Dinakar Reddy

Abstract Children Stories Comedy

4  

Dinakar Reddy

Abstract Children Stories Comedy

కిష్కింధ వాటర్ వరల్డ్

కిష్కింధ వాటర్ వరల్డ్

2 mins
666


ఎక్కడికైనా అందరూ కలిసి వెళ్లాలంటే వీలు చిక్కేది పెళ్లిళ్ల సీజన్ లోనే. మిగతా రోజుల్లో స్కూల్ కి ఒక్క రోజూ బంక్ కొట్టనివ్వని పెద్దవాళ్ళు పెళ్లిళ్ల సీజన్ లో రాజూ! ఈ వేళ మధ్యాహ్నం స్కూలుకు వెళ్లొద్దు. సాయంత్రం పెళ్లికి వెళదాం అంటూ ముందే చెప్పేస్తారు.


నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు ఒకసారి చెన్నై వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బంధువుల ఇంట్లో పెళ్లికి. నేను రాను మొర్రో అంటే ఎవరైనా వింటేనా?


అక్కడికి దగ్గరలో ఏదో వాటర్ పార్క్ ఉందని చెప్పి తీసుకెళ్లారు. ఇక అదే నా కలల విహార యాత్ర అనుకున్నాను అప్పటికి. అంతే కదా. ఎప్పుడూ ఊరు దాటి అడుగు బయట పెట్టని నేను చెన్నై వెళ్లి రావడం అంటే మాటలా?


నేనూ నాన్నా, మా మామ ముగ్గురం వెళ్ళాం అక్కడికి. అమ్మా వాళ్ళు ఏదో గుడికి వెళ్లారు. కిష్కింధ వాటర్ వరల్డ్ అని బోర్డు చూశాను.


టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము.


అక్కడ బోల్డన్ని గేమ్స్ ఉన్నాయి. ఎంచక్కా అందరం ఆడుకోవచ్చు. అదేదో డ్రాగన్ ముఖం ఉన్న రైలు బండి. ఓపెన్ టాపు కూడాను. అందులో కూర్చుని ఉంటే అది కదిలింది.


కాసేపటికి మమ్మల్నందరినీ నీళ్ళల్లో మంచి బయటికి తీసింది. అప్పటికి గానీ తెలీలేదు ఈ రైలు బండి స్విమ్మింగ్ పూల్ మీదుగా వెళుతుంది అని.


తడిచిన బట్టలు ఆరలేదు. అప్పుడే నాకు జెయింట్ వీల్ కనిపించింది. పెద్ద జెయింట్ వీల్ అంది.


మా మామ జెయింట్ వీల్ ఎక్కను, భయం అని అన్నాడు. మామ అంటే మా అమ్మ తరపు బంధువు. తొమ్మిదో తరగతి మా స్కూల్లోనే చదువుతున్నాడు.


నేను మామ ముందర పోజు కొట్టాలని నాన్నతో జెయింట్ వీల్ ఎక్కుదాం అన్నాను.


మామ చూస్తుండగా నేనూ, నాన్నా జెయింట్ వీల్ ఎక్కడం అది స్టార్ట్ అవడం జరిగిపోయింది. పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఒళ్లంతా బరువెక్కినట్టు అనిపించింది.


అది కిందికి వచ్చేటప్పుడు నేను పొరపాటున భూమి వైపు చూశాను. అప్పటికీ నాన్న చెబుతూనే ఉన్నారు కిందకి చూడకు. భయపడతావు అని. ఇక నా ఒళ్ళంతా తేలిగ్గా అనిపించసాగింది.


బాబోయ్. నన్ను దింపెయ్యండి. నా చెప్పులు జారిపోతున్నాయి అని ఒకటే కేకలు పెట్టాను. నాన్న నా చెయ్యి పట్టుకున్నాడు. అయినా నేను వినలేదు.


జెయింట్ వీల్ ఆపెయ్యమని అరిచాను. ఎవరికి వినిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అరవడమే. అదేం ఆనందమో.


కిందకి దిగి చెప్పులు చూసుకున్నాక నేను కుదుటపడ్డాను.


అమ్మో. ఇక ఎప్పుడూ జెయింట్ వీల్ ఎక్కకూడదు అనుకుని డైనోసార్ల బొమ్మలు చూడ్డానికి మామను, నాన్ననూ తీసుకుని ముందుకు వెళ్ళాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract