అతడు నేర్చిన పంచతంత్రం
అతడు నేర్చిన పంచతంత్రం
ఈ పుట్టినరోజుకి సాత్విక్ కి ఏ గిఫ్ట్ ఇస్తునావ్? మాధురి నీరజ్ ని అడిగింది.
ఇదిగో అంటూ పంచతంత్రం అనే పుస్తకం చూపించాడు నీరజ్ భార్యకి. ఇదెందుకు అంది మాధురి.
చూడు. నీకే తెలుస్తుంది తర్వాత అన్నాడు.
సాత్విక్ చదివేది ఐదో తరగతి. కానీ అతని మీద వచ్చే కంప్లెయింట్స్ చూస్తే అలా అనిపించదు.
స్కూల్లో తోటి విద్యార్థులను కొట్టడం, బెదిరించడం లాంటివి బాగా అలవాటయ్యాయి. అనుకోకుండా పుట్టినరోజుకి గిఫ్ట్ గా తండ్రి ఇచ్చిన పంచతంత్రం అతడి ఆలోచనా విధానాన్ని చాలా మార్చింది.
అందులోని మిత్ర లాభం, మిత్ర భేదం కథలు అతడి ప్రవర్తన మార్చుకోవాలని నిర్ణయం తీసుకునేలా చేశాయి. మెల్లిగా సాత్విక్ గొడవలు తగ్గించుకోవడం, బుద్ధిగా ఉండడం నేర్చుకున్నాడు.
ఓ రోజు పేరెంట్స్ మీటింగ్ లో..
సాత్విక్ క్లాస్ టీచర్ మాధురిని, నీరజ్ ను అభినందించింది. సాత్విక్ మునుపటిలా గొడవలు పెట్టుకోకుండా అందరితో స్నేహంగా ఉంటున్నాడు అని చెప్పింది. అంతే కాకుండా ఈ మధ్య జరిగిన వ్యాస రచన పోటీలో విజేతగా నిలవడం గురించి కూడా చెప్పింది..
ఈ మార్పు ఎలా సాధ్యం అని అడిగింది క్లాస్ టీచర్..
నీరజ్ మాధురి వైపు చూసి నవ్వాడు.
