మమతల ఊబి
మమతల ఊబి


'హలో! సుందరం! పిల్లలు ఎలా ఉన్నా రురా?' అంటూ కొలంబస్ నుండి ఫోన్ చేశా డు నారాయణ శాస్త్రి
'అంతా బాగున్నాం. మీరు,అమ్మ జాగ్రత్త! అక్కడ చలిఎక్కువగా వుందా?' అడిగాడు కొడుకు సుందరం
ఈ వయస్సులో మాకీ శిక్ష విధించింది మేనకోడలు దుర్గ. బేబీ సిట్టింగ్ కోసం వచ్చిన మాకు ఏం చేయాలో తోచడం లేదు.వాళ్ళు ఇద్దరు పొద్దు పొద్దున్నే ఆఫీస్ కెళ్ళి పోయి రాత్రి పదింటికి వస్తారు. మేం ఛస్తున్నాం.'
మరో నాలుగు నెలల్లో హైదరాబాద్ వచ్చేస్తారుగా మీ రు- అంటూ మాటమార్చాడుసుందరం
నారాయణ శాస్త్రి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ గా రిటైరయ్యాడు
జీవితంలో ఏనాడూ విశ్రాంతి అనుభవించి ఎరగడు. ఆఫీసు గొడవలు, ఇంటి సమస్యా తోరణాలు బంధించి వేశాయి
తన తండ్రి కి ఆరుగురు సంతానం. తాను పెద్ద వాడు. నాన్న డ్యూటీ లో ఉండగా చనిపోతే తనకు ఉద్యోగం వచ్చింది
తమ్ముళ్ళచదువులు , చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేశాడు
తన కొడుకు సుందరం బి.టెక్ చేసి ఉద్యోగం హైదరాబాద్ లో సంపాదించి ప్రయోజకు డయ్యాడు
చెల్లెలి కూతురు అమెరికా లో బిడ్డను కంటే బేబీ సిట్టింగ్ కొచ్చారు. ఆరునెలల జైలుశిక్ష విధించింది చెల్లెలు
సంసారాలంపటాలతో ఎన్నడూ దైవచింతన కు టైం దొరకలేదని భార్యతో చెప్పి బాధపడేవాడు
'ఓం త్రియంబకంయజామహే సుగంధిం పుష్ఠివర్థనం
ఉర్వారుక మివబంధనాత్
మృత్యోర్ముక్షీయమామృతాత్
అనే మృత్యుంజయ మంత్రాన్ని జపించడం అలవాటు ఆయనకు
అమెరికా నుండి రాగానే కోడలి కాన్పు చేయాల్సి వచ్చింది
ఓసాయంకాలం కొడుకు సుందరం ఇంటి కి వచ్చేసరికి అమ్మా నాన్నా ఇంట్లో లేరు
గాబరా పడుతూ ఫొన్ చేశా డు
స్విచ్ ఆఫ్ అని జవాబు వచ్చింది
రాత్రి అంతా నిద్ర లేదు సుందరానికి
మర్నాడు ఉదయం ఫోన్.
అమ్మా, నేను అరుణాచలంలో ఆశ్రమంలో ఉండిపోతాం.
ఇన్నాళ్లు మనసు కు దొరకని ప్రశాంతత కోసం ఎదురు చూస్తూ ఇక్కడ కొచ్చాం_ అని ఫోన్ పెట్టేసాడు