గుండమ్మ కథలో..
గుండమ్మ కథలో..
గుండమ్మ కథలో జమున, అక్కినేని నాగేశ్వరరావు ప్రేమ సీన్
నా వెర్షన్ :
డబ్బు తెచ్చాను అంటుంది ఆమె. అక్కడ పెట్టేసి పో అంటాడు అతను.
ఎవరు వచ్చిందీ చూడరా? అంటుంది ఆమె.
సరోజా! నువ్వా.. కాస్త తలనొప్పిగా ఉంటే పట్టించుకోలేదు అని సంజాయిషీ చెప్పుకున్నాడు.
అమృతాంజనం తెచ్చాను. వ్రాయమంటారా అంది ఆమె.
వద్దొద్దు. చల్లని ఈ సాయంకాల వేళ ఎలా ఉందో చూడు. అదిగో అక్కడ చూడు అంటూ గోడ మీద చూపించాడు.
ఆమె అటు వైపు చూస్తుంది. రెండు పావురాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నట్లు తన్మయత్వంలో ఉన్నాయి.
ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో అవి అంది ఆమె.
మనమూ అంత స్వేచ్ఛగా ఉండొచ్చు అన్నాడు అతను.
అంటే? అంటూ ఆమె అల్లరిగా అటు వైపు తిరుగుతుంది. తప్పేముంది ? అంటాడు అతడు.
ప్రేమా ఇది అని ఆమె అంటుంది.
ప్రేమే అయితే ఆ ప్రణయ దేవతవు నీవే అని సేవించనా అని అతను దగ్గరికి వస్తాడు.
ఆమె పిల్లగాలిలా చీర కొంగును అతడి ముఖానికి తాకించి నవ్వుతూ క్రిందకి పరుగెడుతుంది.

