STORYMIRROR

vishnu priya chiruvella

Fantasy Thriller

4  

vishnu priya chiruvella

Fantasy Thriller

జిన్ ప్రపంచం _ 4

జిన్ ప్రపంచం _ 4

3 mins
270

ఇప్పుడు జెహర్ మరియు బ్లాక్ జిన్ ల లక్ష్యం ఒక్కటే మంచి జిన్ ప్రపంచపు మాలిక్ కబీర్,  మాలిక సనాల ఆత్మల్ని దీపాల్లో బంధించటం, రెండు జిన్ ప్రపంచాలని ఏకం చేసి మొత్తాన్ని చెడు జిన్ ప్రపంచంగా మార్చటం. ఆ ప్రపంచానికి ఏకైక కింగ్ అవ్వటం.


ఇప్పుడు మంచి జిన్ ప్రపంచంలో ఎప్పుడు రాణి పేరు మీదే లోకం పేరు డిసైడ్ చేయబడుతుంది


మంచి జిన్ ప్రపంచం పేరు సనాస్ వరల్డ్ :

కబీర్ మంచి జిన్ లోకపు మహారాజు.. మాలిక్ కబీర్

సనా మంచి జిన్ లోకపు మహారాణి.. మాలిక సనా


మంచి జిన్ లోకంలో ఎలాంటి పోటీ తత్త్వం ఉండదు. మహారాణి సనా, మహా రాజు కబీర్ ఆ ప్రపంచంలోని ప్రజలకి మాలిక్ , మాలిక ఐనా కూడా మిగిన జిన్ లతో కలిసి మెలసి వారి కష్టాలు తెలుసుకుని  వారికి ఏ లోటు రాకుండా చూసుకునేవారు.


చెడు జిన్ లోకంలో ఆత్మలను దీపాలలో బంధీచేసి అవసరమైనప్పుడు విడిపించి వారిలో కలుపుకుని శక్తులను పెంచుకుంటారు.


మంచి జిన్ లోకంలో చెడు జిన్లు బంధించిన దీపాలను సంపాదించి దీపాలలోని మంచి ఆత్మలకి విముక్తి కలిగించి, చెడు ఆత్మలని ఎప్పటికి విడుదల కాకుండా అజ్ఞాత స్థావరంలో పాతి పెడుతారు. కేవలం మంచి జిన్లకు మాత్రమే భూమి మీదకు వెళ్ళగలిగే శక్తి ఉంటుంది.


మాలిక్ కబీర్ మరియు మాలిక సనా వారికోసం అందమైన ట్విన్స్ కావాలని గాడ్ జిన్ జుబైర్ నీ కోరుకుంటారు. అంతే కాక వారు తమలా జిన్లు కాకుండా ఏంజెల్స్ అవ్వాలని గాడ్ దగ్గర వరాన్ని పొందుతారు.

అనుకున్నట్టే ట్విన్ ఏంజెల్స్ కు సనా జన్మనిస్తుంది..


ఇదే సరైన సమయం అనుకున్నారు బ్లాక్ జిన్ మరియు జెహర్ ఇద్దరూ మంచి జిన్ ప్రపంచానికి వెళతారు కబీర్, సనాలను దీపాల్లో బంధించడానికి.


జెహర్ ముందు ఫిమేల్ జిన్ ని బంధించేద్దాం అని అంటే సనాని బంధించటానికి వెళ్తాడు.


బ్లాక్ జిన్ మనం ముందు కబీర్ సనా లని బంధించటం కష్టం మంచి జిన్లు ఎలాగో బంధాలకి విలువనిస్తారు కాబట్టి వారికి పుట్టిన ట్విన్ ఏంజెల్స్ ని దీపాలలో బంధించాలి, తరువాత ఎలాగో వారి మీద ప్రేమతో నాకు బంధీలుగా కబీర్ సనా మారుతారు అనుకుంటాడు.


అనుకున్నట్టే బ్లాక్ జిన్ ఎవరూ చూడకుండా మంచి జిన్ వేషంలో  మంచి జిన్ ప్రపంచంలోకి ప్రవేశించి, ఒంటరిగా దొరికిన ట్విన్ ఏంజెల్స్ని బందీగా చేసి వారి ఆత్మలని దీపాల్లో బంధిస్తాడు. (అవే ట్విన్ ఏంజెల్స్ )


జెహర్ మాత్రం మాలిక(సనా)ని ఓడించలేక తానే దీపంలో బంధీగా మారుతాడు.


బ్లాక్ జిన్ మాత్రం అనుకున్నట్టు ట్విన్స్ ని బంధించేశాక మొదటిగా గమనించిన కబీర్ కావాలంటే నన్ను బందీగా చేయి నా అమీరా(ట్విన్ ప్రిన్సెస్) లను ఏం చేయకు అని తనకు తానే బంధీగా మారుతాడు.


నువ్వు నాకు బంధీగా మారితే నీ మాలిక్ కబీర్ ను నీ ట్విన్ ఏంజెల్స్ ను ఈ దీపం నుండి శాశ్వత విముక్తి కలిగిస్తాను అని బూటకమైన మాట ఇచ్చి సనాని కూడా దీపంలో బంధిస్తాడు బ్లాక్ జిన్.


ఇక ఈ చీకటి ప్రపంచానికి కాబోయే కింగ్ జిన్ నేనే అని ఆనందంగా బ్లాక్ జిన్ సనా మరియు కబీర్ లను బందించిన దీపాలతో గాడ్ జిన్ జుబైర్ వద్దకు పయనమయ్యాడు.


మంచి జిన్ ప్రపంచంలోనే జెహర్ ని బంధించిన దీపం పడి ఉంటుంది.


ఫరీద్ జిన్ లలో అతి భయంకరమైనవాడు, ఒకప్పటి జిన్ కింగ్ అతను జిన్ గాడ్ జుబైర్ ఆదేశాలను అతిక్రమించి జిన్ ప్రపంచం నుంచి బహిష్కరించబడ్డాడు. అతను కింగ్ గా వుంటూ జిన్ గాడ్ ని అంతం చేసి గాడ్ అవ్వాలనుకున్నాడు. ఆ కుట్రని తెలుసుకున్న గాడ్ జుబైర్ అతన్ని జిన్ ప్రపంచం నుంచి బహిష్కరించాడు. ఆ తరువాత కింగ్ అవ్వడానికి బ్లాక్ జిన్ అండ్ జెహర్ పోటీ పడ్డారు.


ఫరీద్ ఇప్పుడు మనుషులున్న భూలోకంలోని ఖబరస్థాన్లో ఉంటున్నాడు.


ఫరీద్ ఒక ఘుల్ జిన్ అంటే అతను ఏ రూపంలోకైనా మారగలడు. అతను ఇదే అవకాశంగా తీసుకుని అతని రూపాన్ని మార్చుకుని గాడ్ జిన్ కు తెలియకుండా జిన్ ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు.


సనాస్ వరల్డ్ లో జెహర్ ని బంధించిన దీపంలోంచి జెహర్ ను విడుదల చేస్తాడు ఫరీద్. బయటికి వచ్చిన జెహర్ కోపంతో ఉంటాడు.


కోపంకాదు జెహర్ మనం అనుకున్నది సాధించాటానికి యుక్తి అవసరం. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను నేను కింగ్ అవ్వడానికి సహాయం చేస్తాను అంటాడు ఫరీద్.


నేను కింగ్ అవ్వడానికి ఏమైనా చేస్తాను అంటాడు జెహర్.


ఐతే నా ఆత్మని నీలో కలుపుకో బ్లాక్ జిన్ ని ఎదుర్కొనే శక్తి నీకు లేదు. నాకు చాలా శక్తులున్నా గాడ్ జిన్ జుబైర్ నన్ను బహిష్కరించాడు ఈ లోకం నుంచి. నేను రూపం మార్చి ఈలోకంలో ఉన్నా గాడ్ కి తెలిసిపోతుంది. నీలో ఉంటే నన్ను ఎవరూ గుర్తుపట్టరు అంటాడు ఫరీద్.


అలాగే అని ఫరీద్ ను తనలో కలుపుకుంటాడు జెహర్.


ఇప్పుడు జెహర్, బ్లాక్ జిన్ కన్నా మూడింతల శక్తివంతుడు.


ఇక్కడ బ్లాక్ జిన్, గాడ్ జిన్ కు అతను బంధించిన మాలిక్, మాలికల దీపాలని అప్పగించి  చెడు జిన్ ప్రపంచానికి అండ్ మంచి జిన్ ప్రపంచానికి ఏకైక కింగ్ గా నియమించబడ్డాడు.


జెహర్ తనకు కొంత సమయం ముందే వచ్చి సహాయం చేసి ఉంటే నాకే ఆ పదవి దక్కేది కదా అని ఫరీద్ తో అంటాడు కోపంగా.


జెహర్ ఆవేశపడకు ఇంకా సమయం వుంది నిన్ను నేను కింగ్ ని చేసి చూపిస్తాను.

( తరువాత నీలో కలిసిన నేను నిన్ను బంధించి నీ రూపంలోనే ఉండిపోతాను, తరువాత గాడ్ జుబైర్ ని అంతం చేసి గాడ్ గా మారుతాను.. నేను గాడ్ కావడానికి ఏదైనా చేస్తాను జెహర్ అని మనసులో అనుకుంటాడు ఫరీద్ )


కొనసాగుతుంది..



Rate this content
Log in

Similar telugu story from Fantasy