Kishore Semalla

Action Inspirational Others

4.8  

Kishore Semalla

Action Inspirational Others

జోహార్ ఓ సైనికుడా🙏

జోహార్ ఓ సైనికుడా🙏

3 mins
22.7K


          బోర్డర్ అట్టుడికిపోతుంది. శత్రువులు వేలల్లో వచ్చేసారు ఒకేసారి. సైన్యం చూస్తే బలహీనంగా వుంది. పిడుగుల్లా పడుతున్నాయి మిస్సైల్ లు. ఎదురు కాల్పుల్లో సైనికులు మట్టి కరుస్తున్నారు. నా దేశాన్ని కాపాడే బాధ్యత నాదే.

                  ఈరోజు ఇక్కడ జరిగే ఈ పోరాటం నా దేశాన్ని, నా కుటుంబాన్ని కాపాడుతుంది. ప్రాణాలు లెక్క కాదు, దేశం బ్రతకడం నాకు ముఖ్యం.

                  భుజానికి బులెట్ తగిలింది. రక్తం ఆగట్లేదు, పరిగెడుతుంది. కానీ నా పరుగు ఆగలేదు. శత్రువు తప్ప నాకు ఇంకా వేరే ఎవరు కనిపించట్లేదు. నా సోదరులు మరణిస్తున్నారు. ఆవేశం ఆకాశం అంత ఎత్తుకు ఎగిరింది. కానీ ఆలోచన తప్పనిసరి. ప్రాణం విడిచే ముందు, శత్రువుని చంపాలి.

                  మొదటి రోజు యుద్ధం ముగిసేసరికి సైన్యం చాలా బలహీనపడింది. సరైన వైద్య సదుపాయం కూడా లేదు. శత్రువు ఏ రాత్రి ఎప్పుడు దాడి చేస్తాడని మాలో కొంత మంది నిద్ర మానుకుని కాపలా కాస్తున్నారు. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

                  అందరికి ఇల్లు, వాళ్ళ కుటుంబం గుర్తుకు వస్తుంది. మాలో చాలా మందికి ఇంకా పెళ్లి కాలేదు. సైనికుడికి పిల్లనిచ్చే వాళ్ళు ఎంత మంది.

 

                  పెళ్లై పిల్లలు ఉన్నవారు, మరో కొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్న వారు. చెల్లెలు పెళ్లి చూడాలని కొందరు, అమ్మ ఆఖరి రోజులు లెక్కపెడుతోంది, దగ్గర ఉండాలి అని ఇంకొందరు. ఇలా ప్రతి ఒక్కరు కుటుంబ సమస్యలు, కుటుంబం పట్ల తమ ప్రేమని గుర్తు చేసుకున్నాం.

                 కాలల్లో బుల్లెట్ దిగి నడవలేని పరిస్థితి ఒకడిది. వద్దన్నా యుద్ధం చేస్తా అన్న తన మొండిపట్టుదల మాలో స్పూర్తి నింపింది. బాధని దిగమింగామ్. మళ్ళీ మా గడ్డ పైన యుద్దానికి దిగాలి అంటే మా పోరాటం గుర్తుకు రావాలి అనుకున్నాం. పిడికిలి బిగించి, " భారత్ మాత కి జై" అనుకుని తొడకొట్టి మీసం మెలేసాడు ప్రతి ఒక్క సైనికుడు.

                 అందరం తమ తమ ఇళ్లకు లేఖలు రాయడం మొదలుపెట్టాం. మేము వున్నా లేకున్నా ఈ దేశం ఉంటుంది. గర్వంగా చెప్పండి-- 'ఈ దేశం కోసం నా కొడుకు, నా అన్న, మా బాబాయ్, మా మావయ్య ప్రాణ త్యాగం చేసారని".

                  ఆలస్యం చెయ్యకుండా రాసిన లేఖలు అన్ని మాలో ఒకడికి ఇచ్చి పంపించాము, మా చిరునామా కి పోస్ట్ చెయ్యమని.

                 రెండో రోజు యుద్ధం. ప్రణాళిక తో కూడిన యుద్ధ ప్రక్రియ ప్రారంభించాం. శత్రువుని చంపడానికి కావాల్సిన ఆయుధాలు తక్కువగా ఉన్నాయి. సైనికులు చాలా వరకు మరణించారు. కానీ ఒకటే మార్గం, ఉన్న ఆయుధాలు తో శత్రువుని చంపాలి.

                ఒంటినిండా బాంబులు చుట్టుకుని ఏభై మంది సైనికులు అటువైపు చేరుకోగలిగితే శత్రు సైన్యం మొత్తం నామ రూపం లేకుండా పోతుంది.

  

               మేమంటే మేము సిద్ధం అనుకుంటూ అందరూ ముందుకొచ్చారు. చావు మాకు ఓ వరం. దేశం కోసం ప్రాణాలు విడిచే అవకాశం వచ్చినందుకు అందరం సంతోషించాం.

                కొందరు సైనికులని ముందుకు పంపించాము. మమ్మల్ని కాపాడుతూ శత్రువుని ఎదుర్కొంటూ పోతే మేము అటువైపు చేరుకోగలము. కొందరి సైనికులని బోర్డర్ లొనే ఉంచాం. ఈ వ్యూహం విఫలిస్తే, ఇక్కడ కొంత మందైనా ఉండాలి అని.

                "నాకు తెలుసు ఇదే ఆఖరిరోజు. కొన్నే ఆశలు మిగిలిపోయాయి. నేను చనిపోయినా జరుగుతాయి, కానీ అవేమి నేను చూడలేను. నా వల్ల జరిగాయన్న సంతృప్తి తప్ప. అమ్మ నీ బిడ్డ ఇక తిరిగి రాడు, దేశం కోసం ప్రాణం విడిచేస్తున్నా. మళ్ళీ జన్మంటూ వుంటే నీకె జన్మించి సైనికుడే అవసరం లేని దేశం చూడాలని ఉంది".

                అందరం "మేరా భారత్ మహాన్" అనుకుని బటన్ నొక్కేసామ్ ఒకేసారి. ఆ మంటలో మాతో పాటు కొన్ని వేల మంది శత్రువులు చనిపోయారు. ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు కూడా మిగలలేదు. మా ప్రాణత్యాగం మా దేశానికి పునఃజన్మ ని ఇచ్చింది.

                  నాది అనుకుంటే ఒక్క అడుగు కూడా వదలని దేశం నాది. అలాంటిది నా దేశం లో అడుగు పెడితే తల మొండెం వేరు కావాలి అంతే.

  

                 మా లేఖలు మా ఇంటికి చేరాయి. అందులో కన్నీరు పెట్టుకున్న అమ్మ వుంది, బాధ పడిన నాన్న వున్నాడు, ఏమి అర్ధం కాని చిన్న పిల్లాడు వున్నాడు, శోక సంద్రం లో కొత్తగా పెళ్లైన ఒకరి భార్య కూడా వుంది.

                 కానీ వీర మరణం పొందిన మా ఇళ్ళలోంచి ప్రతి ఏడాదికో, పదేళ్లకో ఒక సైనికుడు తయారవుతూనే ఉంటాడు. కుటుంబానికి దూరంగా దేశానికి దగ్గరగా అలవాటు చేసుకుంటాడు.

                నీ ఇంటికి నువ్వే సైనికుడివి. "నీ ఇంటిని నువ్వు కాపాడు, నీ దేశాన్ని నేను కాపాడతా". "జై జవాన్, జై హింద్".

           

                 ఈ కథ ప్రతి సైనికుడి ది. వీర మరణం పొందిన ప్రతి సైనికుడి మాటలివి. యుద్ధం లో గెలిచే ఆనందాన్ని కూడా మనకే పంచే నిస్వార్థ మనసున్న మన సైనికులకు జోహార్లు. 🙏🙏

  

         


Rate this content
Log in

Similar telugu story from Action