గెడ్డం గొడవ
గెడ్డం గొడవ
ఏంటి సార్ అద్దాన్ని పట్టుకుని పొద్దుపొద్దున్నే ప్రయోగాలు చేస్తున్నారు ? చరణ్ ని అడిగాను.
ఏం లేదురా. ఇంకా ఈ గెడ్డం మీసాల్ని టచ్ అవ్వట్లేదే అని బదులిచ్చాడు వాడు.
ఇప్పుడు దాని గురించి ఎందుకురా నీకు అన్నాను.
చరణ్ నా వైపు గుర్రుగా చూశాడు. నువ్వు scruffy beard స్టైల్ మెయింటైన్ చేస్తున్నావ్ కదా. నీకలానే ఉంటదిలే.
నేను ఫుల్ బియర్డ్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా అన్నాడు వాడు.
ఎందుకురా అన్నాన్నేను. ఎందుకేంట్రా? నా గెడ్డం అసలే ప్యాచీగా ఉంటుంది. ఫస్ట్ ఈ గెడ్డం మీసాల్ని కలిసేలా పెంచుకున్నా అనుకో తర్వాత బియర్డ్ కోసం ఆయిల్స్ వాడు కొంచెం థిక్ చేసుకోవాలి.. చరణ్ చెప్పుకుంటూ పోతున్నాడు.
బాబూ బ్రాడ్ పిట్! ఏంటిది. బాగా ప్లాన్ చేసినట్టున్నావ్. ఆఫీసుకు ఒక్కరోజు సెలవు వస్తే ఏదో ఒకటి కొత్త ప్లాన్ రెడీ చేసేసి ఉంటావు. ఏంది కథ అన్నాను నేనూ సోఫా మీద కూర్చుంటూ.
Scruffy బియర్డ్ కి అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అవుతారు అన్నాడు చరణ్.
నువ్వు ముందు ఆ లైఫ్ స్టైల్ బ్లాగులు మరీ అంత సీరియస్గా తీసుకోకురా.
Patchy బియర్డ్ పెట్టుకుని జానీ డెప్ బాగా కనిపించలేదా.
ప్రతి వారం ఒక్కో స్టైల్ ట్రై చేస్తూ ఉండడమే. మనకు బాగా అనిపిస్తే మళ్లీ ఇంకోసారి ట్రై చేస్తాం. లేకుంటే మళ్లీ కొత్త లుక్ అని నా అభిప్రాయం చెప్పాను.
అవున్రా. ఆలోచిస్తే ఇది కూడా బాగానే ఉంది. ఉండు. నేనే కొత్త ఒక గెడ్డం స్టయిల్ క్రియేట్ చేస్తా అంటూ సెలూన్ షాపుకు వెళ్ళాడు చరణ్.
నేనేదో సరదాగా జానీ డెప్ గెడ్డం గురించి అన్నాన్రా అంటున్నా వాడు వినిపించుకోలేదు. ఇక మేము ప్రతి వారం ఒక కొత్త బియర్డ్ స్టయిల్ గురించి వినాల్సిందే అనుకుంటా.
