జీవితం -సార్ధకం
జీవితం -సార్ధకం
రాత్రంతా సరిగా నిద్రపోని సరితకు ప్రొద్దుటే 5:30
కే మెళకువవచ్చింది .ఇంటి తలుపు తీసే సరికి ఎదురుగా లక్ష్మి కళ్ళాపు చల్లి ,ముగ్గు పెడుతు..వుంది .అప్పుడే తెలతెలా వారుతూ ఉండగా .లేలే ...త కిరణాలు మంచు దుప్పటిని చీల్చుకొని వస్తూవుంటే పచ్చని వాకిట్లో తెల్లని ముగ్గు వేస్తున్న లక్మి రవి వర్మ పెయింటింగ్ లాగా వుంది అ దృశ్యం .
అమ్మా... బాగున్నారా ?
రాత్రి బాగా పొద్దుపోయినాక వచ్చినట్టున్నారు .మా యాయన చెప్పినాడు .వుండండి కాఫీ తెస్తా అంటూ ముగ్గు బుట్ట పక్కన పెట్టి ,న్యూస్ పేపర్ చేతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది .సరిత వాళ్ళ ఇంటి తాళాలు తన దగ్గరే వుంటయి ,తనే వాళ్ళు వచ్చే ముందు ఆ యిల్లు శుభ్రం చేసి పెడుతుంది .అయిదు నిమిషాల్లో కమ్మటి కాఫీ తెచ్చి సరితకు ఇచ్చింది .
కాఫీ చిన్నగా సిప్ చేస్తూ ఇంటి గార్డెన్ దాటి బయటకు వేళ్ళ బోతున్న సరితకు "అమ్మా ఎక్కువ దూరం వెళ్లకండి అసలే అడవి అని గుర్తు చేసింది లక్ష్మి ".
సరితా మదినిండా ఆలోచనలే ఒక్కసారి గతమంతా కళ ముందు కదలాడింది సరితకు ,ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన సరిత కాలేజీ చదువుకు వచ్చేసరికి అమ్మ ,నాన్న ఆక్సిడెంట్ లో చనిపోవటంతో ఉన్న వూరు వదిలి చెల్లితో సహా పట్టణంలో ఉంటున్న అన్న ,వదిన దగ్గర చేరింది .అన్న ప్రోత్సహంతో చదువు పూర్తిచేయటమే కాక మంచి గవర్నమెంట్ జాబ్ సంపాయించింది .ఇక పెళ్ళిచేద్దాం అని అనుకుంటుండంగా అన్న హఠాన్మరణం సరితా జీవితాన్నే మార్చేసింది .వదిన అమాయకురాలు కావటం తో అన్న పిల్లల భాద్యత ,చెల్లెలి భాద్యత తీసుకోవాలిసివచ్చింది .చెల్లెలు ,అన్న పిల్లలకు పీజీ లు చదివించి పెళ్లిళ్లు చేసింది .చెల్లి ఢిల్లీ లో ఉంటే ,అన్న పిల్లలిద్దరూ అమెరికా లో స్థిరపడ్డారు .
వదిన కాలంచేసికూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది
.నిన్ననే తన రిటైర్మెంట్ ఫంక్షన్ తన ఆఫీస్ లో జరిగింది .దానికి చెల్లెలు ,అన్న పిల్లలు వస్తారని ఎంతో ఆశపడింది సరిత .ఎవ్వరు రాలేదు .నీ జీవితమంతా వాళ్లకు ధారపోశావు ,నీజీవితానికి ఒకే ఒక్క ఫంక్షన్ దానికి కూడా రాలేదు వీళ్ళు అని తన కోలిగ్ అన్న మాటలు తనను మరింత కృంగతీసాయి .
ఒక్కొక్క అడుగు భారంగా పడుతూ ఉండగా ముళ్ళను ను దాటుకొని ముందుకు వెళుతోంది సరిత .
తన ఉద్యోగం ,అందం చూసి కొంతమంది పెళ్లి చేసుకోటానికి ముందుకు వచ్చినా తన భాద్యత లు మాత్రం ఒప్పుకోక పోవటం తో తనకు పెళ్లి వద్దనుకుంది సరిత .అడవిలో బాట తన జీవితం లాగానే బాగా వొడిదుడుకులుగా వుంది .సడన్ గా ఒక రక మైన గుర్రు మని శబ్దం విని ఎదురుగా చూసే సరికి
అల్లంతదూరంలో చిరుత పులి నిచ్చేష్టురాలై వుండి పోయింది .ఇంతలో ఒక పేద్దయన గట్టిగా అరుస్తూ ఒక టపాకాయ్ దానిమీదికి విసిరే సరికి అది పరిగెత్తిన్ది
ముసలాయన పాదులు తీసిన మొక్కలకు నీళ్లు పోస్తుంన్నాడు .
ఈమొక్కలు మీరే పెట్టారా అడిగింది సరిత .
అవునమ్మా ...ఎందుకు అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు ?అడి గాడు పెద్దాయన .
ఈమొక్కలు పెద్దవిఅయేసరికి ...అంది సరితా .
ఇవి నాకోసం పెట్టటంలేదు అమ్మా .అడవిలో చెట్లు కొట్టే వారే గాని
వాటిని పెట్టె వారు లేరు .అందుకనే ...
నేను అడవి బిడ్డను ,అడవి నాకు చాలా ఇచ్చింది .ఇది ఇలా అంతరించి పొతే ముందు తరాలవారు వర్షాలు లేక ,ఎండలు ఎక్కువై ,తాగేందుకు నీళ్లులేక ఇబ్బంది పడతారు .అటువంటి సమస్య రాకుండా ఉండటానికే నా ఈ చిన్న ప్రయత్నం
అలాగే ఈ చెట్లు ఫలాలు ఇచ్చినప్పుడు ఎవరి ఆకలి తీర్చినా అది నాకు తృప్తినిస్తుంది .ఈ అడవి మరో వందేళ్లు ఉంటే నా జన్మ ధాన్యమే .అదుగో ఆ కనపడే కొండమీద పెద్దచెట్లు అవి నేను నాటినవే .ప్రకృతిని మనం కాపాడితే మనలను ప్రకృతి కాపాడుతుంది అమ్మ. అన్నాడు ఆ తాత .
అంత ముసలి వయసులో నిస్వార్థంగా ఆయన చేస్తున్న సేవ ను చూసి చాలా స్ఫూర్తి పొందింది సరిత .సూర్యకిరణాల ధాటికి మంచుతెరలు కరిగి పోగా రంగు, రంగుల అడవి పూలు ,చెట్లు తో నిండిన పచ్చని కొండలు ,కొమ్మ కొమ్మకు దుమికి ఆడుతున్న ఉడతలు
సరితా కళ్ళకు చాలా అందం గా కనపడుతున్నాయి
ఇంతలో లక్ష్మి కొడుకు మోటార్ సైకిల్ మీద వచ్చి అమ్మ గారు వెల్దామా అన్నాడు .కాపాడిన తాత గారికి థాంక్స్ చెప్పి తేలికపడిన మనసుతో ఇంటికొచ్చింది సరిత .ఇంటి తలుపు తీసే సరికి సర్ప్రైస్.... అంటూ చెల్లెలు ,అన్నపిల్లల కుటుంబాలు .
మంచు తుఫాను వల్ల ఫ్లైట్స్ లేట్ ఆయెనాయె అత్త చెప్తున్నాడు అన్నకొడుకు .
మా మామ గారికి బాగోలేదు అక్క అందుకని రాలేక పోయాము చెప్పింది చెల్లి .
ఈసారి బంధువులందరిని ,మీ కోలిగ్స్ ని పిలిచి ఫంక్షన్ ధూమ్ ధామ్ గా చెయ్యాలి అంది అన్న కూతురు .ఎందుకు అనవసర మైన ఖర్చు అంది సరిత .
లేదు చెయ్యాల్సిందే ఫంక్షన్ లో నేను పెద్దమ్మమీద పాట రాశాను అది పాడాలి అని గిటార్ సరిచేసుకుంటూ చెప్పింది చెల్లెలి కూతురు .ఇల్లంతా పిల్లలతో సంతోషం గా సందడిగా వుంది సరిత హృదయంలాగా
