జిన్ ప్రపంచం_ 2
జిన్ ప్రపంచం_ 2
జెహర్ కూతురైన దివా ఎప్పటికి ఒక మిస్టీరియస్ క్యారెక్టర్గానే ఉంది జెహర్కి. తన అందమైన రూపం, అందమైన నవ్వు, దయ, జాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండడం,మంచి గుణాలు ,అలంకరణ అందం మీద శ్రద్ధ, ఇతరులను అర్థంచేసుకునే తత్వం, శుభ్రత లాంటి మనిషి గుణాలు జెహర్ కి అసలు నచ్చలేదు. ఆ కోపంతో దివాని కనీసం యువరాణిలా కాదుకదా కూతురిలా కూడా ఎప్పుడూ చూడలేదు. కనీసం రాజ మందిరం వైపు కూడా రానివ్వలేదు దివాని.
బేసిక్ గా జిన్ అంటేనే అదొక స్పిరిట్ అన్నీ బంధాలకు అతీతం ఖతిర్ అలానే ఉన్నాడు కానీ దివా మాత్రం అలా లేదు మనిషిలా పుట్టింది అనుకుంటాడు. చీకటి రాజ్యంలో పుట్టి వెలుగుని కోరుకునే దివా తీరుకి దివా మీద కోపం పెంచుకున్నాడు.
జెహర్ తన శక్తి కోసం బలి ఇచ్చి బంధించిన ఆత్మలన్నీ బంగారు దీపాలలో బంధించి అతని రహస్య మాయా మందిరంలో భద్రపరచాడు.భార్య నైనాది కూడా. ఆ మాయా మందిరానికి ఇద్దరు సెక్యూరిటీ జిన్ లని నియమిస్తాడు. సెక్యూరిటీ జిన్ లను దాటి ఎవ్వరూ ఆ రహస్య మందిరంలోనికి వెళ్ళలేరు.
దివా కళ్ళముందే తన తల్లి నైనాని బలి ఇవ్వటంవల్ల దివా తన తండ్రి జెహర్ మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది.
ఎలా అయిన తన తల్లి నైనా ఆత్మని విడుదల చేసి బతికించి జిన్ ప్రపంచంలో సజీవంగా ఉండేలా చెయ్యాలి అనుకుంటుంది అమ్మ ప్రేమకోసం .
దివా ఎన్నోసార్లు రహస్య మాయా మందిరంలోకి వెళ్ళటానికి ప్రయత్నించినా వెళ్లలేకపోయింది.
ఒకనాడు దివాకి వాళ్ళ అమ్మని దీపం నుంచి విడిపించటానికి ఒక ఆలోచన వచ్చింది. అదే గాడ్ జిన్ ని కోరుకోవడం
ఆలస్యం చెయ్యకుండా వెంటనే గాడ్ జిన్ జుబైర్ దగ్గరికి వెళ్లి " గాడ్ జిన్ నాకు నా తల్లి నైనాని దీపం నుంచి విడిపించటానికి మీ సహాయం కావాలి, నా తల్లిని రహస్య మాయా మందిరంలో దీపంలో ఉంచి కాపలాగా సెక్యూరిటీ జిన్ లని నియమించారు నా తండ్రి నాకు దారి చూపించండి" అని అడుగుతుంది.
నేను నీకు దారి చూపించాలంటే నువ్వు నాకోసం ఏదైనా త్యాగం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే, గాడ్ జిన్ ఏది ఊరికే చెయ్యడు.
చెప్పండి గాడ్ జిన్ మా అమ్మకోసం ఏదైనా చేస్తాను.
"నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోవల్సి ఉంటుంది యువరాణి"
అర్ధం కాలేదు గాడ్..!
నువ్వు ఒక మనిషివి నీ మనిషి అస్తిత్వాన్ని వదిలి నువ్వు ఒక జిన్గా ఉండిపోవాలి జిన్ ప్రపంచంలో .
నేను పుట్టినప్పటినుండి నన్ను జిన్ గానే కదా పెంచారు.. ఇప్పుడేంటి గాడ్ నన్ను మనిషి అంటున్నాడు అసలెవరు ఈ మనిషి? తెలుసుకోవాలి..! అని మనసులో అనుకుని "నేను ఈ ఒప్పందానికి సమ్మతిస్తున్నాను."అని గాడ్ జుబైర్కి ప్రమాణం చేస్తుంది.
గాడ్ జిన్ కి ఇచ్చిన మాట తప్పితే నువ్వు ఇంక ఎప్పటికీ డార్క్ తొర్న్ లాంప్ లో ఉండవలసిన ఉంటుంది.
లేదు గాడ్ నా మాటని నేను తప్పే పరిస్థితి రానివ్వను ఎప్పటికి జిన్ గానే ఈ జిన్ ప్రపంచంలోనే వుంటాను.
నేను ఇప్పుడే నిన్ను జెహర్ దీపాలు భద్రపరచిన రహస్యమందిరానికి తీసుకెళతాను.కానీ, నువ్వు నీకు కావాల్సిన నైనా ఉన్న ఒక్క దీపాన్ని మాత్రమే తీసుకోవాలి అక్కడినుంచి అంటాడు.
సరే గాడ్ అంటుంది.
గాడ్ జుబైర్, దివా ని కింగ్ జెహర్ దీపాలు భద్రపరచిన రహస్య మందిరానికి తీసుకెళతాడు.
నీకు కావలసిన ఒకేఒక్క దీపం తీసుకో మిగతావి నువ్వు తాకకూడదు.
లోపలికి వెళ్లి చూసిన దివా ఆశ్చర్యపోతుంది. ఇన్ని బంగారు దీపాలా, నాన్న గారు ఇంతమంది ఆత్మలు బంధించారా? ఇన్ని దీపాల్లో ఏ దీపంలో మా అమ్మ ఉందని వెతకాలి? అని కాసేపు అలోచించి.
జుబైర్ దగ్గరకు వెళ్లి "గాడ్ నాకు మీ సహాయం కావాలి మా అమ్మ ఉన్న దీపాన్ని ఇన్ని దీపాల్లో నేను ఎలా వెతకాలి అని అడుగుతుంది."
"యువరాణి దివా! నేను నీకు కేవలం ఈ రహస్య మందిరంలోకి ప్రవేశించడానికి మార్గం చూపుతాను అని మాత్రమే మాట ఇచ్చాను. మిగతాదంతా, నీ కష్టం నాకు సంబంధం లేని విషయం కానీ ఇక్కడ నువ్వు ఎంత సమయమైనా ఉండి నీకు కావలసిన ఒక్క దీపాన్ని మాత్రమే తీసుకోవాలి."
ఓకే గాడ్ అని రహస్య మందిరం లోకి వచ్చిన దివా దీపాలన్నీ చూస్తూ గాడ్ ఎలాగో బయట ఉన్నాడు అన్నీ ఓపెన్ చేసేద్దాం చాలా టైమ్ ఉందికదా అనుకుంటుంది ( చీట్ చెయ్యటం మాట తప్పడం మనిషి లక్షణం)
అని రాండంగా ఒక లాంప్ సెలెక్ట్ చేసి దాన్ని మూడు సార్లు చేతితో రుద్దగానే ట్విన్ ఏంజెల్స్ బయటికి వచ్చారు. వారిద్దరూ చిన్నపిల్లల్లా వైట్విం గౌన్స్గ్స్తో తో గాల్లో దివా చుట్టూ తిరుగుతూ
అమీరా దివా..!! చెప్పండి మేము ఎవరిని నుంచి ప్రొటెక్ట్ చెయ్యాలి?? అని ఒకేసారి అంటారు.
అసలెవరు మీరు?
మేము మీ ప్రొటెక్టింగ్ ఏంజెల్స్ అమీరా..!
అనియ, అనిస అని ఒకరి తరువాత ఒకరు ఇద్దరూ పేర్లు చెప్తారు. మీరు ఏంచెప్తే అదే చేస్తాం అమీరా!అంటారు.
ఏం అడిగినా చేస్తారా? అని మెరిసే కళ్ళతో అడుగుతుంది.
అవును. అమీరా దివా..! మీరు ఇంత అందంగా వున్నారు మీఅందానికి సెక్యూరిటీ జిన్ లేరా అని ట్విన్ ఏంజెల్స్ ఇద్దరూ అడుగుతారు.
అందం గురించి మాట్లాడగానే దివా వచ్చిన విషయం మరచిపోయింది. ట్విన్ ఏంజెల్స్ మాటకారులు కావటం వల్ల వాళ్ళు సమయం తెలియకుండా మాటల్లో మునిగిపోయారు.
చాలా సమయం తరువాత, మాటల్లోంచి బయటికి వచ్చిన దివా అసలు సంగతి మరిచిపోయాను అని తల కొట్టుకుని. అనియ అండ్ అనిస మీరిద్దరూ నాకొక సహాయం చెయ్యాలి.
చెప్పండి అమీరా దివా..! మేమున్నది అందుకే అంటారు ఒకేసారి ఇద్దరూ.
నా తల్లి నైనా ఏ లాంప్ లో ఉందో నాకు కనిపెట్టి చెప్పగలరా.?
లేదు అమీరా..! మీకేదైనా ప్రాబ్లమ్ వస్తే మేము ప్రొటెక్ట్ చేస్తాము అంతే తప్ప మేము వెతకటంలో సహాయం చేయలేము అంటారు ఒకేసారి.
ఇంకెందుకు మీరు నాకు అని అంటుంది దివా.
ప్రొటెక్ట్ చెయ్యటానికి అమీరా దివా అంటారు.
మాటిమాటికి అమీరా దివా.! అక్కర్లేదు.. జస్ట్ దివా.! చాలు ఏంజెల్స్.
నో మీరు మా అమీరా దివా నే..
సరే ఏడవండి. అని తను ఇంకో దీపాన్ని తీసుకుంటుంది అందులో ఆత్మగా ఏ జిన్ ఉందో చూద్దామని
ఎప్పుడైతే తన చేతిలోకి లాంప్ తీసుకుందో ఒక్కసారిగా ఎవరో లాగినట్టు రహస్య మందిరం లోంచి గాల్లో ఎగురుకుంటూ బయట పడింది దివా ఆ లాంప్తో సహా..
కొనసాగుతుంది..
