ఇంటిపేరు
ఇంటిపేరు


రోజూ చూసే రూపమే.కానీ నీ రూపం కొత్తగా కనిపిస్తుంది.
నిన్ను ఒంటరిగా వదిలి ఉండబుద్ధి కాదు.నిన్ను సంతోషంగా ఉంచడం నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అనిపిస్తుంది.
రోహన్ ఏంటిది అని నువ్వు తిట్టినా కొట్టినా నీకు దగ్గరగా ఉండాలనిపిస్తుంది.
నిన్ను బాధపెట్టే ఏ లక్షణమూ నాలో ఉండకూడదు అనిపిస్తుంది.నా జీవితమంతా నిన్ను కష్టపెట్టకుండా చూసుకుంటే చాలనిపిస్తోంది.
నీకు నువ్వుగా వచ్చి నాకు ముద్దిచ్చినప్పుడు నేను నీతో ప్రేమలో ఉన్నానని నాకు అర్థమయ్యింది.
నీ ఇంటిపేరు మార్చాలనిపిస్తుంది.