Dinakar Reddy

Abstract Fantasy Thriller

4  

Dinakar Reddy

Abstract Fantasy Thriller

డిస్నీ ల్యాండ్ లో సాగర కన్య

డిస్నీ ల్యాండ్ లో సాగర కన్య

2 mins
231


అమ్మా! లే.. మన ఇంటి పక్కనే డిస్నీ ల్యాండ్ వచ్చింది.. చూడు అంటూ నిఖిత వాళ్ళ అమ్మని నిద్ర లేపింది. వసుమతి కళ్ళు మూసుకునే ఆ.. సరే అయితే ఎప్పుడూ వెళ్ళాలి అంటుంటావ్ కదా. వెళ్ళిరా అని మళ్లీ నిద్రలోకి జారుకుంది.


నిఖిత మెల్లిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్లింది.. తన బుల్లి మేకప్ కిట్ చేతిలో పట్టుకుని ఒక రాయి మీద కూర్చుంది.


చిత్రం. ఆ రాయి తేలుతూ ఉంది. అప్పుడు గమనించింది నిఖిత.. తను ఉన్నది సముద్రంలో అని.


అంటే ఇప్పుడు నేను ఏరియల్ ని కలవడానికి వెళ్తున్నా అన్నమాట అంటూ చప్పట్లు కొట్టింది.


కొద్ది దూరం వెళ్లి ఆ రాయి నీళ్లలోకి మునిగింది.


అక్కడ సముద్రపు రాజు సభికులతో ఉన్నారు. నిఖితను చూడగానే పీతలు ఆమె చుట్టూ చేరాయి..


ఆగండి.. ఆమె నా స్నేహితురాలు అంటూ ఒక సాగర కన్య వేగంగా వచ్చి నిఖితని తనతో పాటు తీసుకెళ్ళింది.

నిఖిత ఊపిరి పీల్చుకోవడానికి అనువుగా ఒక గొట్టాన్ని ఇచ్చింది ఏరియల్. ఆ గొట్టం నోట్లో పెట్టుకొని అరిస్తే ఒక గంట సేపు నిఖిత శ్వాస తీసుకోకుండా ఉండగలదు.


ఏరియల్.. నీ జుత్తు ఎంత అందంగా ఉంది అంటూ నిఖిత ఏరియల్ జుత్తుని తాకింది.. దా మనం పల్టీలు కొడదాం అంటూ ఏరియల్ ఆమెను ఒక పెద్ద చేప వీపు మీద ఎక్కించి సముద్రమంతా తిప్పి చూపించింది.


నేను ఎప్పటి నుంచో డిస్నీ ల్యాండ్ కి వెళ్ళాలి అనుకున్నాను.. ఇప్పుడు నా కోసమే డిస్నీ ల్యాండ్ దగ్గరికి వచ్చింది అంది నిఖిత..


నా మేకప్ సెట్ పెట్టుకోడానికి ఈ ముత్యపు చిప్ప బాగుంటుంది కదూ అని నిఖిత ఒక ముత్యపు చిప్పను తెరవబోయింది..


వద్దు అంటూ ఏరియల్ వారించబోయేంతలో నిఖిత ఆ ముత్యపు చిప్పను తెరవడం, ఆ ముత్యపు చిప్ప సముద్రపు నాచుతో సహా నిఖితను వాళ్ళ ఇంట్లో పడేయడం జరిగింది..


కళ్ళు తెరిచి చూస్తే తన బెడ్ మొత్తం తడిగా ఉంది. సముద్రపు నాచుతో గది నిండిపోయింది..


నిఖీ! ఇవాళ ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తారు కదా.. ఇంకా రెడీ అవ్వలేదా అని వాళ్ళమ్మ వసుమతి వచ్చి గదిని చూసి ఆశ్చర్యపోయింది..


నిఖిత నవ్వుతూ అమ్మా! సెలవుల్లో నేను డిస్నీ ల్యాండ్ వెళ్తాను అని చెప్పింది..


ముందు ఇదంతా శుభ్రం చేసి స్కూల్ కి రెడీ అవ్వు. తర్వాత చూద్దాం అని చెప్పింది వసుమతి..


Rate this content
Log in

Similar telugu story from Abstract