చావు బంధం::శ్రీనివాస భారతి
చావు బంధం::శ్రీనివాస భారతి


"నువ్వుంటే నాకు చాలా ఇష్టం"
"ఎంత?"
"సొంతం చేసుకొనేటంత"
"ఇప్పుడా...?"
"సరికాదు...అయినా మనసులో మాట దాగదుగా
కోరుకోకూడని సమయంలో"
"అవును అయినా మనసు చంపుకోలేక బయటపడ్డా"
"నాకు పెళ్లయింది"
"అవును నాకు పెళ్లే అయింది"
"మరిప్పుడేమిలాంటి కోర్కె?"
"'అదే నాకూ అర్ధం కావడం లేదు"
""నాకు పిల్లలు లేరనా?"
"అయుండొచ్చు"
"నీకు?"
"ఇద్దరు"
"ఎం చేస్తూంటావ్?"
"ఏవో చిన్న చిన్న పనులు"
"సంపాదన సరిపోతోందా?"
"తిండికి బట్టకి లోటు లేకుండా"
"ఈ వయసులో మరేం ప్రేమ నవ్వుతారంతా?"
"నాకూ అదే అంతు పట్టడం లేదు"
"పిల్లలు స్థిరపడ్డారా?"
"పెద్దాడు, చిన్నాడు కంపెనీల్లో, అమ్మాయి పెళ్లికేదిగి ఇంట్లో"
"డబ్బేమన్నా కావాలా?"
"అందుకోసమే ప్రేమ కబుర్లు అంటున్నా ననా?"
"అలాగానెం కాదు..."
"నా ప్రేమలో నిజాయితీ కన్పించలేదా?"
"అవును..నువ్వు ప్రతిరోజూ నాకోసం ఆ సందు చివర మౌనంగా కాపలా కాసే శశిధర్ వి కదూ"
మౌనంగా తలాడించాడు...శశిధర్
"ఎవరో వస్తున్నట్టున్నారు"
"నేను ఆఖరి సారి కన
్పించడం ఇదే...తొందరగా వెళ్ళాలి నేను కూడా..."
దూరంగా రెండు కిలోమీటర్ల అవతల పాడె లేస్తోంది
అపర్ణ కు గతం నీడలు కమ్ముకున్నాయి...
ఆ వయసులో బోలెడు మంది తన వెంట పడేవారు..శశిధర్ మాత్రం మూగ ప్రేమికుల్లా.
చనిపోయి తనకు కనిపించాడు భార్యాపిల్లలున్నా
అంటే...ఇంకా మౌన ఆరాధన ...
అపర్ణ కళ్ళ వెంట ధారాపాతంగా అశ్రువులు.
మెల్లగా నిజం తెలుస్తోంది...ఎవరో వర్కర్ ఫ్యాక్టరీలో
మరుగుతున్న ద్రవం పడి....
అంటే శశిధర్ అన్నమాట...
తన భర్త కర్మాగారం లోనే. చిన్న పని
తెలివైన వాడు చురుకైన వాడు ప్రేమ ధ్యాసలో పడి
బంగారం లాంటి భవిష్యత్తు నాశనం చేసుకున్నాడు.
అంత్యక్రియలు పూర్తి చేసి అందరూ ఇల్లు చేరుకున్నారు..ఓ వర్కర్ ద్వారా సమాచారం.
తెల్లవారింది...
మాధవికి కబురోచ్చింది కలవమని.
కంపెనీ 2 లక్షలు నష్టపరిహారం ఇచ్చింది. అపర్ణ మరో 3 లక్షలు. అమ్మాయి పెళ్లి బాధ్యత కూడా తీసుకొంటూ...
ఇంత ఉదారత అక్కడివారికేవరికీ అర్ధం కాలేదు.
**********************************†
శ్రీనివాస భారతి
.