STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

అతి ఆలోచనలు

అతి ఆలోచనలు

1 min
540

ఏమైనా సరే. మంచి జాబ్ కొట్టాలి. అప్పుడు సంతోషంగా ఉంటాను. ఈ సుత్తి జాబ్ నేను చెయ్యలేను. 


అలానే పెళ్లి కూడా జరిగిపోతే. అప్పుడు ఇంకా సంతోషం. హనీమూన్ లో మరింత సంతోషం. అతడికి ఆలోచనల మీద ఆలోచనలు. వాటి కోసం ఆచరణ తక్కువే. వాటిని దృష్టిలో పెట్టుకుని సంతోషంగా ఉండడమే మరచిపోయాడు.


ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్న వికాస్ ఒక్కసారిగా ముందుకు పడ్డాడు. డ్రైవర్ బాగా తాగి నడపడం, ఎదురుగా ఏదో బండి అడ్డంగా రావడంతో సడెన్ బ్రేక్ వేశాడు.


మాంచి స్పీడులో వెళుతున్న బస్సుకు బ్రేక్ పడడంతో ప్రయాణీకులు వారి సీట్ల లోంచి ఎగిరిపడ్డారు.


వికాస్ కూర్చున్న సీటు ముందు భాగంలో ఇనుప రాడ్డు లాంటిది సగం పాడయ్యి మొనదేలి ఉంది. అతడు ఎగిరి పడిన స్పీడుకి ఆ రాడ్డు అతని గొంతుకు గుచ్చుకోవాల్సింది.


అదృష్టవశాత్తూ అతడు ఒళ్ళో పెట్టుకున్న బ్యాగ్ అతనికీ ఆ రాడ్డుకీ మధ్యలో వచ్చింది. మరణాన్ని దగ్గరలో చూసిన అతని ఒళ్ళు కాస్సేపు జలదరించింది.


కాస్సేపటికి డ్రైవర్ ని మార్చి బస్సు బయలుదేరింది. బస్సులో ఉన్న వారికి పెద్దగా గాయాలు అవలేదని నిర్ధారించుకున్న తరువాత అందరూ కాస్త కుడుటపడ్డారు.


నెక్స్ట్ స్టాపు కి చేరే ముందు ఏం జరుగుతుందో తెలియదు. తన ఆలోచనలను పక్కన పెట్టి వికాస్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.


ఊపిరి తీసుకోవడం అతనికి అన్నిటి కంటే సంతోషంగా అనిపించింది.


Rate this content
Log in

Similar telugu story from Abstract