బద్దలైన గోడ..శ్రీనివాస భారతి
బద్దలైన గోడ..శ్రీనివాస భారతి


"అక్కడికే కదా వైశాలీ
ఎవరెవరొస్తున్నారు
రాహుల్ రాడా
వంశినా. వాడెందుకు వాడుకొని వదిలేసే రకం
అదా... అదీ అంతే అక్కడివిక్కడ ఇక్కడివక్కడ
ప్రవీణ్ ఉన్నాడా
రావట్లేదా...
ఏమైంది
వాళ్ళమ్మ గారికి అనారోగ్యమా
వాడొస్తేనా....ఎంత హ్యాపీనో
రాహుల్ ...వచ్చేలా చూడొచ్చుగా
రాలేనుమరి అంటున్నాడా... ప్లీజ్ నాకోసం ఒక్కసారి ట్రయ్... మళ్ళీ.
అయ్యో...ఫోన్ స్విచ్ ఆఫ్
పోనీ సుధాకరైనా ఉంటే బావుణ్ణు
కృష్ణ మోహన్ వచ్చినా.....
ఇప్పుడెలా
మా ఆయాన్నోప్పించి ఈ కాంప్ కొస్తున్నా
మూడురోజులు సరదాగా గడపవచ్చు
అన్నీ అక్కడే...బిల్ మాత్రం ఆఫీస్ ది."
.....ఫోన్లో మాట్లాడుతూ సునీత చేష్టలు చూస్తూ లోలోపల కోపం సముద్రం అలల్లా తన్నుకొస్తోంది వెంకటేశ్వర్లుకు....
మౌనంగా భోజనం చేయసాగాడు.
మరో రెండు గంటల్లో సునీత ..క్యాంపులో
భోజనం చేసిన పావుగంట కు ఫోనొచ్చింది....ఈసారి ఫోన్ అతడికి.
"లతా... చెప్పు" ఉత్సాహంగా అన్నాడు
"సుమతి వస్తుందిగా
ఆ గెస్ట్ హౌస్ కే
రాణి, మాధురి, లలిత, జ్యోతి, వస్తునట్టేనా
శివా... వాడెందుకు మధ్యలో ఏదీ కానీడు...ప్రభాస్ కూడానా...తోడు దొంగలు
లలిత వస్తే చాలు లోకమే తెలీదు
జ్యోతి మరీనూ కొత్తగా పాత ఎంలేదు..అందరితో భలే చనువుగా......
మా ఆవిడ కూడా కాంప్...నో ప్రాబ్లెమ్.
అన్నీ అక్కడే... బిల్ మాత్రం కిరణ్ దే..."
...ఇద్దరి ఫోన్ల సారాంశం ఇది....
అటుప్రక్క ఎవరన్నదీ ఆప్రస్తుతం.
గంట గడిచింది...ఇద్దరికీ
"వైశాలీ నే రావడం లేదు
పీరియడ్స్ ...సారినే
కుదర్దు... మా అమ్మాయి కూడా వస్తున్నట్టు ఇప్పుడే ఫోన్ చేసింది....
ఈసారికి సారీ...."
ఫోన్ పెట్టేసి పావుగంటయ్యింది
"లతా ..సారి అర్జెంట్ గా బెంగుళూర్ కాంప్ పడింది
వస్తావా...ఇప్పుడొద్దు..మా మామయ్యా వాళ్ళొతో
షేర్ మార్కెట్ బిసినెస్...కోట్ల వ్యవహారం... తప్పదు. మరో సారి ప్లాన్ చేద్దాం."
ఇద్దరి మధ్య వారం రోజుల మౌనం గట్టులు తెగింది.
వారెక్కిన విమానం గోవా వైపు దూసుకుపోతోంది.
*****************%%%%%%%**************