kottapalli udayababu

Drama Action Classics

4  

kottapalli udayababu

Drama Action Classics

మబ్బుల్లో చంద్రుడు (రొమాంటిక్ ట్విస్ట్ )

మబ్బుల్లో చంద్రుడు (రొమాంటిక్ ట్విస్ట్ )

5 mins
238


మబ్బుల్లో చంద్రుడు (రొమాంటిక్)

హఠాత్తుగా వెనకనుంచి చుట్టేస్తూ బామ్మగారి బుగ్గను సున్నితంగా కొరికి కిలకిల నవ్వుతున్న వర్ధినిని కోపంగా చూస్తూ చేతుల్లో ఉన్న వారపత్రికను పక్కన పెట్టి ఒక చేత్తో బుగ్గలను తడుముకున్నారు వర్ధనమ్మ గారు.

" అబ్బా ! మీ ఆయన ఊరు వెళ్ళి పోవడం కాదు కానీ నాకు వచ్చి పడిందే చావు. అయినా నీకు ఇదేం దొబ్బిడాయే తల్లీ! రాత్రిళ్ళు పక్కలో పడుకుని కాళ్ళ మీద కాళ్ళు వేస్తావ్. రాత్రి నిద్ర లేదు కదా అని పగలు నడుము వాలిస్తే ఎముకలు విరిగేలా కౌగిలించుకుని ఏదైనా చదువుకుంటుంటే ఇలా ఏమరుపాటుగా వచ్చి బుగ్గలు కొరికి పోతావు. ఎలాగే నీతో చచ్చేది? ఏది మీ ఆయన చిరునామా ఇలా తీసుకురా.... ముందా గాడిదకి టెలిగ్రామ్ ఇచ్చి వెంటనే రమ్మంటాను. ఈ ఆషాఢ మాసాలు అవి ఎవరు కనిపెట్టారో గానీ ఈ కాలం పిల్లలు పిల్లలు కాదురా దేవుడా! ఇంతకీ ఏమిటి సంగతి'' 'అడిగింది వర్ధనమ్మ గారు.

''విశేషమే ! ఏమిటో నువ్వే చెప్పుకో'' అంది కొంటేగా నవ్వుతూ వర్దిని .

''ఏముంది మీ ఆయన ఉత్తరం రాసి ఉంటాడు... అదే...నా మనవడు గాడిద!'' కావాలని 'గాడిద' అన్న చోట ఒత్తి పలుకుతూ.

''రాసింది నీ మనవడు గాడిద కాదు. పైన నీ అడ్రస్ ఉంది. బహుశా తాతయ్య అనుకుంటా .ఇక్కడ నేను పడుతున్న అవస్థ, అక్కడ తాతయ్య పడుతున్నట్టున్నాడు.'' అంది వర్ధనమ్మగారి బుగ్గలు సాగదీస్తూ. వర్ధనమ్మగారు ఒక్క క్షణం సిగ్గు పడ్డారు .

''ఈ వయసులో ఆయన నాకు ఉత్తరం రాయడం ఏమిటి నీ మొహం!" అందామె అరవిరిసిన తామరలా హొయలు పోతూ.

''ఇదిగో చూడు.. నా మాట అబద్ధం అయితే" అంటూ కవరు బామ్మ చేతిలో పెట్టింది వర్ధని. 

కవరు లోంచి నాలుగు మడతలు కాగితం బయటకు లాగింది వర్ధనమ్మ గారు. 

అందులోంచి చామంతి రేకలు, బంతి రేఖలు, సంపంగి రేకలు, ఆమె ఒల్లో పడ్డాయి.

'ఈయనకు నిజంగానే పైత్యం ఎక్కినట్టుంది. ఇంటికి వెళ్ళాక చెబుతాను' అని అనుకుంటూ కాయితం మడతలు విప్పారు ఆమె.

''నా ప్రాణంలో ప్రాణమైన వర్ధనికి...'' అని ఉండడంతో కింద సంతకం చూసిందామె.

''నిన్ను గెలిచి ఓడిన నీ ప్రియ పురుషుడు - చంద్రం''అని ఉంది.

''నీ మొహం. ఇది నీకు రాసింది. అనవసరంగా ఎంత టైం వేస్ట్ చేసుకున్నావో '' అంటూ మనవరాలి చేతిలో కవరు ఉత్తరం నుంచి, తన ఒంటి పై పడిన పూల రేకులతో వర్దిని ముఖం మీద కొట్టారు వర్ధనమ్మ గారు.

ఆమె కెంపు బుగ్గలకు తాగిన మైకం విడలేనట్టు గా కొన్ని, ఆమె కంటిపాప లపై కొన్ని, దొండపండు పెదవులపై కొన్ని, ఎగురుతున్న ముంగురులలో చిక్కి బయటపడలేక విలవిలలాడుతున్నవి కొన్ని, సగర్వంగా తమలోని సజీవత్వాన్ని ప్రదర్శిస్తుంటే - తొలిరాత్రి గదిలోకి వెళ్లి ఉదయం ఇవతలకు వచ్చిన వర్ధిని రూపం గుర్తొచ్చింది వర్ధనమ్మగారికి. 

ఇంకా ఏమైనా మాట్లాడితే సమయం వృధా అనుకున్న వర్ధిని రివ్వున లేచి కవరు, ఉత్తరం తీసుకుని తన గదిలోకి వచ్చి తలగడ మీద వాలిపోయింది. 

తన మీద 20 సంవత్సరాల దోరవయసు, పరిపూర్ణమైన కొన్ని సొగసులతో ఒక్కసారిగా వెల్లకిలా పడేసరికి మెత్తని ఆ పరుపు - పెదవుల ఒత్తిడికి రక్తం ఎగజిమ్ముతూ మరింత ఎర్రదనంతో మెరిసిపోతూ, మరింత నిగారించిన పడుచుపిల్ల పెదవుల్లా ఆమె బరువుకి పైకి ఉబ్బింది.

 పరికిణి జారిన ఆమె మోకాళ్ళు ఏపుగా పెరిగిన జొన్నకంకులకు ప్రతిరూపాలుగా ఉంటే వాటికి వేలాడుతున్న వెండి మువ్వల పట్టీలు లయబద్ధంగా కదుపుతున్న ఆమె కాళ్ళకు తాళం వేస్తున్నాయి. 

ఆమె నాభి లోతుకి, మెత్తని పరుపు కి మధ్య ఇరుక్కుపోయిన గాలి ధన్యత చెందిన పరవశం చేతనో, ఉక్కిరి బిక్కిరై విలవిలలాడటం చేతనో అక్కడే తిరుగాడుతోంది.

వక్షాన్ని చుట్టబెట్టిన జాకెట్టు లేకపోతే తానే మాయా ప్రవరుడై ఆ వరూధిని సోయగాన్ని ఒక పట్టు పట్టే అవకాశం కల్పించమని ఆ పరుపే పురుషుడైతే, భగవంతుని ఆ ఒక్క వరమే కోరేదేమో అన్న విధంగా ఆ ప్రదేశంలో మాత్రం పరుపు నిశ్చలంగా ఉంది. 

మన్మధుని వింటి నుండి వెలువడిన కలువ బాణాల పరంపరలా, ఆమె చూపుల బాణాలు అతను రాసిన అక్షరాల లేళ్ళ గుంపును వేటాడుతున్నట్టు గా పరిగెత్త సాగాయి.

"నీ శంఖపు మెడ మీద ముద్దులతో వ్రాయునది.

శరీరానికి గాయమై రక్తం వచ్చి సలుపు పెట్టినప్పుడు కూడా ఇంత బాధపడలేదు.

వనీ! ముచ్చటైన మూడు రాత్రులలో మనసంతా తీపిగాయాలై శాపం పొందిన ఇంద్రునిలా బాధపడుతున్నాను. నా నరాల వీణాలన్నీ తీయని అనుభవంతో తీరని సలపరంతో మరిన్ని మైళ్ళ పొడవు నాలో సాగి సాగి పేలిపోతాయేమో అన్నంత బాధ. ఇంతకాలం ఎక్కడ దాచావు ఈ సోయగాన్ని?

అరె!ఊట బావి లాంటి నీ శరీరం నుంచి ఎంత సౌఖ్యాన్ని చేదుకున్నా తనివి తీరడం లేదని ప్రయత్నం చేస్తున్న సమయంలో, ఏమిటి మన మధ్య ఈ ఎడబాటు?

ఆ టెలిగ్రామ్ కూడా మన మూడు రాత్రుల తర్వాతే రావాలా? అది జరగక ముందే వస్తే నువ్వేమిటో తెలుసుకుంటున్న నేను ఏ బాధా లేకుండా హాయిగా వెళ్లిపోయేవాడిని. ఇంతకన్నా ఎక్కువ ఆలోచిస్తే నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి. అందుకే విజయవాడ రైల్వే స్టేషన్ లోనే దీనిని రాసి పోస్ట్ చేస్తున్నా.

అమ్మమ్మకు నా క్షమాపణలు చెప్పు. మూడు వేల రూపాయలకు డిడి తీసి పంపుతున్నాను. ఆ డబ్బు డ్రా చేసి అమ్మమ్మకు ఇవ్వు. ఎందుకో గుర్తిందిగా! నేను వచ్చేసరికి 'అది' - ' నువ్వు 'కూడా రెడీ అయిపోవాలి. ఎలాగోలా సెలవు దొరకబుచ్చుకుని నీ సన్నిధిలో నెలరోజుల్లోగా ఉంటాను. 

-ఉండనా మరి!

నిన్ను గెలిచి ఓడిన నీ ప్రియ పురుషుడు -చంద్రం."

ఉత్తరాన్ని తాదాత్మ్యంతో ముద్దు పెట్టుకున్న వర్ధని పరుపు మీద వెల్లకిలా పడుకుని ఒక కాలు సగం పైకి లేపి, గుండెల మీద ఉత్తరాన్ని ఉంచుకొని దానిపై పమిట కప్పింది. అటు పై కవరు పరిశీలించింది.

కారు లోపల అతుక్కున్నట్టు గా ఉన్న   డి డి ని బయటికి లాగింది. దానిపై వర్ధని పేరు రాసి 3000 అని వేసి ఉంది. అది పంపాల్సిన ఆవశ్యకతను జ్ఞప్తికి తెచ్చుకుంటూ గతంలో కి వెళ్ళింది వర్ధని.

********

వర్ధనమ్మ గారి ఒక్కగానొక్క కొడుకు త్రినాథరావు ఏకైక కుమార్తె వర్థినికి, ఒక్కగానొక్క కూతురు కళ్యాణి ఏకైక కుమారుడు చంద్రానికి 15 రోజుల క్రితం వివాహం జరిగింది .చిన్నప్పుడు ఒకరినొకరు ఎంతగా ద్వేషించు కొనే అవకాశం ఉందో, అంతగా ద్వేషించకున్న చంద్రం, వర్ధని యవ్వన రేకలు విరిసిన తర్వాత ఒకరినొకరు చూసుకుని విస్తుపోయారు.

తమ మనసులు కలుపుకుని ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత పెద్దలందరినీ సమావేశపరిచి తమ నిర్ణయాన్ని చెప్పడంతో ముందు ఆశ్చర్యపోయినా తర్వాత తాతగారు బామ్మగారు, చంద్రం తల్లిదండ్రులు, వర్ధని తల్లిదండ్రులు మనస్పూర్తిగా సంతోషించారు. చంద్రుని ఎయిర్ఫోర్స్ లో రేడియో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. 

పెళ్లి తంతు పూర్తయ్యాక కూతురు, అల్లుడు తో కలిసి నారాయణమూర్తి గారు తన ఇంటికి వెళ్లిపోయారు.

వర్ధనమ్మ గారు 16 రోజుల పండుగకు మనవడు, మనవరాలుని తీసుకుని కూతురు ఇంటికి వెళ్లాల్సి ఉంది.

శోభనం ముహూర్తం పెళ్లి అయిన వెంటనే కుదరకపోవడంతో ఆ నాలుగు రోజులు మిగతా ముచ్చట్లతో కాలక్షేపం చేశారు,

అందరికీ అందరూ బంధువులే కాబట్టి.

ఆ తరువాత రాత్రి శోభనం ముహూర్తం నిర్ణయించారు . గది అంతా శోభాయమానంగా అలంకరించారు. 

విశాలమైన ఆ గది లో పాతకాలపు పట్టె మంచం. దానిపై పెరట్లోని బూరుగు చెట్టునుంచి కాయలు కోయించి, దూది ఏకించి,ఒత్తుగా, మెత్తగా, అందంగా కుట్టించిన కొత్త పరుపు, దానిపై జరిగే కార్యానికి ప్రత్యక్ష సాక్షులు తామే అన్నట్టు విశాల చక్షువుల్లా ఉన్న దిండ్లు.

గత నాలుగు మూలలా స్టూల్స్ వేసి పువ్వులు ఎంబ్రాయిడరీ చేసిన  అందమైన క్లాత్స్ పరచి, వాటిపై సువాసనలు వెదజల్లే బంతి పూల గుత్తులు,గులాబీ గుత్తులు,చామంతి గుత్తులు, మరువం దవనం మధ్య మధ్య  అమర్చిన చిట్టిచామంతి గుత్తులు మరీ,మరీ ముచ్చటగొలిపేలా ఉన్నాయి.

నాలుగైదు రకాల పళ్ళు, రకరకాల స్వీట్లు, వెండిపళ్ళాలలో మదనయజ్ఞపు సామాగ్రి లా ఎదురుచూస్తున్నాయి .

యధావిధిగా పూజ జరిగి చంద్రం చిటికినవేలు పట్టుకుని గదిలోకి అడుగు పెట్టబోతున్న వర్దినిని ఆపారు వర్ధనమ్మగారు.

" ఒసేయ్ అమ్మాయి! ఆ పట్టెమంచం పాతకాలంది. ముట్టుకుంటే పుటుక్కున విరిగేలా ఉంది. దాన్నివతయారు చేసి వాడకం మొదలుపెట్టాక తరాలు గడిచిపోయాయి గానీ దానిని బాగు చేయించడమే కుదరలేదట. మా అత్తగారు చెప్పేది. ఎలా కుదురుతుంది మరి!పెళ్ళైన ప్రతీ జంటవాళ్ళ శోభనం మొదలుకుని 16 రోజుల పండుగ వరకూ వాడేవారట. ఆతరువాత అటక ఎక్కించేసేవారట.

అసలే ఈ కాలం పిల్లలు పరమ ముదుర్లు. పిచ్చి పిచ్చి వేషాలు వేయక నెలరోజుల తిరక్కుండానే నీ కడుపు పండాలి అనుకోండి. వాడు ఎంతటి నామనవడైనా ఈ విషయాలన్నీ వాడితో నేను చెప్పలేను కదా !ఇప్పుడే పిల్లలు వద్దు అనుకునే పిచ్చి ఆలోచనలు వద్దు. ఒకర్ని ముందు కనేస్తే తర్వాత మీ ఇష్టం. అర్ధమైందా?

ఈ శుభకార్యం మాత్రం గడిచిపోతే తర్వాత తప్పకుండా బాగు చేయిస్తాను. తెలిసిందా?" అందామె.

" పో బామ్మ! మరీ విచిత్రంగా మాట్లాడుతావ్. ఎక్కడైనా పట్టెమంచాల మీద పడుకుంటేనే పిల్లలు పుడతారా ఏమిటి? దేశ జనాభా ఇంతలా పెరిగిపోతుంటే అందరిళ్లలోనూ ఈ పట్టెమంచాలే ఉంటాయా ఏమిటి? గుడిసెల్లోవాళ్ళు కాపరాలు చేసి పిల్లల్ని కనడం లేదూ?" నిర్లక్ష్యంగా నవ్వేస్తూ అంది వర్థిని.

"నోరు మూసుకొని చెప్పింది చెయ్. అందరి సంగతి మనకు అనవసరం. మన వంశమంతా ఈ పట్టెమంచం మీద వృద్ధి అయ్యింది. ఈ మూడు నిద్రలు జరిగేంత వరకూ మాత్రం మంచం జాగ్రత్త" తల్లి కసరడంతో -

" అంటే మంచానికి ఏం జరగకూడదు. మేం మాత్రం ఏమైనా పర్వాలేదు. అంతే కదా!" అంది వర్ధని.

" నీ మొహం. మీరు అనుక్షణం బాగుండాలనే మా తాపత్రయం అంతా పిచ్చిదానా!" చిరు కోపం గా ఉన్న వర్ధని బుగ్గ చిదిమి పాలగ్లాసు అందించారు వర్ధనమ్మగారు.

వర్ధని లోపలికి నడిచింది. 

*********

"అక్కడే నిలబడి పోయావేం? ఇలా వచ్చి మంచం మీద కూర్చో "అన్నాడు చంద్రం - గుమ్మం దగ్గరే ఆగిపోయిన వర్ధని ని చూస్తూ.

"నువ్వు మంచం మీద పడుకో బావ! నేను నేల మీద పడుకుంటాను.మంచం బాగా ఊగిసలాడుతోంది .దానిమీదే వంశవృద్ధి అవ్వాలట. జాగ్రత్త బావ!" వచ్చే నవ్వు ఆపుకుంటూ గోముగా అంది వర్ధని - అతని దగ్గరగా వచ్చి పాలగ్లాసు అందించి.

కోపంగా గ్లాసులో పాలన్నీ తాగేసీ గ్లాసు పక్కన పెట్టి ఒక్క ఉదుటున మంచం దిగి ఆమెను అమాంతం వాటేసుకున్నాడు చంద్రం.

" వదులు బావ!" అనే అవకాశం ఆమెకు ఐదు నిమిషాలపాటు ఇవ్వలేదతను. తొలిసారిగా అధరామృతాన్ని అంతసేపు చవిచూసిన ఆమె పూర్తిగా వివశురాలై టేకు వృక్షం లాంటి అతన్ని దొండతీగలా అల్లుకుపోయింది. 

అతనిలో ఆమెకు నచ్చిన అద్భుతమైన అంశం ఏమిటంటే ఎక్కడా మొరటుతనం ప్రదర్శించక పోవడం.

 ఏ భాగాన్ని అతను స్పృశించినా అపురూపమైన వస్తువుని ముఖమల్ గుడ్డతో సున్నితంగా స్పృశిస్తూ,అవసరమైన చోట మెత్తగా ఒత్తుతూ, ఆ ప్రాంతం అంతా పారవశ్యంతో మమేకం అయిపోతుంటే ఆమె తనూపుష్పంలోని రేకులు ఒక్కొక్కటిగా విచ్చుకోసాగాయి.

పక్క ఏమాత్రం నలగకుండా అతడు తన మనో గృహ ప్రవేశం చేసి అణువణువు తిరుగుతుంటే అతని చాకచక్యానికి ఆశ్చర్యపోయిన ఆమె అతనితో పాటు విహరించసాగింది.

తమ వంశాభివృద్ధికి సహకరించిన తన్మయత్వంతో కాబోలు - తనపై వివశులై అలసిసొలసిన ఆ జంటతో తపస్సమాధిలో ఉన్న యోగ సిద్ధుడిలా ప్రశాంతంగా ఉంది పందిరిమంచం ఇప్పుడు.

**************

మూడో రోజు సాయంత్రం వేళ అర్జంటుగా మరో రెండు రోజులలో డ్యూటీకి హాజరు కమ్మని టెలిగ్రామ్ వచ్చింది చంద్రానికి.

మరునాటి ఉదయం ట్రైన్ ఉంది. దానికి బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడు అనుకున్నాడతను.

గత రెండు రోజులుగా మంచం క్షేమంగా ఉండడంతోపాటు అటు 'ఏమి' జరగలేదేమో అనే అనుమానం ఒక పక్క ముల్లులా గుచ్చుతుంటే ప్రతి క్షణం రొమాంచితమైన తన్మయత్వంతో ఏదో లోకాలలో తేలిపోతున్న మనవరాలి కళ్ళల్లోని సిగ్గు దొంతరలు, అంతా సవ్యంగా జరుగుతోందన్న ఆనందాన్ని సంతృప్తిని మిగిల్చాయి వర్ధనమ్మ గారికి.

కానీ మూడో తన అమృతబాండాన్ని వదిలి వెళ్ళిపోతున్నానన్న  విరహ వేదన భరించలేకో, దూరమై తిరిగి దగ్గరయ్యే క్షణం కోసం నిరీక్షించే ఓపిక లేకో, చంద్రం తోపాటు వర్ధని కూడా సమానంగా రెచ్చిపోవడంతో పట్టెమంచం అందరూ గాఢ నిద్రలో ఉండగా పుటుక్కున విరిగిపోయింది.ఆ గది మండువా లోగిలి కి దూరంగా చివార్న ఉండడంతో ఎవరికీ నిద్రాభంగం కలగలేదు.

విరిగిన పట్టెలు చెరొక వైపు పడిపోగా, తల వైపు, కాళ్ళ వైపు భాగాలు అంతక్రితం వాడిన పరుపు, దిళ్ళు చెరొకవైపు నేల మీద ఉంచడంతో వాటి మీద పడ్డాయి.

మధ్యలో నవ్వారు పట్టే మాత్రం చిన్నగా శబ్దం చేసినా ఆ శబ్దాన్ని బయటికి పోనివ్వకుండా కాపు కాసింది.

నేలమీద పూర్తి స్వేచ్ఛ పరిధి లభించడంతో చంద్రం ఆకాశంలోని చంద్రుని వేగంతో సమానంగా ప్రయాణించి, ప్రయాణించి ఉదయం నిద్ర లేవ కుండానే తప్పక... తనని వదలలేక,వదలలేక వదిలి డ్యూటీకి వెళ్లి పోయాడు.

ఆ తర్వాత బామ్మ చదివిన దండకానికి తాను చెవుల్లో దూదులు పెట్టేసుకుని చెవిటిదైపోయింది గానీ, అతనే ఉండి ఉంటే తెలిసేది తానెంత తలపట్టుకుని కూర్చున్నదీ!

ఏదిఏమైనా చంద్రుడు చంద్రుడే.బామ్మకు ముఖం చూపించలేక "మబ్బున దాగిన చంద్రుడు".

ఈ మబ్బు తాత్కాలికం. బావకు సెలవు దొరికాక, ఈలోపు పట్టెమంచం తన పంపించిన డబ్బుతో మళ్లీ సింగారిస్తే ఆ నాటి నుంచి ప్రతి రేయి తమకు కార్తీక పౌర్ణమే.

బావ తాలూకు పరిమళాలతో పాటు, అనుభూతుల చందనాలు ఆస్వాదిస్తూ, అలా ఎంత సేపు ఉండి పోయిందో వర్దనికే సమయం తెలియలేదు.

" ఏమే అమ్మాయి! పొద్దుటనగా గదిలోకి దూరావు.ఆ ఉత్తరం నమిలి నెమరువేసుకుంటే సరిపోతుందా? ఆకలి వేయడం లేదా ?"అడిగింది వర్ధనమ్మ గారు లోపలికి వచ్చి మనవరాలు పల్చటి పొట్టమీద చేయి వేస్తూ.

వర్దిని లేచి బామ్మగారి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని ఆవిడ చేతిలో డిడి ఉంచింది.

"ఏంటే ఇది?" అన్నారావిడ 

"నీ మనవడు మంచం బాగు చేత కు 3000 పంపాడు బామ్మ. ఎప్పుడు వస్తాడో తెలియదు. హఠాత్తుగా ఊడిపడతాడంట" అంది బామ్మ భుజాల చుట్టూ చేయి వేస్తూ.

" రానీ భడవని. చేయాల్సిందంతా చేసి ముఖం చాటేస్తే ఊరుకుంటాననుకున్నాడేమో. సరేగానీ అన్నానికి పద."

"ఇంతకీ మంచం ఎప్పుడు బాగు చేయిస్తావ్ బామ్మ?" గారంగా అడిగింది వర్ధిని.

ఆమె మాట పూర్తయ్యేలోగా వర్థని తల్లి లోపలికి వస్తూ అంది 

"అత్తయ్య. వడ్రంగిని రమ్మన్నారట కదా! వచ్చాడు. కూర్చో పెట్టాను. అన్నాలు తిని పని పురమాయిద్దురు గాని.వడ్డించేశాను. రండి" అంటూ బయటికి దారితీసింది. 

అందరూ బయటికి వెళ్లి పోయినా ఆ గదిలో పట్టెమంచం భాగాలు తామెప్పుడూ కలిసి ఆ దంపతులను ఎప్పుడూ కలుపుతామో అన్నట్టు జాలిగా చూస్తున్నాయి!

సమాప్తం 



Rate this content
Log in

Similar telugu story from Drama