STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

కళాశాలలో..

కళాశాలలో..

1 min
654

రేయ్ బా. CR(క్లాస్ రెప్రజెంటేటివ్) పోస్టుకు మేడమ్ ఓటింగ్ పెడుతుందంట రా. మన కిషోర్ గాడు కూడా నిలబడుతున్నాడు. వసంత్ వస పిట్టలా అరుస్తున్నాడు.


ఏంట్రా పొద్దున్నే సోది పెట్టావ్. బారెడు పొద్దెక్కినా బెడ్ షీట్ ముఖం మీద నుండి కూడా తీయకుండా బదులిచ్చాడు భార్గవ్. 


బావా బావా. లేవరా. కిషోర్ నిన్ను 

పిలుచుకురమ్మన్నాడురా. నా కోసం లేవరా అన్నాడు.


ఆదివారం కావడంతో ఆ ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఇంకా సగం మంది స్టూడెంట్స్ నిద్ర లేవలేదు.


సరేరా అంటూ నిద్ర లేచాడు భార్గవ్. ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. మొఖం కడుక్కోవచ్చు కదరా అన్నాడు వసంత్.


అబే. నేనేమన్నా లిప్ లాక్ ఇయ్యడానికి పోతున్నానా. మేటర్ సెటిల్ చెయ్యడానికి పోతున్నా. అంతే కదా అని జుట్టును మళ్లీ నుదురు పైన పడేలా వేళ్ళతో సర్దుకున్నాడు.


నువ్వు కిషోర్ గానికి చెప్పు. నేను నిరంజన్ గాడితో మాట్లాడి వస్తా అన్నాడు.


ఆడితో ఎందుకురా. వాడే కదా మనకు పోటీ అన్నాడు వసంత్. నువ్వు పోరాదురా అని విసుక్కున్నాడు భార్గవ్.


కొద్ది సేపటి తరువాత భార్గవ్ కిషోర్ తో మేటర్ సెటిల్ అని చెప్పా. కిషోర్ కి పోటీగా ఉన్న నిరంజన్ తప్పుకున్నాడు. 

కిషోర్ CR అయ్యాక అందరూ ఆశ్చర్యపోయారు. నిరంజన్ ఎందుకు తప్పుకున్నాడా అని.


నెల గడచిపోయింది. కాలేజ్ వార్షికోత్సవంలో మానస పక్కనే స్టేజీ మీద నిరంజన్. ఇద్దరూ కలిసి యాంకరింగ్ చేస్తున్నారు. నిరంజన్ ముఖం వెలిగిపోతోంది.


అయినా సీనియర్ జూనియర్ కలిసి యాంకరింగ్ చెయ్యాలనే ఐడియా ఎలా వచ్చిందిరా అని గ్రూప్ లో ఎవరో అన్నారు.


భార్గవ్ వసంత్ వైపు చూసి నవ్వాడు. ఆ రోజు నిరంజన్ అడిగిన షరతు అదే. తను పోటీ నుంచి తప్పుకోవాలి అంటే, మానస పక్కన యాంకరింగ్ చేయాలి అని. మరి పరిచయం పెరగాలంటే తప్పదు కదా.


అదన్నమాట సంగతి. CR ఎలక్షన్ అలా ముగిసింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract