Dinakar Reddy

Abstract Comedy Drama

3  

Dinakar Reddy

Abstract Comedy Drama

జాబ్ అప్లయ్ చేశాను

జాబ్ అప్లయ్ చేశాను

1 min
259


ఆగండ్రా. ఇప్పుడు మన హిమజ గారు ఒక మంచి మోనోలాగ్ చేసి చూపిస్తారు అని కిరణ్ అనగానే అందరూ చప్పట్లు కొట్టారు.

లంచ్ బ్రేకుల్లో ఇలా సరదాగా ఉండడం ఆ ఆఫీసులో అందరికీ మామూలే.


హిమజ తనకిష్టమైన సినిమా సీన్ గుర్తు తెచ్చుకుంది. 


అయినా సరళా! నేనేమైనా డబ్బుల కోసం ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నారా! ఈ బీపీ గాడు వీడి వాలకం.


లిప్ స్టిక్ ఆమె పెదాలపైన మెరుస్తూ ఉంది. అచ్చు శ్రీదేవి వాళ్ళ బాస్ గురించి తిట్టుకున్నట్టే హిమజ కూడా గొణుగుతూ ఉంది.


అందరూ పగలబడి నవ్వుతూ హిమజ ఇమిటేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.


సరళా! నేను కిర్లోస్కర్ కంపెనీకి అప్లై చేసాను. అది రావాలీ. ఈ బీపీ గాడి దగ్గర జాబ్ వదిలేసి నేనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటూ వెనక్కి తిరిగింది.


అంతే. వెనకనే నిలుచుని వింటున్న బాస్ ని చూసి హిమజకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.


గుటకలు మింగుతూ అటూ ఇటూ చూసింది. అప్పటికే మిగిలిన స్టాఫ్ అంతా బాస్ కను సైగతో బయటికి వెళ్లిపోయారు.


మీట్ మీ ఇన్ మై క్యాబిన్ అంటూ మొహంలో ఏ భావం లేకుండా బాస్ వెళ్ళిపోయాడు.


అయిపోయింది. ఈ రోజుతో నా ఉద్యోగం ఢమాల్ అనుకుని భయంతో పట్టిన చెమటలు తుడుచుకుంటూ బాస్ వెనకే వెళ్ళింది హిమజ.


హిమజను కూర్చోమని చెప్పి ఆమె బాస్ ఏదైనా జోక్ చెప్పు అన్నాడు.


తన తండ్రి వయసు వ్యక్తి కాబట్టి బాబాయ్ గారూ అని పిలిచి కాకా పట్టాలని నిర్ణయించుకుంది హిమజ.


నీళ్ళు నములుతూ సార్. అదీ అంటూ సాగదీసింది.


హిమజా.. నేను కూడా శ్రీదేవి గారి అభిమానినే అమ్మా అని బాస్ అనగానే హిమజ కళ్ళు మతాబుల్లా వెలిగాయి.


థాంక్ యూ సార్ అంటూ హిమజ లేవబోయింది.


హిమజా.. శ్రీదేవి గారు లేడీ సూపర్ స్టార్ మాత్రమే కాదు. చుట్టూ వందల మంది ఉన్నా ఒంటరితనంతో బాధపడి పోరాడిన వ్యక్తి.


ఆమె జీవితం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని అన్నాడు.

హిమజకు ఆయన మాటలు అర్థం కాకపోయినా సరే సర్ అంటూ బయటికి వచ్చి హవా హవాయి అంటూ ఒక స్టెప్ వేసుకుంది మనసులో.



Rate this content
Log in

Similar telugu story from Abstract