Jyothi Muvvala

Classics Fantasy Inspirational

4  

Jyothi Muvvala

Classics Fantasy Inspirational

మనసులు కలిపిన బంధం!

మనసులు కలిపిన బంధం!

5 mins
468


పచ్చని చెట్లతో చల్లని వాతావరణంలో రాత్రి పగలు తేడా తెలియని ట్రాఫిక్తో బిజీ బిజీగా ఉన్న బెంగుళూరు నగరంలో కవి సమ్మేళనం అనే ఫంక్షన్కి వచ్చాను అండి." ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను." "ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదూ!"

"నా పేరు వెంకట్!" "బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాను." రోజంతా వర్క్ బిజీలో తలమునకలైన నాకు అప్పుడే ఉరట పొందేలా, మనసుకు హాయి నిచ్చేలా ఒక సాహిత్యం యాప్ కనిపించింది.

"నా ఫ్రెండ్ శేఖర్ రోజు రూమ్లో తన కజిన్ బ్రదర్ రాసిన రచనలు అన్నిటికీ చదివి కామెంట్ చేస్తూ ఉండేవాడు." "అప్పుడప్పుడు నన్ను కూడా షేర్ చేసి కామెంట్ చేయమని అడిగేవాడు." అలా అతడి కోసమే ఆ యాప్లో లాగిన్ అయ్యాను.

అలా అందులో రచనలు, కవితలు ఫాలో అవుతూ ఉండగా, ఒకరోజు అనుకోకుండా ఒక అద్భుతమైన పదాలు నా కళ్ళను ఆకర్షించాయి. చదవడం జరిగింది. ఆమె భావనలో అంతరార్థం ఆమె మనసును తెలిపేలా చాలా అందంగా ఉంది.

అలా రోజు ఆమె రచనలు చదువుతూ నాకే తెలియకుండా ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టాను. ఆమె రాసే ఒక్కో రచన ఒక్కో మధురానుభూతి. పకృతినీ కూడా ఆమె అక్షరాలలో అందంగా బందించేస్తుంది.

ఆమె ప్రేమ కవితలు చదివితే అసలు ప్రేమంటే ఇంత మధురంగా ఉంటుందా? ఇదే నా ప్రేమ అనిపించేలా మనసుని మత్తెక్కిస్తుంది. అలా ప్రతి రోజు ఆమె రచనలకై ఆమె కవితలకే ఎదురు చూస్తూ ఆమెకి వీరాభిమానిని అయిపోయాను.

ఒకరోజు ఆమె ఎవరో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనిపించింది. మరి ఆమెని ఎలా తెలుసుకోవడం అని ఆలోచించడం మొదలు పెట్టాను.

యాప్లో సందేశం పంపాను. కానీ జవాబు రాలేదు. మళ్లీ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపాను. అయినా జవాబు ఇవ్వలేదు.ఆమె రచనలు ఇంత అందంగా ఉంటే ఆమె ఇంకెంత అందంగా ఉంటుందో అని ఆమెని ఇంకా చూడాలని పరితపించాను.

అనుకోకుండా ఒక రోజు ఆమె డిస్ప్లేలో ఆమె ఫొటో చూశాను. కుందనపు బొమ్మలా ఉంది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడిని అయిపోయాను.

ఆమెతో ఎలా అయినా పరిచయం పెంచుకోవాలని ఆమె దృష్టి నాపై మరలించుకోవలి అని చాలా ప్రయత్నాలు చేశాను. రోజు ఆమె కవితలకు అందరి కన్నా భిన్నంగా సమీక్షలు చేయడం మొదలుపెట్టాను.

ధన్యవాదాలు అని సింపుల్గా చెప్పి వదిలేసేది. ఇంకా ఏదైనా చేయాలి ఆమె దృష్టికి నేను చేరాలి అన్న తాపత్రయంతో ఒకసారి వెటకారంగా ఇచ్చాను.

అప్పుడు ఆమె బదులిచ్చింది మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు అని చెప్పి నా రచనలలో లోపాలు ఏమైనా ఉంటే తెలియజేయాలి అంటూ నాకు సందేశం పంపింది.

ఆహా మంచి అవకాశం దొరికింది. ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చింది అని సంబరపడిపోయాను. అలా ఆమెతో రోజు సంభాషణ చేయడం మొదలు పెట్టాను. ఆమెని ఇంప్రెస్ చేయడం కోసం పెద్దపెద్ద రచయితల నవలలు, రచనలు చదవటం కూడా మొదలు పెట్టాను.

అలా నేను కూడా చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాను. కథలు రాయడం కూడా మొదలు పెట్టాను.రాను రాను నా రచనలు ఆమె చదవడం మొదలు పెట్టింది. సమీక్ష కూడా చేయడం మొదలు పెట్టింది.

అలా ఒకరికొకరు సమీక్షలు చేసుకుంటూ రోజు మాట్లాడుకుంటూ మంచి స్నేహితులం అయిపోయాము.

అనుకోకుండా కొన్ని రోజులు ఆమె కవితలు రాయటం మానేసింది. లిపిలో ఆమె రచనలు కనిపించడం లేదు ఎన్ని సందేశాలు పంపిస్తున్నా వాటికి బదులు లేదు.

ఆమెకి ఏమైందో అని ఆవేదన నన్ను వెంటాడుతుంది. కలిసినట్లే కలిసి కనుమరుగైపోయింది అన్న దుఃఖం తన్నుకొస్తుంది.

అంతలోనే ఒక పదిహేను రోజుల తర్వాత మళ్లీ ఆమె రచనలు చేయటం ఆరంభించింది. వాటిని చూసి చాలా ఆనందం అనిపించింది. మళ్లీ కనిపిస్తుందో లేదో అని దిగులుపడ్డ నా మనసుకి కొత్త ఆశలు చిగురించాయి.

ఇన్ని రోజులు ఏమయి పోయారు అని అడిగాను.అందుకామె వాళ్ళ అమ్మగారు ఊర్లో లేకపోవడం వల్ల తాను రాయలేక పోయాను అని చెప్పింది.

మళ్లీ ఇలాంటి సమస్య వస్తే తనని దూరం అయిపోతాను అని భావించి ఇక లేట్ చేయకూడదు అని ఆమెకి ఫోన్ నెంబర్ అడిగాను. అందుకామె నిరాకరించింది.

అంతలోనే నా మనసులో మాట చెప్పేసాను.మీరు అంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. దానికి సమాధానం ఇవ్వకుండా మళ్లీ కనుమరుగైపోయింది.

కొన్ని రోజుల తర్వాత ఆమె తన ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టింది. చాలా సంతోషపడ్డాను వెంటనే ఆ నంబర్కి కాల్ చేశాను. "ఆమె ఫోన్ ఎత్తి హలో అని అంది ఆమె స్వరం కోయిల కన్నా తియ్యగా ఉంది." ఎంత తియ్యని స్వరం అనుకుంటూ." నేను వెంకట్నీ అని చెప్పాను."

అందుకామె" చెప్పండి వెంకట్ గారు బాగున్నారా? అని అడిగింది."

చాలాసేపు మాట్లాడుకున్నాం."సరే వెంకట్ గారు ఇంటిలో వాళ్లు వచ్చే టైం అవుతుంది నేను ఫోన్ పెట్టేస్తాను అని చెప్పింది ఆమె."

ఒకరోజు ఆమెని కలవాలని కోరాను. మొదట నిరాకరించినా నా గట్టి ప్రయత్నంతో సరే అని అంగీకరించింది. అలా ఇద్దరం బెంగళూరు సెంట్రల్లో కలుసుకుందామని ఒక ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నాము. "మరి మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు" అని ఆమె అన్నది." మీరు నాకు తెలుసు అని చెప్పాను".

ఆ రోజు ఆమె కోసం కొత్త బట్టలు కొనుక్కొని, ఫేషియల్ చేయించుకొని సేవింగ్ చేసుకుని ,అందంగా రెడీ అయ్యాను. చెప్పిన సమయానికి ముందే వెళ్లి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

కానీ ఎంత టైం అయినా ఆమె నాకు కనిపించలేదు.

అంతలో నాకు ఒక ఫోన్ వచ్చింది. వెంకట్ గారు ఎక్కడున్నారు? అని అంటూ.

" నేను మీరు ఎక్కడ ఉన్నారు? అని అడిగాను". "తను మెక్ డొనాల్డ్స్ ఎదురుగా ఉన్నాను అని సమాధానం చెప్పింది." నేను దాని సమీపంలో లోనే ఉన్నాను. కానీ నేను డీపీలో చూసిన మొఖం, అక్కడ నిలబడి ఉన్న ఆమె ముఖం వేరుగా ఉన్నాయి. నేను చూసి ప్రేమించిన అమ్మాయి వేరు, అక్కడ నిలబడి ఉన్న అమ్మాయి వేరు నేను ప్రేమించిన అమ్మాయి అందాలరాశి, బుట్టబొమ్మలా ఉంటాది. కానీ ఇక్కడ ఎదురుగా నిల్చుని ఉన్న అమ్మాయి సాధారణగా ఒక పని అమ్మాయిలా ఉంది.

నాకు నోట మాట రాలేదు. ఏం చెప్పాలో తెలియక "సారీ నేను రావటం కుదరటంలేదు. ఏమీ అనుకోవద్దు మళ్లీ ఎప్పుడైనా కలుద్దాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాను". కానీ నా మనసు మనసులో లేదు అక్కడ రచనలు చేస్తున్న అమ్మాయి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడ బయట నన్ను వచ్చి కలవాలనుకున్న అమ్మాయికి అసలు పోలికలే లేవు, పొంతనే లేదు. ఈ అమ్మాయి అసలు అంత గొప్పగా రచనలు చేసింది అంటే నమ్మలేక పోతున్నాను. కావాలి అని నన్ను ఆట పట్టించడానికి ఇలా చేస్తున్నారా? అనే అనుమానం కలిగింది.

అందుకే ఆ రోజు నా సందేహం తీర్చుకోవడానికి, మళ్లీ ఆమెకు ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకున్నాను.

నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగాను.? అప్పుడు ఆమె చెప్పింది తన తల్లిదండ్రులు ఊర్లో పొలం పని చేసుకుంటూ ఉంటారని, ఆ ఊరి పెద్ద ప్రెసిడెంట్ గారి కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య , అతడు ఇద్దరూ ఉద్యోగస్తులు అవ్వడం వల్ల పిల్లలను చూసుకోవడానికి ఊరు నుంచి ఆమెను తెచ్చి పెట్టుకున్నారని.

వారిద్దరు ఉద్యోగానికి వెళ్లిపోయాక ఖాళీ సమయంలో ఇంటి పని మొత్తం ముగించుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు ఆమె తన కవితలను ఇలా వ్రాస్తూ ఉంటాను అని చెప్పింది. మరి డిపిలో ఫోటో మీదేనా అడిగాను.

అందుకామె లేదు! ఆమె మా అమ్మ గారు! ఆమె చాలా అందంగా ఉంటారని ఆమె ఫోటో పెట్టుకున్నాను. ఆమె పై అభిమానంతో అని చెప్పింది.

(మా అమ్మగారు లేకపోవడం వల్ల రాయలేకపోయాను, అమ్మగారు వచ్చే టైం అయింది. అంటే నేను వాళ్ళ అమ్మగారు ఏమో అనుకున్నాను. కానీ వాళ్ళ ఇంట్లో పని చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.)

ఆ మాటలు విని నాకు బుర్ర తిరిగి పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మౌనంగా మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను.

తర్వాత వారం రోజులు అయినా నేను తిరిగి ఆమెకి కాల్ చేయలేదు.

ఒకరోజు అనుకోకుండా లిపిలో ఒక మంచి రచన చదివాను. సౌందర్యం ఆత్మకే గాని శరీరానికి శాశ్వతం కాదని. తెలివిని , జ్ఞానాన్నీ సంపాదించడం చాలా కష్టం. సరస్వతీ కటాక్షం ఉంటే తప్ప అంత జ్ఞానం ఎవరికి సొంతం కాదు అని.... అప్పుడే నాకు జ్ఞానోదయం అయింది.  నిజమేనా ప్రేమకు రూపంతో పనిలేదని గుర్తించాను.

అందుకే ఆమెకి ఫోన్ చేసి అడ్రస్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఆమెను పెళ్లాడతానని చెప్పాను. అందుకు వాళ్ళింట్లో అందరూ సంతోషించి వాళ్ల తల్లిదండ్రులను పిలిపించారు. మా ఇంట్లో అమ్మానాన్న మొదట ఒప్పుకోలేదు ఎందుకంటే బాగా చదివించి, మంచి ఉద్యోగం చేస్తున్న కొడుకుకి కాబోయే భార్య మంచి విద్యావంతురాలు,పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అయి ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు.

అలానే నా పెళ్లి మీద ఎన్నో ఆశలు పెంచుకున్న వాళ్ళు పదో క్లాస్ చదువుకున్న అమ్మాయినీ పెళ్లి చేసుకోవడం నిరాకరించారు. కానీ ఆమెకున్న జ్ఞానానికి ఆమెని చదివిస్తే ఇంకా బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్తుందన్న నమ్మకం నాకు ఉంది. అందుకే ఆమెని చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.

అలా అందర్నీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఆమెని కరస్పాండెంట్ డిగ్రీలో చేర్పించాను. ఆమె డిగ్రీ తరువాత తెలుగులో M.A లిటరేచర్

కూడా పూర్తి చేసింది. గవర్నమెంట్ జాబు కూడా తెచ్చుకుంది.

అలా తన చదువుని కొనసాగిస్తూ కవిత్వంలో . తన రచనలలో మెరుగులు చేసుకుంటూ. ఈరోజు ఒక మంచి పెద్ద కవిత్రి అయింది.

ఈ కవి సంగమంలో ఈరోజు ఆమెకి సన్మానం. అందుకే ఆమెని ఈ ట్రాఫిక్లో కష్టపడి తీసుకొచ్చాను.

అంతలో గౌరవనీయులైన శ్రీమతి వాగ్దేవి గారికి సన్మానం అంటూ స్టేజ్ మీద మైక్లో అనౌన్స్ చేస్తున్నారు.

ఆమెను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వంగా కూడా వుంది. జీవితంలో కొన్ని కొన్ని నిర్ణయాలు మన తలరాతలనే మారుస్తూ ఉంటాయి.

అందుకు నిదర్శనం వాగ్దేవి జీవితం. అలానే

కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా ముడుపడతాయో ఎవరికీ తెలియదు.

ఇవన్నీ రుణానుబంధలే ....

మరి నా కథ చదివి ఎలా ఉందో మీరు చెప్పండి.

                                             రచన...

                                              జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu story from Classics