ఈ నగరానికి ఏదో ఒకటి అవుతుంది..
ఈ నగరానికి ఏదో ఒకటి అవుతుంది..
నా వెర్షన్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ :
వివేక్ స్టీరింగ్ ని పట్టుకుని డిస్ట్రబ్ చేయడంతో కారు అదే దారిలో వస్తున్న మరో కారుని ఢీ కొడుతుంది.
ఆ ఢీ కొట్టిన కారులోంచి శిల్ప బయటికి వస్తుంది. వివేక్ తప్ప మిగతా వాళ్ళందరూ ఆమెను పలకరిస్తారు.
ఆనందంగా ఉన్న శిల్పను చూసి వివేక్ ఒక్క క్షణం గతంలోకి వెళ్ళిపోతాడు.
అరేయ్. మళ్లీ ఏమన్నా హారర్ సినిమా ప్లాన్ చేస్తున్నావా? అంటాడు.
వివేక్ సీరియస్ గా ముఖం పెట్టి సారీ అని శిల్పతో చెప్పి వెళ్లి కారులో కూర్చుంటాడు.
శిల్ప వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతుంది.
నాకు భయమైతుందిరా అంటాడు వివేక్.
ఏంట్రా ప్రతి దానికీ భయం అంటావు అని ఉప్పు అంటాడు.
నాకైతే వీడితో ట్రావెల్ చెయ్యాలంటే భయమేస్తోంది అంటాడు కౌశిక్.
అందరూ కలిసి షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేస్తారు. షిర్లీ వివేక్ ని డేట్ కి పిలుస్తుంది.
ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది భయమని చెప్పాడు. ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది అది కూడా భయమని అంటాడేమో ఈ సైకో గాడు అని కౌశిక్ గొణుగుతూ ఉంటాడు.
కార్తీక్ ఊరుకోండ్రా అని అంటాడు.
అసలు నా మాటల్లో చెప్పాలంటే అని ఉప్పు అంటుండగా వివేక్ థూ అని అంటాడు. మిగతా ఇద్దరూ కూడా అలానే అని మళ్లీ అందరూ కలిసి నవ్వేస్తారు.
వివేక్ కళ్ళ జోడు కాస్త దించి కన్ను కొడతాడు.
