RAMYA UPPULURI

Abstract Inspirational Others

4  

RAMYA UPPULURI

Abstract Inspirational Others

మనసుంటే మార్గం ఉంటుంది కదా

మనసుంటే మార్గం ఉంటుంది కదా

3 mins
630



ఒకరోజు మా క్రింద ఫ్లాట్లో ఉండే ఆవిడ ఫోన్ చేసి,


"రమ్యా, మన అపార్ట్మెంట్లో ఉండే ఓ నాలుగు కుటుంబాలు కలిసి, సింపుల్ కేటరింగ్ సర్వీస్ మొదలు పెట్టాము.


మీకు ఏమన్నా కావాలి అంటే చెప్పు."


అని అన్నది.


"హా అలాగే, ఇంతకీ ఎలా ఉంటుంది మీ సర్వీస్, ఏమేమి ఇస్తున్నారు,


టిఫిన్, లంచ్, డిన్నర్ మెనూ ఏమిటి ?"


అనడిగాను.


దానికి తను,


"హా, అలా ప్రత్యేకంగా ఒకటే మెనూ అని ఏమీ లేదు.


నీకు కాస్త అర్థమయ్యేలా చెప్తాను ఉండు.


రేపు నేను ఏమి చేద్దాము అనుకుంటున్నది, ఇవాళ ఏదో ఒక సమయంలో మన గ్రూప్లో మెసేజ్ చేస్తాను.


ఉదాహణకు,


*  రేపు ప్రొద్దున నేను, పెసరట్టు ఉప్మా చేస్తున్నాను అనుకో ఆ విషయం ఇవాళ సాయంత్రం చెప్తాను. దానితో పాటు ఒక ప్లేట్ పెసరట్టు ఉప్మా ఖరీదు ఎంతో కూడా చెప్తాను.


కావలిసిన వాళ్ళు, వారికి ఎన్ని ప్లేట్లు కావాలో ఇవాళ రాత్రి లోపు నాకు చెప్తారు.


ఆ లెక్క ప్రకారం రేపు ప్రొద్దున తయారు చేసే ఉంచుతాను.


చక్కగా ప్యాకింగ్ చేసిన తరువాత, మీ అందరికీ టిఫిన్ సిద్ధంగా ఉందని మెసేజ్ చేస్తాను.


కాస్త అటూ ఇటూగా, మీ వీలు చూసుకొని వచ్చి డబ్బులు ఇచ్చి మీ పార్సిల్ తీసుకు వెళ్ళవచ్చు.


* అలాగే, ఒకవేళ ప్రియాంక లంచ్ కి గుత్తి వంకాయ కూర, పాలకూర పప్పు చేస్తోంది అనుకో, తను కూడా ఈ విషయం ఒక రోజు ముందు, గ్రూప్లో చెప్తుంది. కావలసిన వారు ఆర్డర్ పెట్టవచ్చు.


* శ్రీలేఖ స్నాక్స్ చేయడంలో దిట్ట అన్న విషయం మన అందరికీ తెలుసు కదా !!


తను చేయాలి అనుకున్న స్నాక్స్ గురించి తను చెప్తుంది. నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు.


* సమీరా రోటీ, పుల్కాలు బాగా చేస్తుంది. 


తను కొంత కాలం గుజరాత్ లో ఉంది కదా !! అందుకని తనకు అక్కడి ఆహారపు అలవాట్లు అన్నీ బాగా తెలుసు.


అందువల్ల, రకరకాల రోటీలు, రకరకాల సబ్జీలు తయారు చేస్తుంది. తను కూడా, చేయాలి అనుకున్న ఆదరువుల గురించి, ఒక రోజు ముందుగా మన గ్రూప్లో మెసేజ్ చేస్తుంది.


నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు.


* ఇలా ప్రొద్దున టిఫిన్ దగ్గర మొదలు పెట్టి, మధ్యాహ్నం లంచ్ గురించి, సాయంత్రం స్నాక్స్ గురించి, రాత్రి డిన్నర్ గురించి, ఎవరు ఏమి చేయాలి అనుకుంటున్నారో ముందు రోజే చెప్తారు.


నచ్చితే, ఆర్డర్ ఇవ్వొచ్చు, లేదంటే మెసేజ్ చూసి ఊరుకోవచ్చు. అది మన ఇష్టం.


* ఇలా ప్రస్తుతం, నాతో పాటు, వాళ్ళు ముగ్గురు ఈ కేటరింగ్ సర్వీస్ చేయడం మొదలు పెట్టారు.


మా ఆలోచన నచ్చిన వారు ఎవరన్నా ఉంటే, వారు కూడా తాము చేసే వంటల వివరాలు గ్రూప్లో పెట్టి, దానికి తగ్గ ఖరీదు ఎంతో చెప్పి, ఆర్డర్లు తీసుకోవచ్చు.


ఇదన్న మాట క్లుప్తంగా !!


అర్థమయినట్టేనా !! లేక ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడుగు. మరి కాస్త వివరంగా చెప్తాను."


అన్నది.


"ఎటువంటి సందేహాలూ లేవు మా, చక్కగా అర్థమయ్యింది.


చాలా చక్కటి ఆలోచన చేశారు మీరు అంతా కలిసి !!


ఎవరికీ నచ్చిన వంట వారు చేయవచ్చు, ఒకరోజు ముందే చెప్పవచ్చు.


ఆర్డర్ ను బట్టి సిద్ధం చేసి ఇవ్వవచ్చు.


ప్రతీ రోజూ ఖచ్చితంగా చేసి ఇవ్వాలి అన్న నియమం లేదు, అలానే ఫలానా ఆదరువులే చేయాలి అన్న నియమమూ లేదు.


మన వీలు, మన ఓపికను బట్టి చేసుకోవచ్చు.


చాలా చాలా బాగుంది.


అన్నిటికీ మించి ఇంటి భోజనం, ఎంతో ఆరోగ్యం కదా !!


తప్పకుండా ఆర్డర్ చేస్తాను. మిగతా ఫ్లాట్ వాళ్ళకు కూడా చెప్తాను.


ఇవాళ మీ ద్వారా ఒక కొత్త ఉపాధి అవకాశం గురించి తెలుసుకోగలిగాను కూడా !!"


అన్నాను.


నాకు అయితే వాళ్ళ ఆలోచన ఎంతో నచ్చింది.


మరి మీకు ??



Rate this content
Log in

Similar telugu story from Abstract