Susmita Bandi bolimera

Classics

4.7  

Susmita Bandi bolimera

Classics

దూరదర్శన్ లో తెలుగు సినిమా

దూరదర్శన్ లో తెలుగు సినిమా

5 mins
584


 అది 1986వ సంవత్సరం .అప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి .ఈసారి దీపావళికి ఎక్కువ సెలవులు ఇవ్వడంతో మేమంతా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్దామని నిశ్చయించాం .తాతగారు చాలా కాలం క్రితమే పోవడంతో ఆమె ఒంటరిగా ఊర్లో ఉంటూ ఉంటుంది .అందుకే మా పండగలన్నీ ఆమెతోనే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇక నేను తమ్ముడు నాన్నగారు కలిసి ఊరు బయలుదేరాము. అమ్మని నాన్నగారు పండగ రోజు తీసుకొస్తా అన్నారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ సెలవులు లేవంట మొత్తానికి బస్సు ఎక్కి సీటు సంపాదించాం .కిటికీ దగ్గర సీటు కోసం నాకు తమ్ముడికి ఎప్పుడు గొడవే. 

మా అమ్మమ్మ గారి ఊరు కృష్ణ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు.పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంటుంది.అమ్మమ్మ కు ఆమె కోళ్ల న్నా,ఇంటిచుట్టూ ఉండే పెరటి చెట్లన్నా చాలా ప్రాణం.ఆమె ఒక చిన్న రైతు కూడా.అందుకే మేము ఎప్పుడు మాతోటె ఉండమన్న ఆమె రెండు,మూడు రోజులకంటే ఎక్కువ వుండరు.ఆమెకు ఈ పండగకు ఒక సర్ప్రైజ్ ఉంది .నాన్న గారు ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ దయనోర టీవీ తీసుకున్నారు .ఆమె చక్కగా తనకు ఎంతో ఇష్టమైన మహాభారత ,రామాయణం టీవీ సీరియల్ లు చూడవచ్చు .

రాత్రి ఏడు గంటలకే ఊరు చేరాము .

ప్రొద్దుటే లేచి బ్రష్ చేసుకొనే లోపు మేరీ (నా ఫ్రెండ్ )వచ్చింది .ముగ్గురం (తమ్ముడు ,నేను, మేరీ )కలిసి పెరట్లో ఉన్న జామకాయలు కోసి రామాలయం దగ్గరికి పరుగెత్తాం .రాణి మమల్ని చూడగానే లోపల్నించి పరిగెత్తుకుని వచ్చింది .

చిన్ని ,నాని బాగున్నారా ?రెప్పుడొచ్చారు ?...అరే జామకాయలు నాకు తెచ్చారా అంది 

రాత్రే వచ్చామే .బాగున్నావా ,ఛాలా కాయలు తెచ్చాము అన్నాను నేను .

ఇప్పుడే వస్తానే ,లోపల పూజ జరుగుతుంది .పూజలో లేకపోతే నాన్నగారు ఊరుకోరు అని లోపలి కి పరుగెత్తిన్ది .మేము ఆమె వెనుకే వెళ్లి కాసేపు పూజలో వున్నాము .పూజ అయిన తరువాత ఫలహారం పెట్టారు . రాణి పూజారి గారి కూతురు కావటం తో మాకు కాస్త ఫలహారం ఎక్కువే పెట్టారు .ఫలహారం తిని బయట ఉన్న ఆలయం అరుగుల మీదికి చేరాం .రామాలయం ప్రక్కనే కలువపూల చెరువు ,చేపలు తింటున్న తెల్లని కొంగలు ,ఉదయిస్తున్న సూరీడు ,చల్లని పైర గాలి అది నాకు చాలా ఇష్టమైన చాలా అందమైన సుందర దృశ్యం .ఆ సుందర దృశ్యం చూస్తూ నా చేతిలో వున్నా జామకాయ ఎప్పుడు తిన్నానో కూడా తెలియ లేదు .ఈలోపు అమ్మమ్మ మా కోసం వచ్చింది .టిఫిన్ లు చేయకుండా పొద్దుటే వచ్ఛరే

మీకు ఇష్టం అని కొబ్బరి చట్నీ కూడా చేశాను .

మా పొట్టలో ఇంత కూడా కాళీ లేదు అమ్మమ్మ అన్నాడు తమ్ముడు 

మరి ఇప్పడు వేసిన ఇడ్లిలు అన్ని ఏమి చెయ్యలీ 

'నేను తింటా లేవే "....అప్పుడే బస్సు దిగి వస్తున్న సూరమ్మ అమ్మమ్మ నవ్వుతు అంది .

'అక్క బాగున్నావా ' ఆప్యాయం గా పలకరించింది అమ్మమ్మ .నేను దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకొని అమ్మమ్మ బాగున్నావా అని అన్నాను .

బంగారుతల్లి బాగున్నానే అని నా బుగ్గ గిల్లి 

తమ్ముడిని ఎత్తుకుని ఏరా అమ్మ కొడుకా బాగున్నావా అంది సూరమ్మ అమ్మమ్మ అంటూ నాకో జీడీ ,తమ్ముడికో జీడీ ఇచ్చింది .

అప్పటి జీడీలు చాలా పెద్దగా ,గట్టిగా ఉండేవి అవి తింటానికి నాకైతె అరగంట పట్టేది .ఇంటికొచ్చి ముందుగా టపాకాయలు అన్ని ఎండలో ఆరపోసి ,కొత్తగా కొన్న ప్రమ్మిదెలను అమ్మమ్మ మాట మేరకు నీళ్లలో నాన పెట్టాం .

సూరమ్మ అమ్మమ్మ ఎప్పుడు ఈ వూరు వచ్చినా తన ఫ్రెండ్స్ ని పోగేస్తువుంటుంది (ఆమె తరచు వస్తుంటుంది లెండి )ఆ వురి వాళ్లంతా దానిని పోసుకోలు బ్యాచ్ అంటూ వుంటారు .ఎందుకంటే వాళ్ళు ఊరిలో జరిగే విష్యాలే కాకుండా జరగబోయేవి కూడా ఊహించుకొని చెప్పుకుంటూ వుంటారు . టీవీ  న్యూస్ టైం కి తన ఫ్రెండ్స్ ని అందర్నీ సమావేశ పరిచింది సూరమ్మ అమ్మమ్మ.  (ఆ ఊరిలో మాదే ఫస్ట్ టీవీ )నన్ను ట్రాన్సలెటర్ గా పెట్టింది .న్యూస్ రెడ్ బై రెయిని సైమన్ ...అని స్టార్ చేసింది న్యూస్ రీడర్ .నేను వామన గుంతలు తమ్ముడితో ఆడుతూ తెలుగులోకి తర్జుమా చేస్తూ వున్నాను .ఈలోపు ఆటలో పడి న్యూస్ సరిగా వినలేదు లాస్ట్ లో మాత్రం ఆమె 7th డే అని అంటం మాత్రమే విన్నాను .  ఈలోపు ఒక మొట్ఠోకాయ పడింది ఏమందే . ..చెప్పు అని . వినలేదు అంటే ఎక్కడ తంతుందో అని ఇందాక చెప్పుకున్నారు కదా సావిత్రఆంటీ కూతురు సవార్తాడింది అని అదే చెపుతున్నారు అన్నాను .

ఓరి భడవా ఎంత బడా ఈ టీవీ లో కూడా చెప్పిస్తున్నారే కలికాలం వదినా ...అనుకున్నారు అంతా 

రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రాంతీయ బాషా చిత్రంగా తెలుగు సినిమా అని ఆంకరు చెప్పింది అని చెప్పటంతో అందరు రేపు రెండింటికి కలుద్దామా నుకుని వెళ్లారు .


హాల్ లో మా ఫ్రెండ్స్ అంతా చాపలు పరిచి క్రింద కూర్చున్నాం .అమ్మమ్మ మంచాలు ,కుర్చీలు వేసింది .1:30 కే హాల్ అంతా నిండి పోయి సినిమా హాల్ ని తలపిస్తూ వుంది .

సోడయి.... సోడయి ..అంటూ సోడా బండి శ్రీను బండి ని మా పెరట్లోకి తీసుకొని వచ్చాడు .ఒక నాలుగు గాజు సీసాలు (తినుబండారాలు వున్నవి )తీసి అరుగు మీద పెట్టాడు .

ఏ రా శీను మా ఇంట్లో  కొట్టేమన్న పెడుతున్నావా ? ? అంటూ కోపగించుకోబోయింది అమ్మమ్మ .

నేనే రమ్మన్నలేవే వీళ్ళందరికి మంచినీళ్ళని ,అవని ,ఈవని నువ్వెక్కడ తిరుగుతావ్ ...ఉండని అంది సురమ్మ అమ్మమ్మ.

ప్రేక్షకుల కోరిక మేరకు టైం కాకముందే టీవీ ఆన్ చేసి దాని ముందు కూర్చున్నాం .టీవీ అంతా చుక్కలు చుక్కలుగా వస్తు వుంది .

"టీవీ లో వర్షం పడుతున్నట్టు వుంది ఈరోజు సినిమా వేస్తారంటావా " అంది సరోజినీ అత్త .

ప్రోగ్రాం లేకపోతే అలాగే వస్తుంది అత్త చెప్పాను .


టీవీ లో టూ .....డూడూ ...డు అని కాసేపు గుండ్రాలు తిరిగాక యాంకరమ్మ వచ్చింది "ఆజ్ ఆప్ దేఖ్నే జారహీహై తెలుగు ఫిల్మ్ వీర మడ్డి బాతుకుల్ ."అని స్టోరీ చెప్పటం మొదలు పెట్టింది .

అమ్మమ్మ వీరమడ్డి బాతుకుల్ ఆ... ఇదేదో ఆరవ డబ్బింగ్ సినిమా అనుకుంటా అంది .

ఈలోపు ఓ..పావుగంట అడ్వర్టిస్మెంట్లు .... వాషింగ్ పౌడరు నిర్మా అని , ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ 

..., థా జింగ్ థింగ్...గోల్డ్ స్పాట్...అని వస్తూ ఉంటే ఒక్క బిట్టు కూడా పోకుండా నోరుతెరిచి చూస్తూ వున్నారు అంతా .ఈలోపు బొమ్మపోయి మళ్ళా చుక్కలు మొదలైనాయి . నాకు తెలుసు ,నాకుతెలుసు అని వీరబద్దరావు ఇల్లు ఎక్కేశాడు .అది ఒక పెంకుటిల్లు వీడేమో తొంబై కేజీలు ఉంటాడు .వాడు ఇంటి పై నడుస్తుంటే టాప్ టాప్ అని శబ్దం పెంకు పగులుతుందో జరిగిపోతున్నాయో అర్థం కావట్లేదు

దిన కంత్రి వాడ నువ్వరేందుకు ఎక్కావురా దిగు ముందు అంది అమ్మమ్మ

నాకు త్తెలుసు అమ్మమ్మ అని ,అంటేనా అటు ఎటు తిప్పి ఎట్లాగో బొమ్మ వచ్చేట్టు చేసాడు .కానీ పైకైతే ఎక్కాడు గాని కిందకి ఎట్లా దిగాలి అర్థం కాలేదు వాడికి ,పైనే ఉండి నాకు భయం వేస్తుంది నన్ను దింపండి అంటూ ఏడవటం మొదలు పెట్టాడు .ఈగోలంతా వాళ్ళ అమ్మవిని వచ్చింది ,నీ టీవీ పాడు గాను నాకొడుకు ని ఎందుకేక్కించారే అని తిట్లదండకం మొదలు పెట్టింది .ఇది భరించలేక ఒక నులక మంచం తెచ్చి దాని మీదకు దూకమని చెప్పారు .వాడు దూకిన దూకుడికి కోళ్లు ,కుక్కలు అన్ని బెదిరి పారిపోయాయ్ .మంచం రెండుగా విరిగింది .మళ్ళా అంతా టీవీ ముందుకొచ్చాం .సుదీర్ఘంగా సాగే ప్రకటనల మధ్య కొద్దీ కొద్దిగా సినిమా వేస్తుంటే దానిని అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేస్తూఉన్నామ్ .ఈలోపు కరెంటు పోయింది .

ప్రక్క లైన్ కి కరెంటు బాగానేవుంది అంటే కచ్చితంగా ఇది ప్రసాద్ బాబాయ్ పనే ఆయీ ఉంటుంది .ప్రసాద్ బాబాయ్ బాగా తాగి పిల్లల్ని, భార్య సరిగా పట్టించుకోడు .ఆయన భార్యకు ఎప్పుడో కోపమొచ్చినప్పుడు ఆయనను కొడుతూవుంటుంది .కొట్టినప్పుడల్లా( ఆయన లైన్ మాన్ , ) కావటం తో ఆ లైన్ కి కరెంటు తీసి ఇట్లా తన భార్యకు తన నిరసన వ్యక్త పరుస్తూ ఉంటాడు .

అమ్మమ్మ శరత్ అన్న కి చెప్పి ప్రసాద్ బాబాయ్ ని 

 వెతికి ఒప్పించి కరెంటు వేయమని చెప్పమని  చెప్పి పంపింది .నేవెళ్తా , నేవెళ్తా అని వీరబడ్డారావు ,వద్దు అని చెప్పే లోపు పరిగెత్తాడు .మొత్తానికి ఊరంతా జల్లెడ పట్టి ఒక చోట ప్రసాద్ బాబాయ్ ని కనుగొని బ్రతిమాలి కరెంటు ఏపించారు .హమ్మయ్య అనుకున్నాం అంతా .సినిమా ఆఖరుకు వచ్చింది .రెండు నిమిషాలు చూడగానే శుభం కార్డు వేశారు .

ఏమైనా తెలుగు మాటలు టీవీ లో బహుకమ్మగా ఉన్నయీ అంది సూరమ్మ అమ్మమ్మ.

ఎందుకుండవండి సీసాడు చేగోడీలు నామిలేసారు కదా అంటూ ఆమె చేతిలో వున్నా చేగోడీల సీసా వైపు చూసాడు సోడా బండి శీను .నీదిష్టే తగిలేట్టువుంది రా నాకు సుప్పనతోడా .., అంది సూరమ్మ అమ్మమ్మ.

ఎంత అయంది రా చెప్పు అంది అమ్మమ్మ.

పది సోడాలు ,చేగోడీలు నాలుగు రూపాయలండి చెప్పాడు వాడు . అమ్మమ్మ వాడికి డబ్బులిచ్చి పంపింది .తరువాతి రోజు దీపావళి కావటంతో పట్టు పరికిణి కట్టి ఊరంతా గెంతి ,అమ్మ వండిన పిండివంటలు తిని ,సాయంత్రం టపాకాయలతో పండగ ముగించాం .

ఈ వీర మడ్డి బాతుకూల్ ఏంటా అనేగా మీ సందేహం 

ఆ సినిమా పేరు *వూరు ఉమ్మడి బ్రతుకులు *.ఆ హింది యాంకర్ కి పలకటం రాక అది కాస్తా వీర మడ్డి బాతు కూల్ అయింది అన్నమాట .


Rate this content
Log in

Similar telugu story from Classics