అరిషడ్వర్గాలు
అరిషడ్వర్గాలు


ఎడారిలో అతని పయనం సాగుతోంది.
ఆహారం కనిపించింది.అతను ముట్టలేదు.అందమైన స్త్రీ అతని పొందు కోరి నిలిచింది.అతను తనను తాను ఇవ్వలేదు.
అరిషడ్వర్గాలు అతడిని వెంబడించాయి.అతను బెదరలేదు.
నువ్వు గెలవలేవన్నాయి.ప్రయత్నాన్ని మానుకొమ్మన్నాయి.
మాయను సృష్టించాయి.అనవసరపు బంధాల బందిఖానాలో బంధింప చూశాయి.
అతనికి దారిలో ఒక సరస్సు కనిపించింది.అందులోకి దిగాడు.పడిపోయాడు.
అక్కడ కోటి సూర్యుల వెలుగుతో ఉన్న శివ లింగము కనిపించింది.అతడు తన కన్నీటితో అభిషేకించాడు.
ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు.అతని ఆత్మ శివునిలో లీనమైనది.జన్మ మరణముల నుండి విముక్తి పొందినది.