STORYMIRROR

vishnu priya chiruvella

Fantasy Thriller

4  

vishnu priya chiruvella

Fantasy Thriller

జిన్ ప్రపంచం _3

జిన్ ప్రపంచం _3

3 mins
258

లాంప్ తో సహా ఎగిరి రహస్య మాయ మందిరం నుంచి గాడ్ జిన్ కాళ్ళ ముందు పడుతుంది దివా

రెండు ట్విన్ ఏంజెల్స్ అయిన అనియ అనిస కూడా దివా తల చుట్టూ తిరుగుతాయి అమీరా..! అమీరా..!అంటూ..


తల పైకిత్తి చూస్తే దివానే కోపంగా చూస్తున్న గాడ్ జుబైర్.


"నేను నీకు ముందే చెప్పాను. కేవలం ఒకేఒక్క దీపాన్ని మాత్రమే ముట్టుకోమని ఎంత ధైర్యముంటే నా ఆజ్ఞ నే అతిక్రమిస్తావు " అని దివా చేతిలోని లాంప్ని విసిరి పడేస్తాడు.


గాడ్ జిన్ నాకు ఇంకో మార్గంలేదు నా తల్లిని ఆ లాంప్ నుండి విముక్తి కలిపించడానికి నాకు ఇంతకన్నా మార్గం దొరకలేదు. ఐనా లక్షమందికి పైగా ఆత్మలు లోపల దీపాలలో బంధించబడ్డాయి వాటికి విముక్తి చెయ్యటం గాడ్ జిన్ గా మీ భాద్యత.


ప్రతీ కింగ్ జిన్ తన శక్తుల కోసం ఆత్మల్ని జిన్లుగా మారుస్తారు అది జిన్ లోకపు ధర్మం, దానిని తప్పుగా నేను పరిగణించను. ఎందుకంటే గాడ్ జిన్ కు తప్పు ఒప్పు అనే తారతమ్యం లేదు. నువ్వు కేవలం ఈలోకపు యువరాణి కావడం వల్ల నేను నిన్ను శిక్షించకుండా వదిలి పెడుతున్నాను అని గాడ్ జిన్ మాయమవుతాడు.


అమ్మని ఎలా విడిపించుకోవాలి గాడ్ జిన్ కూడా నాకు సహాయం చెయ్యలేదు, కానీ నన్ను మాత్రం జిన్ గా ఉండాలి ఈ లోకంలో అన్నారు నాన్నగారిలా నేను క్రూరంగా ఐతే మారలేను అని దివా ఆలోచిస్తుంది.


ఏంజెల్స్ అనియ అనిస

అమీరా.. అమీరా..!!


ఏంటి మీ గోల నాకు


మీకు మనుషులేవరో తెలుసుకోవాలి అని ఉంది కదా.!

ఇందాక మాటల్లో అన్నారు.


హా ఏంజెల్స్ కానీ మనకి ఎవరు చెప్తారు మనుషుల గురించి?


ఎవరు చెప్తారు అని తెలియదు అమీరా..! కానీ మనకి సహాయం చెయ్యడానికి మీ సర్వంట్ జిన్ చాలు


సర్వంట్ జిన్లా కానీ ఎలా ?


సర్వంట్ జిన్ కి చాటర్ బాక్స్ జిన్ తో పరిచయం ఉంది చాటర్ బాక్స్ జిన్  మన ప్రపంచం, భూప్రపంచం అన్నీ లోకాలు తిరిగి వచ్చాడు కాబట్టి మనకి చాలా కబుర్లు చెప్తాడు.


సరే ఏంజెల్స్..! ముందు చాటర్ బాక్స్ జిన్తో మన మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం.



కింగ్ జెహర్ తన రహస్య మందిరం వైపు గాడ్ జుబైర్ మరియు దివా లు వచ్చారని సెక్యూరిటీ జిన్ సందేశం ద్వారా తెలుసుకుని రహస్య మాయా మందిరానికి వస్తాడు.


లోపలికి వెళ్ళగానే ట్విన్ ఏంజెల్స్ ని బంధించిన ఎంప్టీ లాంప్ కనిపించగానే జెహర్ కోపం పీక్స్ కి పోయింది దివా మీద .

ట్విన్ ఏంజెల్స్ ఉన్నా పోయిన పెద్ద లాభం ఏం లేదు అనుకున్నాడు. మాయా మందిరం లోని దీపాలన్నీ గమనించి ఒక దీపం మిస్ ఆయింది అని గమనించాడు .


అది ఏ దీపమో కనిపెట్టడానికి ఒక లాంప్ని ఓపెన్ చేసి అందులో ఉన్న అతని మెమరీ జిన్ ని అడుగుతాడు ఏ జిన్ ఉన్న లాంప్ మిస్ అయిందో చెప్పమని



జెహర్ ఏ లాంప్ లో ఏ జిన్ ఆత్మ ఉందో గుర్తుంచుకోవటానికి మెమరీ జిన్ ని క్రియేట్ చేసి దీపంలో బంధించాడు. మెమరీ జిన్ ఇలా అంటుంది.

కింగ్ జెహర్ మన మోస్ట్ డిస్ట్ట్రక్టివ్ బ్లాక్ జిన్ ఉన్న దీపం మిస్ అయింది.



ఒక్కసారిగా ఆ మాట వినగానే కింగ్ జెహర్ కి తన రాజు పదవి ఎక్కడ తననుంచి దూరం అవుతుందో అన్న ఆలోచన వచ్చింది. ముందు యువరాణి దివా దగ్గరున్న లాంప్ని వెంటనే తీసుకురండి అని ఆదేశిస్తాడు సెక్యూరిటీ జిన్ లకు.


సెక్యూరిటీ జిన్ యువరాణి దివా మందిరానికి వెళ్లి మిస్ అయిన లాంప్ గురించి అడుగుతాడు.


దివా ఆ దీపం గాడ్ జిన్ విసిరేశారు ఏ లొకేషన్లో పడిందో నాకు తెలియదు అని అంటుంది.


సెక్యూరిటీ జిన్ కింగ్ జెహర్ దగ్గరకు వెళ్లి యువరాణి వద్ద ఉన్న దీపాన్ని  గాడ్ జుబైర్ విసిరేశారు లొకేషన్ ఐతే తెలియదు అని యువరాణి చెప్పారు అని చెప్పాడు.


ఆ డిస్ట్ట్రక్టివ్ బ్లాక్ జిన్ దీపంలోంచి బయటికి రాకముందే ఎలాఐనా ఆ దీపాన్ని కనిపెట్టాలి అని జిన్ ప్రపంచంలోని జిన్ లందరికి మిస్ అయిన దీపం వెతికి తీసుకురమ్మని ఆ దీపం దొరకకపోతే అందరిని ఆత్మలుగా మార్చి దీపాల్లో బంధించేస్తాను అని ఆజ్ఞాపిస్తాడు కింగ్ జెహర్.


చెడు ప్రపంచంలోని జిన్ లందరూ దీపం కోసం వెతుకులాట మొదలుపెట్టారు.


ఒకవేళ డిస్ట్ట్రక్టివ్ జిన్ కనుక పొరపాటున దీపంలోంచి బయటికి వస్తే, అని ఆలోచించి ముందు జాగ్రత్తగా తన శక్తులని డిస్ట్ట్రక్టివ్ జిన్ కన్నా ఎక్కువగా పెంచుకోవాలి అందుకోసం మరొక బలి దానం గాడ్ జిన్ కు చెయ్యక తప్పదు అనుకుంటాడు కింగ్ జెహర్ .


కింగ్ జెహర్ ఇట్స్ టైమ్ టు లీవ్ అంటుంది మెమరీ జిన్.


మెమరీ జిన్ ని మళ్ళీ దీపంలో బంధించి డిస్ట్ట్రక్టివ్ బ్లాక్ జిన్ గురించి ఆలోచనలో పడతాడు.



గతంలో జెహర్ కు కింగ్ పదవి దక్కక ముందు..

బ్లాక్ జిన్ ఎవరో కాదు జెహర్ కు సోదరుడు.


ఇద్దరూ సరిసమానమైన క్రూరత్వం కలిగివుండటంవల్ల ఇద్దరిలో కింగ్ గా ఎవ్వరిని చెయ్యాలి అని గాడ్ జుబైర్ ఆలోచనలో పడ్డాడు.


డిస్ట్ట్రక్టివ్ బ్లాక్ జిన్ మరియు జెహర్, ఇద్దరూ జిన్ కింగ్ పదవి కోసం పోటీ పడేవారు.


జిన్ గాడ్ జుబైర్ దగ్గరకు వెళ్లి ఎవరు ముందు కోరుకుంటారో వారే కాబోయే జిన్ కింగ్.


ఇద్దరూ కూడా ఒకే సమయంలో గాడ్ జుబైర్ ను చేరుకోవడం వల్ల గాడ్, కింగ్ అవ్వడానికి ఇద్దరికీ టెస్ట్ పెడుతాడు. ఇద్దరూ ఎంతమంది మనుషులని గాడ్ జిన్ కు బలిదానం ఇచ్చి బంగారు దీపాల్లో ఆత్మలను బంధించి, ఎవరైతే ఎక్కువ శక్తులని పొందుతారో వారే చెడు జిన్ ప్రపంచానికి కాబోయే కింగ్ జిన్ అవుతాడని తీర్పునిచ్చాడు.


అలా ఇద్దరూ పోటీపడి గాడ్కి ఎన్నో బలిదానాలు సరిసమంగా చేసి దీపాలలో బంధించారు ఆత్మలని .


గాడ్ జిన్ మళ్ళీ సమానంగా జెహర్ జిన్ అండ్ బ్లాక్ జిన్ ఉండటం వల్ల ఇంకో టెస్ట్ డిసైడ్ చేశారు.

మంచి జిన్ ప్రపంచం మాలిక్, మాలిక (మహారాజు మహారాణి )లని దీపాలలో బంధించి మీ ఇద్దరిలో ఎవరైతే తీసుకొస్తారో వారే ఈ చెడు మరియు మంచి జిన్ ప్రపంచలకు కాబోయే ఏకైక కింగ్ అని గాడ్ జుబైర్ డిసైడ్ చేశారు.



ఇప్పుడు జెహర్ మరియు బ్లాక్ జిన్ ల లక్ష్యం ఒక్కటే మంచి జిన్ ప్రపంచపు మాలిక్ కబీర్,  మాలిక సనాల ఆత్మల్ని దీపాల్లో బంధించటం, రెండు జిన్ ప్రపంచాలని ఏకం చేసి మొత్తాన్ని చెడు జిన్ ప్రపంచంగా మార్చటం. ఆ ప్రపంచానికి ఏకైక కింగ్ అవ్వటం.





కొనసాగుతుంది..



Rate this content
Log in

Similar telugu story from Fantasy