STORYMIRROR

Susmita Bandi bolimera

Fantasy Children

5.0  

Susmita Bandi bolimera

Fantasy Children

మేలుచేత కీడుని జయించటం

మేలుచేత కీడుని జయించటం

3 mins
12

చిన్ని పెద్ద పెద్ద ఆల్చిప్పల్లాంటి కళ్ళతో ,ఉంగరాల జుట్టుతో ఎర్రటి బుగ్గలతో ఎంతో అందంగా ఉంటుంది .ఆమె అడవిలో ఒక మంత్రగత్తె దగ్గర పనిచేస్తుఉంటుంది .మూడు సంవత్సరాలు విపరీతమైన కరువు రావటం తో , చిన్ని తండ్రి రామయ్య చేసేది లేక మంత్రగత్తె చెప్పిన తీయని మాటలు నమ్మి ఆమె దగ్గర అప్పు తీసుకుని పంటవేసాడు .ఈసారి పెద్ద తుఫాను రావటంతో పంట పోయింది .మంత్రగత్తె మాత్రం తన డబ్బు ఇవ్వమని బాగా వత్తిడి చేసింది .తనదగ్గర డబ్బులు లేవని చెప్పాడు రామయ్య .ఆయితే నీకూతుర్ని నాదగ్గర పెట్టి నీ డబ్బు వచ్చినప్పుడు విడిపించుకోమని చెప్పి ,చిన్ని వాళ్ళ అమ్మ ,నాన్న ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆ పాప ను అడవికి తీసుకొని వచ్చింది మంత్రంగత్తె .


అ చిన్న పాపతో ఇంట్లో వున్న పని అంతా చేయించేది మంత్రగత్తె .రోజు తిడుతూ కొడుతూ , కడుపునిండా తిండి కూడా పెట్టే ది కాదు .ఆ అడవిలో మాట్లాడటానికి కానీ ,తన బాధ చెప్పుకోటానికి కానీ తనకు ఎవ్వరు ఉండేవారు కాదు చిన్ని కి .అందుకే తను అక్కడవుండే చెట్లతో ,పక్షులతో మాట్లాడుతూ ఉండేది .ఒక రోజు అడవిలో తనకు ఒక కుక్కపిల్ల దొరికింది .దానిని తీసుకొచ్చి మంత్రగత్తె కు కనిపించకుండా పెంచసాగింది చిన్ని .


ఒక రోజు మిట్ట మధ్యాహ్నం జోరుగా వర్షం పడుతుండగా చిన్ని ని చెరువుకు వెళ్లి నీళ్లు తెమ్మని చెప్పింది మంత్రగత్తె .వర్షం లోనే తడుస్తూ తోపుడు బండిలో కాళీ కనులని సర్ది చెరువు వద్దకు బయలు దేరింది చిన్ని .

"వద్దు తడిసి పోతావని "చిన్ని ఎంత చెప్పినా విన కుండా ..ఆమె వెనుకే ఆమె కుక్క పిల్ల కూడా బయలు దేరింది .చెరువు దగ్గర ఉన్న చిన్న కొండ దగ్గరికి వచ్చేసరికి ,ఆకొండ పైన ఏర్పాడ్డ ఇంద్రధనుస్సు ఆమెను ఆకర్షించింది .కుక్క పిల్ల అరుస్తూ ఆకొండపైకి వెళ్లటంతో దాని వెనకే చిన్ని కొండా పైకి వెళ్ళింది .ఇంద్రధనుస్సు చేతికి అందేంత దగ్గరగా ఉండటం చిన్ని కి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది .

చిన్ని తన చేతితో ఇంద్రధనుస్సును ముట్టుకోగానే చేతినిండా కాంతులీనే చిన్ని చిన్ని నక్షత్రాలు కనిపించాయి .ఈసారి చిన్ని పచ్చరంగులో చెయీ పెట్టి రంగును బయటకు లాగ గానే పచ్చరంగు సుడులుతిరిగి ఆగింది .పచ్చని రంగు వస్త్రాలు ధరించిన మెరుపులీనే దేవదూత ఆమె ముందు ప్రత్యక్షమైంది .పచ్చరంగు దేవదూత చిన్ని ని పట్టుకోగానే చిన్ని వేసుకున్న గౌను కాంతులీను పచ్చరంగు గౌనుగా మారిపోయింది .పచ్చరంగు జీవానికి ,తాజాదనానికి గుర్తని తెలుపుతూ ...పచ్చని పొలాలను ,వనాలను చూపిస్తూ ,రకరకాల చెట్లను గురించి ,పూలు ,పండ్ల 

ఔషధ మొక్కల గురించి చెబుతూ ప్రపంచంలో వుండే పచ్చని అడవులను చూపించి వాటిని సంరక్షించు కోవటం గురించి చెప్పింది .మరలా ఆ చిన్న కొండ శిఖరం పైన చిన్ని ని విడిచి అన్నికాలాలలో ఫలాలనుఇచ్చే ఒక ఆపిల్ చెట్టుని బహుమతిగా ఇచ్చి కాలాన్ని చిన్ని నీటికోసం కొండదగ్గరకు వచ్చిన సమయానికి త్రిప్పి మాయ మాయేంది .

దేవదూత ఇచ్చిన గౌను ,ఆపిల్ చెట్టును గొడ్లచావిట్లో దాచిపెట్టింది చిన్ని .

ఆకలి వేసినప్పుడల్లా కడుపునిండా ఆపిల్స్ తింటూ 

పచ్చ రంగు దేవదూత చెప్పిన విషయాలను గుర్తుచేసుకుంటూ చిన్ని చాలా సంతోషంగా ఉండసాగింది .


మరలా ఒకరాజు వర్షం పడుతుండటంతో ఆశతో ..నీళ్లు తెచ్చే వంకపెట్టి ఆకొండదగ్గరకు పరుగుపెట్టి వచ్చింది చిన్ని .ఇంద్రధనుస్సు రావాటంతో కొండపైకి ఎక్కి ఈసారి నీలం రంగు ను పట్టుకొని గట్టిగా లాగింది .

  నీలం రంగు  గాలి సుడులు తిరిగి ఆగింది .అప్పుడు మిరిమిట్లు గొలిపే నీలంరంగు వస్త్రాలు ధరించిన దేవదూత ప్రత్యక్షమై ..నీలం రంగు జ్ఞానానికి ,విశ్వసనీయతకు ప్రతీక అని ,నీలమయమైన సముద్రం అందులో రక రకాల చేపలు వాటి జీవన విధానాలను ,అలాగే నీలమయమైన ఆకాశం హద్దులను చూపి అందులో ఎగిరే రక రకాల పక్షులను గురించి తెలిపింది 

ఎంతో జ్ఞానం కలిగి మాట్లాడే మైనాను , మిరుమిట్లు గొలిపే నీలంరంగు గౌను ను  చిన్ని కి కానుకగా ఇచ్చింది .అలాగే కాలాన్ని చిన్ని నీటికోసం వచ్చిన కాలానికి తిప్పి చిన్ని ని కొండపై వదిలి వెళ్ళింది .చిన్ని తన కానుకలను జాగర్తగా దాచింది .

   

మంత్ర గత్తె ఎంత పని చెప్పినా చక ,చకా చేస్తూ సంతోషంగా ఉండసాగింది చిన్ని .ఇది మంత్రగత్తెకు సుతరామూ నచ్చలేదు .చిన్ని లోని మార్పుకు కారణం ఏంటా అని చిన్ని ని గమనించటం ప్రారంభించింది మంత్రగత్తె .

ఒకరోజు బాగా వర్షం పడుతుండగా ఇంట్లో మంచినీళ్లు వున్నా నీళ్లు తెస్తానని బయలుదేరింది చిన్ని .

చిన్ని ని వెనుకగా అనుసరిస్తూ వచ్చింది మంత్రగత్తె. .యధావిధిగా చిన్ని కొండా పైన గల ఇంద్రధనస్సు దగ్గరికి వెళ్ళటం ,ఈసారి పసుపు రంగును లాగటం , పసుపు రంగు దేవదూత ప్రత్యక్షమై చిన్ని ని పట్టుకొని పైకి ఎగర బోతున్నప్పుడు మంత్రగత్తె హఠాత్తుగా పరుగెత్తి వచ్చి దేవదూత వస్త్రం పట్టుకొని వారితోపాటుగా పైకి ఎగరబోయింది .దేవదూత చిన్ని ని కొండపై వదిలి మంత్రగత్తె ను లోయలోకి తోసి మాయమైంది .లోయలో పడిన మంత్రగత్తెను వెతికి ఇంటికి చేర్చి  పచ్చ రంగు  దేవదూత చెప్పిన ఔషధమొక్కలతో కట్టుకట్టి సపర్యలు చేసింది చిన్ని .మంత్రగత్తె కోలుకున్నతరువాత చిన్ని ని పిలిచి "నేను నిన్ను చాలా హింసించాను ,కానీ నివ్వు నా ప్రాణం కాపాడి మేలుచేసావు ఎందుకని "అని అడిగింది "శత్రువు కష్టంలో వున్నా ..సహాయం చేయాలనీ ,మేలుచేత కీడును జయంచాలని తన తండ్రి తనకు నేర్పారని "తెలిపింది చిన్ని .చిన్ని చేసిన సహాయానికి చెలించిపోయిన మంత్రగత్తె చిన్నికి కొంత ధనా

న్ని కానుకగా ఇచ్చి ,చిన్ని తండ్రి రామయ్యకు చిన్ని ని,ఇంద్రధనుస్సు ఇచ్చిన కానుకలను ఇచ్చి పంపించివేసింది .చిన్ని తన తల్లితండ్రులతో సంతోషంగా ఉండసాగింది .


Rate this content
Log in

Similar telugu story from Fantasy