జిన్ ప్రపంచం _ 5
జిన్ ప్రపంచం _ 5
ఫరీద్ జెహర్ ఒక్కటిగా మారి జిన్ ప్రపంచానికి వస్తారు. కింగ్ గా మారిన బ్లాక్ జిన్ జెహర్ ను తన పర్సనల్ సర్వంట్ గా మారుస్తాడు.
జెహర్ ఆవేశపడి బ్లాక్ జిన్ ను ఇప్పుడే అంతం చేస్తాను అని అతని ఖడ్గాన్ని తీస్తాడు.
ఫరీద్ ఆగు జెహర్ కింగ్ ఖడ్గానికి ఉన్న శక్తులతో పోల్చుకుంటే నీ ఖడ్గం నీ తలనే నరుకుతుంది. నీకు నువ్వు బలి అవ్వాలని సరదాగా ఉందా అంటాడు.
కానీ ఇప్పుడు మనమిద్దరం కలిశాం వాడికన్నా శక్తీవంతులమే కదా అంటాడు జెహర్.
మనం ఎంతైనా పోరాటం చేసి గెలవగలం ఎవరినైనా బంధించగలం, కానీ ఒక్క కింగ్ ని తప్ప.. కింగ్ ని బంధించడం గాడ్ జిన్ వల్ల తప్ప ఎవ్వరికీ సాధ్యపడదు లేదా బ్లాక్ జిన్ ని కింగ్ పదవి నుంచి తప్పించి మనం బంధించగలం అంటాడు ఫరీద్.
జెహర్ కోపంతో ఏమీ చెయ్యలేక బ్లాక్ జిన్ కు సర్వంట్గా మారుతాడు. బ్లాక్ జిన్ కూడా కింగ్ బాధ్యతలు తీసుకున్నాక గాడ్ జిన్ నుండి కొన్ని శక్తులు పొందుతాడు. బ్లాక్ జిన్ చేతిలో ఓటమిని చవిచూశాను అని జెహర్ రగిలిపోతాడు.
అలాగే జెహర్ని ఓడించినందుకు బ్లాక్ జిన్ సంతోషపడుతాడు.
కొన్ని రోజుల తరువాత ఫరీద్ శక్తులన్నీ జెహర్లో కలసిపోతాయి. ఫరీద్ మాత్రం జెహర్ ఆత్మని బంధించి జెహర్ శరీరాన్ని తన సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. డబల్ మైండ్స్ జెహర్ లో ఉండటం వల్ల ఫరీద్ అండ్ జెహర్ ఆలోచనలు ఒకరివి ఒకరికి తెలిసిపోతాయి.
జెహర్ ఆలస్యం చెయ్యకుండా గాడ్ జుబైర్ వద్దకు వెళ్లి నిజం ఒప్పుకుంటాడు. ఫరీద్ తన శరీరంలో వున్నాడని గాడ్ ని అంతం చేసి అతనే జిన్ గాడ్ కావాలని అనుకుంటున్నాడు అని.
గాడ్ జుబైర్ ఫరీద్ ని బంధించి అతని ఆత్మని సమూలంగా అంతం చేయదలచి అన్రికవరబుల్ లాంప్ లో పెట్టి తన మాయా శక్తితో బంధిస్తాడు.
ఇక జెహర్ గాడ్ జుబైర్ తో ఇలా అంటాడు.
గాడ్ జిన్ నేను ఫరీద్ లా కాదు మీకు విధేయుడనై ఉంటాను. నేను ఎప్పటికి గాడ్ కావాలని కోరను. మీ గాడ్ పదవికి ఎప్పటికి ఎవ్వరూ పోటీ రాకుండా నేను మీకు సంరక్షకుడిగా వుంటాను అని గాడ్ జిన్ కు మాట ఇస్తాడు.
ఇప్పుడు చెప్పు జెహర్ నువ్వు ఏం ఆశించి నాకు సంరక్షకుడిగా మారాలి అనుకుంటున్నావు.
కింగ్ పదవి కోసం.. ఎందుకంటే, గాడ్ నాకు ఊరికే ఏదీ ఇవ్వరు కదా అందుకే ఫరీద్ తో కలిసినట్టు నటించి మీ వద్దకు తీసుకొచ్చాను.
నేను నిన్ను మంచి జిన్ ప్రపంచానికి రాజుగా చేయగలను అంటాడు గాడ్. అక్కడ రాజుగా ఉంటే నీకు ఇంతకన్నా ఎక్కువ శక్తులే వస్తాయి అంటాడు గాడ్ .
మంచి ప్రపంచానికి నేను కింగ్ గా ఉండి సాధించేదేం లేదు నేను చెడు మరియు మంచి జిన్ ప్రపంచాలకి ఏకైక కింగ్ అవ్వాలని అనుకుంటున్నాను.
నువ్వు నాకు, గాడ్ కావాలని కోరుకునే ఫరీద్ గురించి తెలియజేసినందుకు బ్లాక్ జిన్ కు చెప్పి మంచి ప్రపంచానికి నిన్ను కింగ్ ని చేస్తాను. నా టెస్ట్ లలో విజయం సాధించి బ్లాక్ జిన్ రెండు ప్రపంచాలకి ఏకైక కింగ్ పదవిని గెలుచుకున్నాడు, కనుక నేను బ్లాక్ జిన్ ను సంప్రదించి నీకోసం మంచి ప్రపంచం వేరు పరచి నిన్ను కింగ్ గా నియమించగలను.
గాడ్ జిన్ నాకు కింగ్ పదవి అవసరం లేదు నేను కోరబోయేది చెయ్యండి చాలు అని వెంటనే బ్లాక్ జిన్ ని పిలిపించి అతనిని దీపంలో బంధించండి అని కోరుతాడు జెహర్ అతని వికృత బుద్ధితో .
ఒక కింగ్ ని నేను అలా అకారణంగా బంధించలేను అంటాడు గాడ్.
నేను మీతో ఒప్పందానికి సిద్ధంగా వున్నాను ఏదైనా సరే అంటాడు.
సరే ఒప్పందం ఏమిటంటే నీకు కలగబోయే వారసులను గాడ్ జిన్ కు బలిదానం ఇవ్వాలి గాడ్ కోరినప్పుడు అంటాడు.
ఈ ఒప్పందానికి నేను సమ్మతిస్తున్నాను గాడ్ జిన్ అంటాడు జెహర్.
వేంటనే బ్లాక్ జిన్ ని పిలిపించి దీపం లో బంధించేస్తాడు గాడ్ జుబైర్, జెహర్ కళ్ళముందే.
బ్లాక్ జిన్ చివరిగా దీపంలోకి వెళ్లే ముందు అన్నమాటలు "నేను ఏ రోజైతే విడుదలవుతానో ఆరోజే నీ అంతం జెహర్."
ఇప్పుడు ఏ పోటీ లేని కారణంగా జెహర్ మంచి మరియు చెడు జిన్ ప్రపంచాలకు ఏకైక కింగ్ అయ్యాడు.
చెడు జిన్ ప్రపంచంలోని వారిని బాగా చూసుకుంటూ , మంచి జిన్ ప్రపంచంలోని జిన్ లని చిత్రహింసలు పెట్టేవాడు కింగ్ జెహర్.
ఇప్పుడు బ్లాక్ జిన్ కనుక విడుదలైతే నా కింగ్ పదవికి ముప్పే అని గతంలోంచి బయటికి వస్తాడు జెహర్.
అదేంటి దివాస్ వరల్డ్ ఇంకా రాలేదు అనుకుంటున్నారా??
వచ్చేస్తుంది త్వరలో అది చెప్పటానికే నా ఈ తంటాలు....
దివా సర్వంట్ జిన్ కు చెప్పి చాటర్ బాక్స్ జిన్ తో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ట్విన్ ఏంజెల్స్ కూడా దివాతో పాటుగా మీటింగ్ కు అటెండ్ అవుతారు.
చాటర్ బాక్స్ జిన్ అంటాడు చెప్పండి అమీరా..! నేను ఏం సహాయం చెయ్యాలి..
నాకు మనుషులు అంటే.......
క్షమించండి అమీరా...! మధ్యలో మిమ్మల్ని ఇంట్రప్ట్ చేస్తున్నాను కానీ అది చాలా ముఖ్యమైన విషయం నేను ఏదైనా అనుకుంటే అది చెప్పేవరకు మీరు చెప్పేది నేను వినలేను . అదేంటంటే మీరు చాలా అందంగా వున్నారు. చాలా అంటే చాలా చాలా అందంగా. ఇప్పుడు అడగండి ఏదో అడుగుతున్నారు?
అది మనుషు......
అది అమీరా...! మళ్ళీ క్షమించండి అమీరా...! మీ అందం ఎంతందం అంటే మంచి జిన్ లోకపు మహారాణి మాలిక సనా...! మాకు గుర్తొస్తున్నారు...క్షమించండి ఇంట్రప్ట్ చేసినందుకు ఇప్పుడడగండి ఏదో అడుగుతున్నారు??
అది మ...
మళ్ళీ క్షమించండి అమీరా.. ! ఇంట్రప్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే మీరు చెడ్డ జిన్ లోకపు బట్టలు వేసుకుంటేనే ఇంత అందంగా వున్నారంటే ఇంకా సనాస్ వరల్డ్ లోని వైట్ కలర్ క్లోత్స్ వేసుకుంటే ఎంత అందంగా ఉంటారా అని ఆలోచిస్తున్నాను.
ఐతే తక్షణమే నాకు ఆ వైట్ క్లోత్స్ ఎలా ఉంటాయో చూపించండి చాటర్ బాక్స్ జిన్
అవునవును ఆ క్లోత్స్ ఎలా ఉంటాయో మా అమీరా.. దివా..! కోసం చూపించండి అని ట్విన్స్ అనియ అనిస కూడా ఒకేసారి అంటారు.
కొనసాగుతుంది..
