దేవుడు దెయ్యం మనిషి
దేవుడు దెయ్యం మనిషి
దేవుడు
దెయ్యం
మనిషి
ఈ ముగ్గురిలో ఎవరంటే నీకు ఇష్టం అని నన్ను ఎవరైనా అడిగితే నాకు "దెయ్యం" అనే చెప్తాను,.
అవును,
మీరు విన్నది నిజమే....
నేను బాగానే ఉన్నాను
భ్రమలో ఉండి చెప్తున్న మాటలు కాదు.
ఎందుకంటే,
"దేవుడు"
నేనైతే ఇంతవరకు చూడలేదు....
దేవుడిని ఏదైనా అంటే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెడుగానే చెప్తారు.....
కానీ,
దేవుడు రక్షించించాడు అని ఏ సంధర్బంలో కూడా ఎవ్వరు ఇప్పటి వరకు నాతో అనలేదు....
కాబట్టి దేవుడు నాకు నచ్చలేదు
నాకు చెప్పిన కూడా నేను నమ్మను.
"మనిషి"
మనిషిని చూసాను , చూస్తున్నాను
నేను కూడా మనిషినే కదా....
మనిషి గురించి చెప్పాలంటే అది మాములుగా ఉండదు...
ఎందుకంటే,
మోసం, ద్వేషం, కుళ్లు, కుతంత్రం, పగ, ప్రతికారం, బలుపు, పొగరు, అసూయ, కోపం, అబద్దాలు, ఆడంబారాలు, మొదలైనవి....
ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని.
"దెయ్యం"
దెయ్యాన్ని కూడా నేను ఇంతవరకు చూడలేదు నమ్మను కూడా....
అయిన నాకు దెయ్యం అంటే ఇష్టం.....
ఎందుకంటే,
దెయ్యాన్ని తిట్టిన అది ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు......
చేసినట్లు కూడా ఎవరు చెప్పలేదు....
అందుకే నాకు దెయ్యమంటేనే ఇష్టం.
✍️పాండు రావణ్ మహారాజ్ అశ్వగోష్ బుద్ధ
