చివరి మజిలీ
చివరి మజిలీ


‘మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం’- గీతోపన్యాసం చెబుతున్న స్వామీ ఆత్మబోధానంద మధురవాక్కులు వింటూ పరవశించి పోతున్నాడు చలపతి
’సర్వమును హరించుమృత్యువును నేనే. జన్మించబోయే వారల జన్మాన్ని నేనే .- ఉపన్యాస సప్తాహం చివరి రోజది
చలపతి శ్రద్ధాభక్తులతో విన్నాడు
వృత్తిరీత్యా పూజారి
ప్రవృత్తికూడా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తోంది
సంతానయోగం కలగలేదు
ధర్మపత్ని గోద నిజంగా గోదాదేవి
రామాలయం పక్కనే ఓగదిలో బస
కైంకర్యలోపం లేకుండా 70ఏళ్ళగా రాముని సేవ చేస్తున్నారు
ఇల్లూవాకిలీ లేవు
ఎవరైనా భక్తులు అడిగితే- ‘ఇల్లు ఇల్లనియేవు నీఇల్లు ఏదిరాచిలకా? అని తత్వాలు వినిపించేవాడు
నాకు ఆఖరి ఇల్లు ఊరి చివరి శ్మశానమేగా అంటూ చమత్కరించేవాడు
ఆయన వేదాంత ధోరణిలో సాయంకాలాలో గుడిలో భాగవతం చెప్పేవాడు . రామదాసకీర్తనలు , నారాయణతీర్ధుల తరంగాలు పాడుతూ తన లోకంలో తా నుండేవాడు
హారతి పళ్ళంలో కానుకలు హుండీలో వేసేవాడు
పిత్రార్జితంగా వచ్చిన పొలం మీద బతుకు బండి లాగుతూ 86వ ఏటికి చేరాడు
కంటిచూపు తగ్గడం వల్ల కొద్దిగ ఇబ్బంది
తనకు ఇదే ఆఖరి జన్మ కావాలని తపన
మంత్రహీనము తంత్రహీనం కాకుండా రాముని కైంకర్యం చేస్తున్నాడు
పరమవైష్ణవుడు కావడం వల్ల సాయుజ్య సామీప్య సాలోక్యగతులలో నమ్మకం గలవాడు
ఐహికవిషయాల స్పృహ తక్కువ
.....।।।।...।।
కంచిలో అత్తి వరదరాజస్వామి దర్శనానికి ఊళ్ళోవాళ్ళు వెళుతూ చలపతిని శ్రమపడి రైలులో తీసుకెళ్లారు
దర్శనం లైన్లో మూడు గంటలు పట్టింది
ఎవరో కుర్రాడు వచ్పి వీపుకు తగిలించుకొని సీనియర్సిటిజన్ లైన్లో దర్శనం చేయించాడు
ఆరాత్రికే రైలు ఎక్కి తిరుగు ప్రయాణం బయలుదేరారు
ఉపవాసమని ఏమీ తినలేదు
అరటిపండు ఇచ్చారు
స్వామి వైపు చూపించి నైవేద్యం పెట్టి చేతి సంచిలో వేసి రేపటికి అన్నాడు. నిద్ర కుపక్రమిస్తూ భగవన్నామస్మరణ చేశాడు
’ నీ అద్భుత దర్శనం సేవించాను స్వామీ! ఈ జన్మ ధన్యం’ అంటూ బర్త్ మీద తలవాల్చాడు
ప్లాట్ ఫారం మీద రైలు ఆగింది
బర్త్ మీద పడుకొన్న చలపతి లేవలేదు
ఏకాదశి ఉపవాసం చేసి నీరసించాడనుకున్నారు
శరీరం చల్లబడిందని కిందికిదించారు