర్చు చేయనంతగా ఖర్చు చేసేందుకు సిద్దపడ్డాడు.డబ్బు వరదలా చోట్లు మారుతోంది.

"సి" పేరు గలవాడు, నిజాయితితో, సాత్వికంగా బ్రదికేవాడు కావాలి. వాడే గెలుస్తాడు. అబద్దం చెప్పేందుకు భయపడేవాడు ఐ ఉండాలి. వాడి గెలుపు దేశ రాజకీయాల్ని మారుస్తుంది. " అన్నాడు స్వామి.

నాయకుడుకి ఈ విషయం తెలిసింది. .."తన పేరులో సి లేదు. అలాగని వేరెవరినో పోటీకి దించి ,తాను దూరం కావడం ఇష్టం లేదు. మరో "సి" ని వెదికి ప్రత్యర్థి ఓట్లు చీల్చుకుంటూ పోవచ్చు.ఎలాగైనా స్వామిని ఓడించాలి. అదే అసలు విజయం "అనుకున్నాడు నాయకుడు.

వెదగ్గా, వెదగ్గా సిద్దార్ధ దొరికాడు స్వామికి.

కబురు పంపిస్తే వచ్చాడు సిద్దార్ధ.

స్వామి ఒకటే చెప్పాడు.."డబ్బు కోసమో,పేరు కోసమో, సంపాదన కోసమో తాపత్రయ పడకు. స్వార్ధ పరుల్ని చేర్చుకొని, నీచ రాజకీయాల గురించి ఆలోచించకు. రాబోయే ఇరవై ఏళ్లు నీవే.వేరే ఆలోచన్లొస్తే రెండేళ్లే ఆయుస్సు.మరో జన్మ ఆయుస్సు నీకు ధార పోస్తున్నాను...సరిగ్గా బ్రతకమని..నా మాటలమీద నమ్మకం ఉంచుకో. దేశం నీలాంటి ఉత్తముడ్ని ప్రతినిధిగా చూడాలనుకొంటోంది. మరో ఐదు రోజుల్లో నీకు ప్రాణాపాయం ఉంది. ఐనా మరణం జయిస్తావు నువ్వు.

నీకేం కావాలి. అల్ప ఆయువు గల సంపాదనా?, చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలా?.. ఐదు రోజుల్లో చెప్పు నీ నిర్ణయం" అన్నాడు స్వామి స్థిరంగా.

అపనమ్మకంగా ఎవరికీ చెప్పకుండా వేరే రాష్ట్రం పోయి వారం పోయాక వద్దాం అనుకుని, "అలాగే" అని వెళ్ళిపోయాడు సిద్దార్ధ.

వారం రోజులు గడిచాయి.గండం గట్టెక్కడంతో స్వామిని పూర్తిగా నమ్మాడు సిద్దార్ధ.

నామినేషన్ వేశారు చాలామంది. అందులో సిద్ధార్ధ ఒకడు, నాయకుడు, సిద్ధాంతం మరొకడు...లెక్కలోకి రాని మరో పదిమంది.

ఎన్నికలు వేడెక్కుతున్నాయి.

స్వామి సిద్దార్ధను సపోర్ట్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో

ప్రజల్లో మార్పు అన్నిచోట్లా మొదలైంది....

నాయకుడి ఒత్తిడి వల్ల దేశస్థాయి నాయకులు ఒకరిద్దరు

ప్రచారానికి వచ్చారు.

సిద్దార్ధ ప్రచారంలో స్థానిక సమస్యలు, అభివృద్ధి ప్రస్తావన వచ్చింది...అన్నిటికంటే ముఖ్యంగా.

ఎన్నికలు అయిపోయాయి. స్వామి అందరూ తప్పకుండా ఓటు వేయాలనడంతో ఓటర్ల లిస్టు లో 95% ఓట్లు పోలయ్యాయి. మిగిలినవి మరణాలు., వలసలు.

సిద్దార్ధ కు 3 లక్షల ఓట్లు, నాయకుడికి 2 లక్షలఓట్లు వచ్చాయి.మిగిలిన వారందరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు..వారి ఓట్లన్నీ కలిపి అరలక్ష లోపే.

సిద్దార్ధ ను మంత్రి పదవి వరించింది...పార్టీతో సంబంధం లేకుండా.

గ్రామీణాభివృద్ధి క్రియలో భాగంగా అన్ని చోట్లా ఆశ్రమం లక్ష్యాలతో ముందుకు దూసుకు పోతోంది. ..సిద్దార్ధ నాయకత్వంలో. పని..నమ్మకం...బాధ్యత .. సూత్రంగా.

హోంమంత్రి, ఆర్ధిక మంత్రులు కూడా స్వామి శిష్యబృందం లో చేరడంతో అవినీతి, నేరాల స్థాయి బాగా తగ్గాయి....నూతన మార్పులు రావడంతో.

అలా పదేళ్లు గడిచాయి.

ఇప్పుడు సిద్దార్ధని ప్రధాని పదవి వరించింది.

యమధర్మరాజు గారి సిబ్బందికి పని తగ్గింది...కొంత ప్రశాంతతతో .

ఇప్పుడు ఇంద్రుడు ఆలోచిస్తున్నట్టుంది..తన పని వత్తిడి తగ్గించడానికి ఏమార్గం ఎంచుకోవాలో...

        ----------౫౬౮౯౯౦౪౩౨౧-------



Rate this content
Log in

Similar telugu story from Drama