Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

మిష్టర్ పెళ్ళాం సినిమాలో..

మిష్టర్ పెళ్ళాం సినిమాలో..

1 min
688


ఏమితి మీ శ్రీవారు ముగ్గులు పెట్టడంలో ఎక్స్పర్ట్స్ లా ఉన్నారు? అన్నాడు గోపాల కృష్ణ.


బాలాజీ లుంగీ కట్టుకుని ముగ్గు పిండితో చతురస్రాలు, త్రిభుజాలు వేస్తున్నాడు. గోపాల కృష్ణ, ఝాన్సీ ల మాటలు విని వెనక్కు తిరిగి చూశాడు.


ఆయన గొప్ప గణిత శాస్త్రవేత్తండీ. ఇలా ముగ్గు పిండితో కూడా ఏవో గణిత ప్రయోగాలు చేస్తుంటారు అంది ఝాన్సీ.


యు ఆర్ లక్కీ ఝాన్సీ అన్నాడు గోపాల కృష్ణ.


బాలాజీ ఆమెను చూసి, ఇంటికొచ్చిన అతిథుల్ని నిలబెట్టే మాట్లాడడమే. వెళ్లి కాస్త మర్యాద చెయ్యొచ్చు కదా అన్నాడు.


అదేం లేదులెండి బాలాజీ గారూ. ఝాన్సీ ని దిగబెట్టి వెళ్ళడానికి వచ్చి మీ ముగ్గు చూసి ఆగాను అన్నాడు గోపాల కృష్ణ.


అసలు ఈ ముగ్గులు కనిపెట్టింది మన మగవాళ్ళేనండీ. మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి కదా. అందుకే ఈ పని ఆడంగులకి ఇచ్చేశాం అన్నాడు.


అతని ముఖానికి అంటుకున్న ముగ్గు పిండి చూసి గోపాల కృష్ణ నవ్వుకున్నాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract