STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

ఎచ్చులకోరు

ఎచ్చులకోరు

1 min
613

అట్నే ఉండు. అబ్బాయి ఇవరాలు మా రాజయ్య బాగా చెప్తాడు అన్యాడు వీరయ్య. సరిపోయింది. ఆ ఒంటిల్లు రాజయ్య ఇసయం చెప్పడమే! ఇంగ బూమీ ఆకాసం ఒగటి జేత్తాడు అని రాజయ్య గురించి అన్యాడు బసవయ్య.


ఏంది మా బావను అట్టంటావు. మరీ అంత అన్యాయం జేసే మడిసి కాదుబ్బా. ఏందో ఒకట్రెండు పంచాయితీలు జేసాడంతే.


అంత సిన్నగంటావేంది సామీ. ఆ సమాధుల కాడ బూమిని పట్టుకోని, పక్కన్నే గవుర్ణమెంటు ఇండ్ల స్థలాలు వచ్చాండయని జెప్పి అందరికీ అమ్మి పారెయ్యలా. 


నువ్వేమైనా జెప్పు. ఆ ఎచ్చులకోరు కొడుక్కి నేను పిల్లని ఎతకాల్నా. నా వల్ల కాదు అని బసవయ్య దణ్ణం పెట్టి ఎళ్ళిపోయాడు.


బావా! అంటూ ఇంటికి పుయినాక ఇషయం అంతా జెప్పినాడు వీరయ్య.


ఏందోలే బావా. అయినా నా కొడుకు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఆకాశం నుంచి రావాల గనీ, ఇట్టాంటి సంబంధాలు సూడలేమబ్బా అన్నాడు రాజయ్య.


ఇంతకీ ఆ వాసు గాడు ఏం జేస్తాండు ఇప్పుడు అని అడిగినాడు వీరయ్య. ఆ మన ఊర్లో వానలు సరింగ పడలా అని మబ్బుల్ని పొడస్తాండు అన్నాడు రాజయ్య.

దేంతో? అని అడిగాడు వీరయ్య బుర్ర గోక్కుంటూ.


ముల్లు గర్రతో అని బదులు సెప్పినాడు రాజయ్య.


నిజమే బావా! మీ ఎచ్చులకు అంతు లేకండా బొయ్యింది. అక్కతో మాట్లాడి పోతా అని మనసులోనే అనుకున్నాడు వీరయ్య.



Rate this content
Log in

Similar telugu story from Abstract