Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

లచ్చిమి

లచ్చిమి

2 mins
264


అప్పిగాడు ఇంటికి వస్తాండు అని వీరన్న చెప్పినప్పట్నుంచీ సావిత్రి మనసు మనసులో లేదు.


సావాసగాళ్లు అప్పిగాడు అంటారు గానీ మొగుణ్ణి అప్పిగాడు అని సావిత్రి అనదు. ఆ మాటకొస్తే మొగుణ్ణి పేరు పెట్టి పిలిసిందే లేదు. ఓబ్బా అనో అప్పయ్యో అనో పిలుస్తాది.


అసలు బాధంతా అప్పిగాడు ఇంటికొచ్చి లచ్చిమి కోసమే ఎతుకుతాడు. లచ్చిమి కనిపించకపోతే అప్పిగాడు ఏమైపోతాడో అని ఆమె బాధ.


మధ్యాహ్నం బండికి కడప జేరి పొద్దుగూంకేతలికి ఇంటికి చేరినాడు అప్పిగాడు.


ఇన్ని దినాలు ఫ్యాక్టరీలో పని చేసి ఇంటికి సెలవు మింద రావడం సంతోషంగా ఉంది అతనికి.


ఇంటికి రాంగానే ఓబ్బా వుండు అని సావిత్రి అరుస్తా ఉన్నా ఇనకుండా లచ్చిమిని కట్టేసే సోటికి పోయినాడు. లచ్చిమి లేదు. చుట్టూ చూసినాడు. 


ఏదీ లచ్చిమి. బయటికి తోలకపోయినారా? అని ఆత్రంగా అడిగినాడు. సావిత్రి ఏం మాట్లాడలేదు.


జాంకులూ అదే అడిగేసరికి ఇంక లచ్చిమిని సూడలేవుబ్బా అంది.


అప్పిగాడు ఉన్న సోటనే కూలబడ్డాడు. 


డాకటరు సూసినాడు. ఇంక బాగ్గాదు అని సెప్పేసినాడు. నీకు సెప్పలా. అది రేయీ పొద్దూ మూలిగి మూలిగి పోయింది. నీళ్ళు మాత్రం తాగేది. ఏది పెట్టినా తినేది కాదు. ఇంక మర్సిపో అప్పయ్యా అని సావిత్రి కళ్ళ నీళ్ళు పెట్టుకుని లోపలికి వెళ్లిపోయింది.


అప్పిగాడు ఎట్టా సెపితే అట్టా ఇనేది లచ్చిమి. ఎనుముకు వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు అప్పిగాడు.


అప్పిగాడు లచ్చిమికి తిండి పెడితేనే తినేది. ఏందయ్యా ఎనుముకు కూడా ఇంత గారం అని అనేది సావిత్రి.


సావిత్రి ఎనుము పాలు పిండి అడిగిన వాళ్ళ ఇళ్ళల్లో పోసి వచ్చేది. అప్పిగాడు పట్నంలో పనికి పోగానే లచ్చిమికి జబ్బు చేసి సచ్చిపోయింది.


మనిషికి చివరి చూపు చూడలేక పోయినందుకు ఎంత బాధ పడతామో లచ్చిమిని చూడలేకపోయాను అని శానా బాధ పడ్డాడు అప్పిగాడు.


ఆ రోజు రాత్రి లచ్చిమి అప్పిగాని కల్లోకి వచ్చింది.


అప్పిగాడు లచ్చిమి తల మీద ప్రేమగా చేత్తో నిమిరి దానికి మేత పెడుతున్నాడు. 


లచ్చిమి కళ్ళల్లో ఏదో ప్రశాంతత. అప్పిగాని ఆలోచనల్లో ఏదో భరోసా.


భూమంతా చదునుగా ఉండి అప్పుడే ఎనుమును మచ్చిక చేసుకున్న తొలి మనిషిలా అప్పిగాడు. యజమాని చేయి తనకు రక్షణగా అలవాటు చేసుకుంటూ పెంపుడు జంతువుగా లచ్చిమి. అలా కల సాగుతూ చెదిరిపోయింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract