Dinakar Reddy

Abstract Comedy

4  

Dinakar Reddy

Abstract Comedy

గ్రహాంతర పెళ్ళికొడుకు

గ్రహాంతర పెళ్ళికొడుకు

2 mins
389


ఏంట్రా కొత్త కథలు ఏమైనా వ్రాశావా. మోహన్ వచ్చి కుర్చీలో కూర్చుని అడిగాడు. మోహన్ నేనూ ఒకే ఊళ్లో ఉద్యోగం చేస్తున్నా ఆదివారం తప్ప కలుసుకోవడానికి వీలు పడదు.


నేను కడుగుతున్న పాత్రలు పక్కన పెట్టి చెయ్యి తుడుచుకుని వచ్చి నిన్న కథ వ్రాసుకున్న పేపర్లు ఇచ్చాను తన చేతికి.


తను బయటికే చదువుతున్నాడు.


ఈ రెక్కల గుర్రాల మీద రాకుమారుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు అనే fantasy మనకు తెలిసిందే కదా. అంటే కథల్లో అలాగే చెబుతారు కాదా.

అలా కలలు గన్న ఒక అమ్మాయి గ్రహాంతరవాసి అయిన రాకుమారుడిని ప్రేమించింది. మరే. రెక్కల గుర్రం భూమ్మీద లేదుగా. భైరవ ద్వీపం సినిమాలో ఉంది. అది వేరే సంగతి. 


రాజూ, మా అమ్మాయి పెళ్ళి ఈవెంట్ చేసి పెట్టు అని పెళ్లి 

నేనేమో ఈ పెళ్లి ఈవెంట్ ఒప్పుకున్నా. ఏదో మా అపార్ట్మెంట్ వాళ్ళే కదాని. 


అప్పుడు నాకో డౌట్ వచ్చింది.


మోహన్ : అసలు పెళ్లి కొడుకు గ్రహాంతర వాసేనా అనేనా?

నేను : నువ్వు మొత్తం చదువురా.


మోహన్ మళ్లీ చదువుతున్నాడు.


పార్కింగ్ ఇబ్బంది అవుతుంది అతని రెక్కల గుర్రాన్ని NASA వాళ్ళ స్పేస్ స్టేషన్ లో పెట్టేసి ఎగురుకుంటూ రమ్మని చెప్పా. మా అపార్ట్మెంట్లో ఈ మధ్యే వైరల్ వీడియోలు చేసే బ్యాచ్ లు ఉన్నట్టు తెలిసింది. వారి ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ. అందుకే పార్కింగ్ ఇబ్బంది.


మోహన్ : రెక్కల గుర్రం అక్కడ పెట్టేసి ఎలా ఎగురుతూ వస్తాడు?


నేను : ఆ. పాక్కుంటూ. అయినా పెళ్లి కొడుకు గ్రహాంతర వాసి అని తెలుసుగా. మనకి తెలిసిన అన్ని కథల్లోనూ సినిమాల్లోనూ గ్రహాంతర వాసులకి రకరకాల విచిత్ర శక్తులు ఉన్నట్టు చూపించారు కదా. అందుకే పెళ్లి కొడుకు ఎగురుతూ వస్తాడు.


మోహన్ : మరి NASA స్పేస్ స్టేషన్ లో ఎందుకు పెట్టాలి? మన ISRO వాళ్ల స్పేస్ స్టేషన్ లో పెట్టుకోవచ్చు కదా.


నేను : అరే. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రా. మన వాళ్ళు పెడతాం అన్నారు వేరేగా. 


సరే మిగతాది చదువు అన్నాను నేను.


తీరా పెళ్లి రోజు రానే వచ్చింది. వర్జ్యం వచ్చి పెళ్లి లేటు అయితే ఏ టీవీ ఛానెల్ వారో దయ చేసి కట్నం ఇవ్వలేదని గ్రహాంతరవాసి అయిన పెళ్లి కొడుకు రాలేదని ఓ అరగంట న్యూస్ వేస్తారు.


ఎందుకొచ్చిన తల నొప్పి. అసలే పెళ్లికి మెనూలో లడ్డూ, నేతి ఖజ్జికాయలు, వెజ్ బిర్యానీ ఇలా అన్నీ మాకు ఇష్టమైనవి చేయించా.


అతను వచ్చేస్తే పెళ్లి జరిగి అందరం టైమ్ కి భోంచేయచ్చు. 

పెళ్ళికొడుకు ఎంచక్కా పైకి తీసుకెళ్లి దగ్గరగా పెళ్లి కూతురికి అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తాడు. 


మోహన్ : రేయ్ రాజూ. ఖజ్జికాయలు ఏంట్రా. కజ్జికాయలు కదా. 

నేను : అదీ. అదీ. పెళ్ళికొడుక్కి క పలకదు. అందుకే అలా వ్రాశాను.

మోహన్ : అప్పుడే పెళ్లి కొడుకు తెలుగు నేర్చుకున్నాడా. ఏమైనా తెలుగు గొప్పతనం అది. అందుకే అన్నారు ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అని.

నేను : ఎవరు బాబూ అంది?


మోహన్ : ఇంకెవర్రా నేనే.

సర్లేగానీ పెళ్లి కొడుకు వస్తాడంటావా.


నేను : 

అంతగా పక్క గ్రహం వాణ్ణి ప్రేమలో ముంచిన భామామణి ఉంటే మన్మథుడు అయినా రావాల్సిందే.

ముందు నువ్వు ఫుడ్ ఆర్డర్ పెట్టు. ఆకలవుతోంది. మిగతా కథ మళ్లీ చదువుదువు గానీ అని నేను పాత్రలు కడగటానికి సింక్ దగ్గరికి వెళ్ళాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract