kottapalli udayababu

Drama Romance Crime

4  

kottapalli udayababu

Drama Romance Crime

"ఇద్దరూ ఇద్దరే(romantic twist)

"ఇద్దరూ ఇద్దరే(romantic twist)

9 mins
448


కధ - ఇద్దరూ ఇద్దరే(romantic twist )

తల వెనుక రెండు చేతులు పెట్టుకుని రాబోయే బస్సు కోసం కోటిపల్లి బస్టాండ్ లో ఎదురుచూస్తున్న గణేష్, అప్పుడే ఆగిన బస్సు లోంచి దిగి రోడ్ క్రాస్ చేసి వస్తున్న మెరుపుతీగను చూసి అలాగే కన్నార్పడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతనే కాదు . చాలామంది మగవారి దృష్టి అటే మళ్లిపోయింది.

సుమారు ఐదు అడుగుల ఆరంగుళాల ఎత్తు ఉన్న ఆమె, కోల ముఖంలో మొన తేలిన గడ్డం కింది పెదవి కింద కొట్టొచ్చినట్లున్న పెసర గింజంత పుట్టుమచ్చతో, తెలుపు పసుపు సమ్మిళితమైన దేహచ్చాయతో,కొనదేలిన ముక్కుతో, దానికి వజ్రంలా ఏ చిన్న కాంతికిరణానికైనా తళుక్కుమంటున్న ముక్కుపుడకతో చూపరులను అలాగే నిలబెట్టే తెల్లని పాల మీగడ కళ్ళతో, ఠీవిగా హుందాగా నడిచివచ్చి బస్టాప్ లో నిలబడింది ఆ సుందరి.

గణేష్ కు మూడు అడుగుల దూరంలో.

బ్లాక్ అండ్ వైట్ మిక్సడ్ బోర్డర్ బెత్తెడు వెడల్పు గల లేసు అందంగా కుట్టబడిన కాటన్ శారీలో, బ్లాక్ బ్లౌజ్ తో లోపల మంగళసూత్రాలు, నల్లపూసల తావళం, ఒంటి పేట బంగారు పలకసరుల గొలుసుతో ఆ సాయంసంధ్యలో ఆమె అప్పుడే కోసిన బొప్పాయి ముక్కలా, దోర జామ కాయలా ఆరోగ్యంతో మిసమిసలాడిపోతున్న ఆమె గణేష్ కి మూడు అడుగుల దూరంలో నిలబడేసరికి "అబ్బా.జంట ఎంత బాగుందో" అనుకుంటున్నవారి గుసగుసలు విని కాబోలు ఆమె గణేష్ కి దగ్గరగా మరింత దగ్గరగా జరిగింది.

వారిద్దరి శరీరాల నుండి వెలువడుతున్న సుగంధపరిమళాలు పిల్లతెమ్మెరలతో పోటీపడి ఆ వాతావరణాన్ని వింతైన మత్తులో ముంచుతున్నాయి.

" ఎక్స్క్యూజ్మీ. టైమెంతయింది సార్?" ఆమె వీణను మీటిన కంఠంతో అడిగింది.

ఆమెకేసే తమకంగా చూస్తున్న గణేష్ ఆమె తన వైపు హటాత్తుగా తిరిగి అడిగిన ప్రశ్నకు ఒక్కసారి తత్తరపడ్డాడు.

"ఎస్ మేడం. వాట్ డు యు వాంట్?"

" టైం ఎంత అయింది? అని అడిగాను. మీరు నన్నే చూస్తూ ఉండి పోవడంతో నేను అడిగిన ప్రశ్న మీకు వినిపించలేదు." ఆమె గారంగా అంటూ మనోహరంగా నవ్వింది.

మనకు మాత్రమే తెలిసిన మనకు సంబంధించిన నిజం వ్యక్తి ఎదుటి గమనించేస్తే దొరికిపోయిన భావం లాంటిది గణేష్ ముఖంలో గమనించింది ఆమె.

" అందంగా ఉన్న ప్రతి దానిని ఆస్వాదించడం నా హాబీ. మీరు అందంగా... కాదు.. కాదు... మీ అంత అద్భుతమైన అపరంజి బొమ్మను నేను ఇంతవరకు చూడలేదు అంటే నమ్ముతారా మీరు?" గణేష్ మాటలకు ఈసారి బిత్తర పోవడం ఆమె వంతు అయింది.

" నేను ఎవరో తెలియక పోయినా ధైర్యంగా మీరు వెలిబుచ్చిన అభిప్రాయానికి, మీ మాటకారితనానికి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను. ఎనీవే థాంక్యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్."

" అందాన్ని ఆస్వాదించడానికి ఆ వస్తువు గురించి తెలియక్కర్లేదనుకుంటాను. అఫ్ కోర్స్. తెలిస్తే ఆ అందం లోతుల నుంచీ ఆస్వాదించడానికి వీలవుతుంది అనుకోండి" అన్నాడు గణేష్ భావగర్భితంగా.

"మీరు మాట్లాడటంలో చతురులు"

" ఆ కాంప్లిమెంట్ ఇందాక ఇచ్చారుగా. థాంక్యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్!" నొక్కి పలుకుతూ అన్నాడు గణేష్.

"బై ది బై మీరు ఏ ఊరు వెళ్తున్నారు?" ఆమె అడిగింది.

" ఏలూరు వెళ్ళాలి. మరి మీరు?"

" కొవ్వూరు వెళ్లాలి"

" ఇప్పుడు అటు నుంచి వచ్చిన బస్సులోంచే కదా దిగారు?" ఆత్రంగా అడిగాడు గణేష్.

ఆమె తడబడింది.

" అవుననుకోండి. షాపింగ్ పని మీద వచ్చాను."

"మరి వెళ్లలేదేం?"

" మీరు వేళ్ళనిస్తేగా"

"నిజంగా! నా వల్లే ఆగిపోయారా?!"

"మీమీద ఒట్టు .మిమ్మల్ని చూసి బస్సు దిగిపోయి అటు వెళ్ళవలసినదానినల్లా ఇటు వచ్చాను "

"ఎందుకని ?"

ఆమె మళ్లీ తడబడింది.

" మీలాంటి పర్సనాలిటీ అంటే నాకు చాలా చాలా ఇష్టం" అనేసి నాలుక కొరుక్కుంది.

అర్థమైంది గణేష్ కి - ఆమె ఎవరో!

ఈ ఛాన్స్ మిస్ అయితే ఒక అందమైన అనుభవం మిస్ అయిపోతుంది. ఎలాగూ ఇంటికి వెళ్ళేది తను ఒక్కడే. ఆ గడిపేది ఈమెనే ఇంటికి తీసుకెళ్లి గడిపేస్తే? అయితే ఆమె ఎటువంటిదో? ఇలాంటి సమయంలో లౌక్యం, సమయస్ఫూర్తి చాలా అవసరం.

" ఏంటి ఆలోచిస్తున్నారు?" ఆమె అడిగింది.

అతను అందమైన తెల్లని పలువరుస తళుక్కుమనేలా నవ్వుతూ" మీకు పేరు ఏది పెడితే బాగుంటుందా అని?"అన్నాడు

అవసరం లేకపోయినా ఆమె పమిట సర్దుకుని "మరీ అంతగా పొగిడేయకండి. నా పేరు స్వర్ణ. మా వారు మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తారు. వారానికి ఐదు రోజులు క్యాంపులో ఉంటారు. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు."

"వావ్. అయితే ఈ వేళ బుధవారం. మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నా కోసం కేటాయించగలరా?" కళ్లు ఎగరేస్తూ మత్తుగా అడిగాడు గణేష్.

" తప్పనిసరిగా! నా షాపింగ్ పూర్తయ్యాక ఇక్కడే కలుస్తాను" అందామె.

" నాకేమీ పనిలేదు. మీకు అభ్యంతరం లేకుంటే మీకు కంపెనీ ఇవ్వవచ్చా?"

ఆమె ఒక్క క్షణం ఆలోచించి "సరే పదండి"అంది. ఆమెను అనుసరించాడు అతను.

టిక్కెట్టు లేని వీధి సినిమా సగంలోనే పూర్తి అయినట్లు నిరాశ చెందారు మిగతా ప్రయాణికులు. నిట్టూర్చి తమ తమ బస్సుల కోసం ఎదురు చూడసాగారు.

******

కోటిపల్లి బస్టాండ్ నుంచి నడుస్తూ గోదావరి స్టేషన్ వరకు ఉన్న మార్కెట్ అంతా పరిశీలిస్తూ తనకు అవసరమైన చోట ఆగి ఏవేవో వస్తువులు పరిశీలించి ఏమీ కొనకుండానే ముందుకు సాగింది స్వర్ణ.

"డబ్బు ఏమైనా కావాలా?" ఒక షాపులోకి వెళ్లి అన్నీ పరిశీలించి తిరిగి వచ్చి ఆమెను అడిగాడు గణేష్.

" నో ప్లీజ్ .నాకు కావలిస్తే అడగడానికి మొహం మొహమాట పడను"

"మరి ఎందుకు ఇన్ని చోట్ల అన్నీ పరిశీలించి ఏమీ తీసుకోకుండా వచ్చేస్తున్నారు?"

" నిజం చెప్పమంటారా? అబద్దం చెప్పమంటారా?"

" అబద్ధమే చెప్పండి" గణేష్ చిలిపిగా అడిగాడు.

"మా లేడీస్ వాడే వస్తువులు కొనుక్కుందామని వచ్చాను .ఎంతైనా మీ ముందు తీసుకోవడం బాగుండదని... "

అతను పకపకా నవ్వాడు.

రెండు జేబులో చేతులు పెట్టుకుని" పోనీ.. నేను బయట వెయిట్ చేస్తాను. మీకు కావలసినది తీసుకోండి" అన్నాడు గణేష్

" థాంక్స్. మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా లెండి. పదండి వెళదాం. అనవసరంగా మీ టైం అంతా వెస్ట్ చేసినట్టున్నాను "అందామె గోముగా.

" నో...నో... ఇప్పటికైనా ఒక సేఫ్టీ ప్రదేశానికి చేరుకుంటే, ఈ కాలమే మనకు గుర్తుండదు"అర్ధోక్తిగా అన్న అతని మాటలకు ఆమె ముగ్ధ మోహనం నవ్వి అడిగింది

" ఎక్కడికి వెళ్దాం?" ఆమె ఆగి అడిగింది.

" ఏలూరు రాగలవా?"

" అమ్మో అంత దూరమే! సారీ అండీ కుదరదు." నొచ్చుకున్నట్టుగా అంది.

" కుదరకా... లేక నా మీద నమ్మకం లేక?"

"నో..నో... అలాంటిదేమీ లేదు. ఎంతైనా నేను సంసారం చేస్తున్న దానినే. మీకు అభ్యంతరం లేదంటే నేనే ఒక ప్లేస్ సజ్జస్ట్ చేస్తాను. సరేనా?"

" చెప్పండి .ఎక్కడ?"

" రాజమండ్రిలో ఎక్కడైనా నాకు ప్రమాదమే. మీకు అభ్యంతరం లేకపోతే కొవ్వూరు గోదావరి గట్టుకి వెళ్దాం."

" మీ ఇంటికి కూడా కాదంటే నా మీద నిజంగా నమ్మకం లేదన్న మాట"

"అది కాదు సర్ నా ఉద్దేశం. మేముండేది ఫ్యామిలీ పోర్షన్. బాగుండదని. అదీకాక పున్నమి వెన్నెలలో గోదావరి నీటిలో సౌందర్యారాధన చేస్తూ పచ్చగడ్డిలో ప్రకృతి ఒడిలో పరవశిస్తూ కలిసే కలయిక అంటే నాకు చాలా ఇష్టం. ఆ కోరిక తీర్చమని మా వారు ఎన్నో సార్లు కోరినా కేంపుల గోలలో వీలు పడలేదు ఇంతవరకు. మీరైనా నా కోరిక తీర్చరూ?"

ఆమె అడిగిన విధానానికి అతను నాదస్వరం నాగుపాములా తలూపాడు.

బస్టాండ్ కి వచ్చి ఇద్దరూ కొవ్వూరు బస్సు ఎక్కారు. రోడ్ కం రైలు బ్రిడ్జి టోల్ గేట్ దగ్గర దిగిపోయారు. అంత సేపు ఆమెను అతను తాకుతున్నట్టుగానే అంటి పెట్టుకొని ఉన్నాడు గణేష్.

గణేష్ కి అంతా కొత్తగాను, ఆశ్చర్యంగానూ ఉంది.

' ఆడదానికి ఇంత చొరవా? ఈ రోజుల్లో లేడీ సూపర్ ఫాస్ట్ గా ప్రవర్తిస్తున్నారు. ఏది ఏమైనా ఈ అందమైన అనుభవం ఎటువంటి అనుభూతిని మిగిల్చినా సరే, దాని అంతు తేలచేయాల్సిందే.

అతని మనసు గోదావరిపై నుంచి వీస్తున్న పిల్లతెమ్మెర తరంగాల్లా ఉవ్విళ్లూరుతూ, తెలియని ఆనందం పొందుతున్నట్టుగా ఉల్లాసంగా అనిపించడంతో పండు వెన్నెల్లో గోదారి అందాలను పరిశీలిస్తూ ఆమెను అనుసరించాడు.

********

పుచ్చ పువ్వు లాంటి పండు వెన్నెలలో రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కనబడనంత దట్టంగా పెరిగిన గడ్డి దుబ్బుల మధ్య శుభ్రమైన ప్రదేశం చూసి ముందు మోకాళ్ళ మీద కూర్చుని, నెమ్మదిగా ఆ భంగిమనీ కుడి మోచేతి మీద ఆనినట్టుగా మార్చుకుని అతనికేసి మత్తుగా చూసింది స్వర్ణ.

వెన్నెల కాంతిలో మిల మిలలాడిపోతున్న రేడియం కోటింగ్ నేమ్ ప్లేట్ లా వింత అందంతో ఆమె ఆహ్వానిస్తూ ఉంటే అతను వివశుడైపోయాడు.

ఆమెకుడి జబ్బలోంచి వీపు మీదుగా చేయి పోనిచ్చి ఆమె మీదకు వాలాడు. ఆమె ఏమీ అభ్యంతరం చెప్పలేదు

ఆమె శరీరం నుండి స్వేదంతో తడిసిన కాస్ట్లీ సెంటెడ్ పౌడర్ సువాసనలు అతనిలోని కోరికను పెంచసాగాయి.

ఆమె గడ్డం కింద, ఆమె పొట్ట మీద, ఆమె చెక్కిళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ ఆవేశంతో చుంబిస్తున్న అతని వేగానికి ఆమె ఆశ్చర్యపోతూనే అతని చేతుల్లో వంచిన విల్లులా అమరి పోయింది.

" ప్లీజ్... స్లో... మీ బ్రాస్లెట్, ఉంగరం గుచ్చుకుంటున్నాయి" అందామె గారంగా.

అతను ఒక క్షణం లేచి మోకాళ్ళమీద కూర్చున్నాడు. బ్రెస్లెట్, ఉంగరం ఆమె జాకెట్ లో వేసాడు చనువుగా. "అక్కడయితే భద్రంగా ఉంటాయి. వెళ్లేటప్పుడు తీసుకుంటాను. కానీ మీ గోల్డ్ చైన్ రాపిడికి నాచెంపలు ఎలా కందిపోయాయో చూశారా స్వర్ణ?" అన్నాడతను.

ఆమె గోల్డ్ చైన్ తీసేసి అతని చొక్కా గుండీలు విప్పి బనీనులో వేసింది.

" ఇక్కడ అయితే అది మరీ భద్రంగా ఉంటుంది. నేను మీలాగే వెళ్లేటప్పుడు తీసుకుంటాను" అంది రొమాంఛితమైన అతని హృదయంపై తన చేతి వేళ్ళను అల్లల్లాడిస్తూ.

"ఒక పని చేద్దాం స్వర్ణా. నా జ్ఞాపకంగా నా బ్రాస్లెట్ , ఉంగరం మీరు ఉంచుకోండి. మీ జ్ఞాపకంగా మీ గొలుసు నేను ఉంచుకుంటాను.సరేనా?"

" ఓకే.ఫెంటాస్టిక్ ఐడియా. చాలా బాగుంది. అబ్బా !టైం వేస్ట్ చేస్తున్నారు." ఆమె మత్తుగా చొరవగా అతన్ని అమాంతంగా మీదకు లాక్కుంది.

వెన్నెల్లో మసకబారిన కెంపుల్లాంటి అతని ఎర్రటి పెదాలకు తన అధరామృతం అందివ్వాలనే తాపత్రయం ఆమెలో తారస్థాయికి చేరుకుంది అని గమనించిన గణేష్, ఆమె ముచ్చట తీరుద్దామని ఆమె పెదవులను తన పెదవులతో అందుకోబోయాడు .

సరిగ్గా అప్పుడు పడింది అతని భుజం మీద కర్ర లాంటి బరువు.

కొయ్య బారి పోయింది స్వర్ణ.

వెనక్కి తిరిగి స్తంభించిపోయాడు గణేష్.

ఎదురుగా జీరలు నిండిన ఎర్రని మత్తు కళ్ళతో తప్పతాగిన వాసనతో నిలబడిన కానిస్టేబుల్ను చూస్తూనే ఇద్దరికీ చెమటలు పట్టేశాయి. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక.

" ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ?" అడిగాడు కానిస్టేబుల్.

"మేము ...మేము.. భార్య భర్తలం!" తడబడుతూ అన్నాడు గణేష్.

అటువంటి అనుభవం జీవితంలో ఏనాడు ఎదురవ లేదేమో... తన గుండెల చప్పుడు తనకే వినిపిస్తుంటే అదురుతున్న మనసుతో సన్నగా కంపిస్తున్న అతడు అది కానిస్టేబుల్ కంట పడకుండా ఉండడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న వాడిలా ఉన్నాడు .

"ఏం? చెవుల్లో పువ్వులు పెట్టడానికి చూస్తున్నావా? దిక్కు మొక్కు , కొంపా గూడు లేని భార్య భర్తలా మీరు? నిజం చెప్పరా .ఏం చేస్తున్నారు ఇక్కడ?"

" ఏమీ చెయ్యడం లేదండి!" ఆమె బిక్కుబిక్కుమంటూ అంది కన్నీళ్లతో. వెన్నెల కాంతిలో ఆమె కళ్ళల్లో నీళ్ళు ముత్యాల్లా మెరుస్తున్నాయి.

"ఏం చెయ్యడం లేదండీ!" ఆమెను వెక్కిరిస్తున్నట్టుగానే వెక్కిరింతగా అన్నాడు కానిస్టేబుల్ .

"ఏం కహానీలు చెబుతున్నార్రా! మీరిద్దరూ భార్యాభర్తలు . కలిసి పడుకోవడానికి మీకు కొంపే లేదు. పబ్లిక్గా రొమాన్స్ చేయడానికి ఇది తెలుగు సినిమా షూటింగ్ అనుకున్నారా? మీరిద్దరూ బాలీవుడ్ హీరో హీరోయిన్ లు అనుకున్నారా? ఇంతకీ ఎక్కడ కొట్టుకొచ్చావురా దీన్ని?"గణేష్ కాలర్ పట్టుకుని అడిగాడు పోలీస్.

" మిస్టర్ కానిస్టేబుల్ . మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిది" స్వర్ణ అరిచింది కోపంగా .

"నోరుముయ్యవే. ఒక మగాడి పక్కన పబ్లిక్ గా పడుకోడానికి వచ్చిందానివి నీకు మర్యాద ఇచ్చేది ఏమిటి ?ఏరా... చెప్పు. మొన్న నాలుగు రోజుల క్రితం ఇక్కడ అవసరం తీర్చుకొని, అమ్మాయిని చంపేసి గోదాట్లోకి తోసేసిన హంతకుడివి నువ్వేనా?నిజం చెప్పు. లేకపోతే పదా పోలీస్ స్టేషన్ కి.నీ సంగతి ఎస్ఐ గారు తేలుస్తారు ''

ఆ మాటలతో పై ప్రాణాలు పైకే పోయాయి గణేష్ .కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

"సారీ సార్. సార్. మా అమ్మ మీద ఒట్టు సార్ .నిజంగా నాలుగు రోజుల క్రితం చచ్చిపోయిన అమ్మాయి ఎవరో, ఎవరు చంపారో నాకు తెలీదు సార్. మాది అసలు అమలాపురం. పండుగకు అత్తవారి ఇంటికి వెళ్లి తిరిగి మాఇంటికి ఏలూరు వెళ్లిపోతున్నా సర్. అంతే." అన్నాడు కానిస్టేబుల్ చేతులు పట్టుకొని.

"ఛత్ .నోరు ముయ్యారా.మీరు చేసే తప్పుడు పనులకు అమ్మల మీద కూడా ఒట్లెందుకురా లోఫర్ నాయాలా. ఏమే. నీ సంగతి ఏంటి చెప్పు!"హుంకరించాడు పోలీస్.

" నేను రాజమండ్రి బస్ స్టాప్ లో నిలబడితే ఆయనే నన్ను ప్రేరేపించి తీసుకు వచ్చారండి .మేం ఇద్దరం భార్యభర్తలం కాదు .ఆయన నా మొగుడు కాదు. నేను ఆయిన పెళ్ళాన్ని కాదు.'ఆమె పవిట భుజం చుట్టూ పవిత్రంగా కప్పుకుని కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్పిన మాటలకు పది టన్నుల రాయి నెత్తి మీద పడ్డట్లు అయ్యింది గణేష్ కి .

ఈ సమయంలో ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది.

' అమ్మ ఎంతకు తెగించావే? మగవాడు నమ్మించి మోసం చేయగలడు. అవసరమైతే ప్రాణం కూడా తీయగలడు. కానీ తన చేతికి మట్టి అంటకుండా తన కళ్లెదుటే నన్ను మోసం చేసిన వాడిని మట్టుపెట్టించడంలో ఆడదాని కన్నీటికి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో మరి దేనికీ లేదనుకుంటా 'అనుకున్న గణేష్ పోలీసుతో అన్నాడు .

"అవునండి. మేమిద్దరం భార్యభర్తలం....... కాదు అని చెప్పబోతుంటే మీరు మధ్యలో అడ్డుకోవడం వల్ల మీకు మేమిద్దరం భార్యాభర్తలం అని వినిపించింది మీకు. కానీ ...కానీ... నిజంగా నేను ఆమెని ప్రేరేపించలేదండి. తన భర్త మెడికల్ రిప్రజెంటేటివ్ అని ,వారానికి ఐదు రోజులు క్యాంపులో ఉంటారని చెప్పి తానే ఈ ప్రదేశం సజెస్ట్ చేసి తీసుకువచ్చిందండి" అన్నాడు గణేష్ అమాయకత్వం నిండిన కళ్ళతో.

" లేదు అన్నయ్య. నేను నిజంగా అలా అనలేదు .మాది అసలు నిడదవోలు. మా వారు రైల్వే బుకింగ్ క్లార్క్. నేను రాజమండ్రి షాపింగ్ కని వస్తే ఈయనే నా వెంటపడి 'నీకు కావాల్సింది కొనిస్తాను. నాతో వస్తావా ?'అన్నారు. పైగా 'నేను నిడదవోలు వైపే వస్తున్నాను. నిన్ను దారిలో మీ ఇంటి దగ్గర దింపేస్తాను అంటే నమ్మి ఆయన వెనకాలే వచ్చాను. నన్ను... నన్ను... మీరే కాపాడాలి అన్నయ్య." కానిస్టేబుల్ భుజం మీద తలవాల్చి వెక్కుతూ అన్న ఆమె మాటలకు, అసలే తాగి ఉన్నాడేమో, ఆ పోలీసు బేర్ మన్నాడు.

" బాధపడకు చెల్లెమ్మ. నీకు నేను ఉన్నాను. ఈ దేశంలో ఆడది ఎంత చీప్ ఐపోయింది? నీకు కావాల్సినవన్నీ కొనిస్తా అన్నాడా? ఏరా! నీకాడ అంత డబ్బుందా? ఏదీ..పైకి తీ... ఎంత ఉందో! లేదా మొన్న జరిగిన మర్డర్ కేసు నీమీద బనాయించి నిన్ను బొక్కలోకి తోయించేస్తారోయ్ .."తాగిన మైకంలో ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడో తెలియని ఆ పోలీస్ ముందు గత్యంతరంలేక జేబులో పర్సు తీసి అతని చేతిలో పెట్టాడు గణేష్ .

రెండు వంద రూపాయల నోట్లు, నాలుగు పదులు ,కొంత చిల్లర ,ఒక కండోమ్ ప్యాకెట్ ఉన్నాయి అందులో.

" ఆహా! అన్ని రెడీ అయ్యే వచ్చావన్నమాట . సరే. అమ్మాయి .నువు ఇక్కడే ఉండు. ఈడిని పోలీస్స్టేషన్లో ఎస్ఐ గారికి అప్పగించి వస్తాను. చెల్లెమ్మా. ఎక్కడికైనా వెళ్లావా... జాగ్రత్త! ఒరేయ్ పదరా!" గణేష్ కాలర్ పుచ్చుకుని రోడ్డు మీదకు తీసుకువచ్చాడు పి.సి.

"సార్ ..సార్! నా పేరు పోలీస్ స్టేషన్ రికార్డులోకేక్కిందంటే నా పరువు పోతుంది సార్ .ప్లీజ్ కావాలంటే ఆ 200 తీసుకుని నన్ను వదిలేయండి సార్. మీ కాళ్లు పట్టుకుంటాను సార్"గణేష్ రోడ్డు అని కూడా చూడకుండా పోలీసు కాళ్లకు చుట్టుకుపోయాడు.

పి.సీ కరిగాడు.

" సరే అయితే. ఈ రెండు వందలు మా బానపొట్ట ఎస్ ఐ గారి ఆఫ్ బాటిల్ కే సరిపోదు.మరి నా మామూలు?" అడిగాడు పి.సి.

"మీకు కావలిస్తే నన్ను పూర్తిగా సోదా చేసుకోండి సార్. నన్ను నిలువుదోపిడీ దోచినా నా దగ్గర ఉన్నది అంతే. కనీసం అమలాపురం వెళ్లేందుకు నాకు దారి ఖర్చులేనా ఇవ్వండి సార్."జాలిగా అడిగాడు గణేష్.

" సరే అయితే. ఇంకెప్పుడైనా ఇటు కనిపిస్తే?"

" మెడ మీద తలకాయ ఉండగా ఇటు రాను సార్ " అమ్మ మీద ఒట్టు వేయబోయి ఆగిపోయాడు.

"వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా. అయినా మీకు కుర్రనా కొడుకులు బాగా సెడిపోయార్రా అబ్బాయా. దేన్నో ఒక దాన్ని ఎంటేసుకురావడం,అవసరం తీరాక వదిలేయ్యొచ్చు కదా. సరదాగా సంపేసి గోదాట్లో తోసేయడం.వారానికో కేసనుకో. ఆ గవర్నమెంటోళ్ళు మా పెళ్ళాలతో మమ్మల్ని కాపురాలు సేసుకోనివ్వకుండా దిక్కు దివానం లేని ఇలాటిసోట మాకు డ్యూటీ ఎయ్యడం ...ఎందుకు వచ్చిన కర్మ రా బాబు? మీరు సుఖంగా జల్సా సేత్తారు.మా పానం తీసేత్తారు. సరే!అదిగో. బస్సు వత్తున్నట్టు ఉన్నాది .అలాగే లాగెత్తి ఎక్కు...పో!" అంటూ ఖాళీ పర్సు, 20 రూపాయలు,చిల్లర అతని చేతిలో పెట్టి మిగిలిన డబ్బులు జేబులో పెట్టుకొని నడుమున లాఠీ ఒకచేత్తో పట్టుకుని యమభటుడిలా నిలబడ్డాడు .

గణేష్ ముందు వెనక చూడలేదు. ఒక్కటే పరుగు. అదృష్టవశాత్తు ఆగిన బస్సు ఎక్కేసాడు. అది రయ్యిమంటూ బ్రిడ్జి మీదుగా వెళ్లిపోవడం చూస్తూనే పోలీస్ కానిస్టేబుల్ కళ్ళల్లో కర్కశంతో కూడిన  వీధి దీపపు కాంతిలో తళుక్కుమంది.

"ఎంత కిట్టింది బావ?" వెనకనించి వినబడడంతో వెనక్కి తిరిగాడు పి.సి. ఎదురుగా నిలబడి ఉంది స్వర్ణ.

" అదేంటే ... వరుస మార్చేసావ్? అయినా ఇట్టాంటి పూతరేకోడిని అట్టుకొచ్చావేంటి?బేరం పట్టుకుని బెదిరించామంటే కనీసం 'ఎయ్యి' సేతుల్లో పడాల. ఈ పాలు ఏ సుజుకి ఓడినో తగులుకో. ఆడి అందం చూసి డంగైపోయుంటావ్. ఇంతకీ నువ్వేం కిట్టించుకున్నావు?"

" నా బొంద. నువ్వు అరంగేట్రం చేశాక నాకు ఇంకేం మిగులుద్ది? అయినా పట్టుమని పదినిమిషాలు కాకుండా వచ్చేస్తే ఎట్లా బావ? కనీసం నాకు ఇష్టమైన వాడితో అనుభవమైనా దక్కేది. అయినా నా గిల్టు గొలుసు ఆడి బనీనులో ఏసీ బాగానే సంపాదించాలే" అని అతని చేతిలో తన గుప్పెట్లో పెట్టుకున్న రింగ్, బ్రాస్లెట్ వుంచింది.

అతని కళ్ళు ఒక్క క్షణం ఆరిపోయే దీపంలా వెలిగి, అంతలోనే మాడిన బల్బులు అయిపోయాయి .అతను అనుమానంతో గోరుతో గీకిన చోట కోటింగ్ బయటికి వచ్చి అతని అర చేతిలో మెరవ సాగింది.

" ఒసేయ్! ఇది కూడా కాకి బంగారమేనే. నీకు ఆడు టోకరా ఏసేసాడు" అన్నాడు పకపకా నవ్వుతూ.

" అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు బావ?" అడిగింది స్వర్ణ .

"చిన్నప్పటి నుంచీ కులవృత్తి చేసుకుని ఉద్యోగం వచ్చింది కదా అని ఈ పోలీసు ఉద్యోగంలో సేరినా. ఎన్ని రకాల బంగారాల్ని కళ్ళతో చూశాననుకున్నావ్? అట్టాంటిది... ఏది అసలు... ఏది నకిలీవో ఆరు అడుగుల దూరం నుంచి పసికట్టీగల్ను. ఇంద తీసుకో. ఇదీ ఈఏల నువ్వు సంపాదించింది."

ఆమె చేతిలో కండోమ్ ప్యాకెట్ పెట్టి అన్నాడు పిసి.

'నామీద నాలుగాకులు ఎక్కువ చదినోడే"గణేష్ ని కసిదీరా తిట్టుకుంది స్వర్ణ.

"పద పద! ఎస్ఐ ఏమి తీసుకురానందుకు కస్సుబుస్సులాడతాడు. ఈ యాల్టికి దీంతో సద్దుకోమని సెబుతాను. అప్పుడైనా ఉపయోగిస్తుంది ."

లాఠీ ఊపుకుంటూ బయల్దేరిన అతని వెనుక ఉసూరని నిట్టూర్చి అనుసరించింది స్వర్ణ!

సమాప్తం


Rate this content
Log in

Similar telugu story from Drama