అంతరంగతరంగం
అంతరంగతరంగం


జగపతిరావు కూతురి పెళ్ళి రాడిసన్ హోటల్లో అంగరంగవైభోగంగా జరుగుతోంది
సీఎం వస్తున్నారని సెక్యూరిటీ వాళ్ళ హడావుడి
వేలకొద్ది బంధుమిత్రులు,కాంట్రాక్టర్ లు కానుకలు భారీ ఎత్తున జగపతి కనుసన్నలుపడేలా ఇస్తున్నారు
జగపతి కొక్కతే కూతురు
మరో నెలరోజులలో రిటైరవుతాడు ఇంజనీర్ ఇన్చీఫ్ గా
భారీగా కట్నం ఇచ్చి ముస్సోరీలో శిక్షణ పూర్తి చేసుకొన్న కుర్రాడిని కులాంతరమైనా దర్జాగా పెళ్ళి జరిపించాడు
హనీమూన్ బ్యాంకాక్ పంపాడు కొత్త జంటను
ముఖ్యమంత్రితో ఫోటోలు దినపత్రికల్లో ఘనంగా వచ్చాయి
:::;;;;;;;;;;
ఆ రోజు జగపతి ఢిల్లీ టూర్ వెళ్ళి ఫ్లయిట్ దిగి రాత్రి 10 గంటలకు బంగళా కొచ్చాడు
10 నిముషాల్లో కాలింగ్ బెల్ మోగింది
రెండు కార్లలో ACB అధికారగణం ఇంట్లోకొచ్చి గేట్లు లాక్ చేశారు
16 గంటల సోదా అనంతరం కోట్లాది నిధులతో బాటు జగపతిని కస్టడీలోకితీసుకొన్నారు
జగపతి అంతరంగమధనం చేసుకోసాగాడు
::;;;;;;;;;
‘నేను కుగ్రామంలో నిరుపేదగా పుట్టాను
పిల్ల నిచ్చిన మామగారు బి టెక్ చదివించారు
అసిస్టెంట్ ఇంజనీర్ గా చేరి పైరవీలతో డబ్బు వెదజల్లడంతో
పైపైకి ఎదిగాను
నేను సంపాదించిన మొత్తాలు అందరికీచెందించాను
ఐ ఏ యస్ అల్లుడు కావాలని ముస్సోరీ ప్రదక్షిణాలు చేసి కులాంతర వివాహం కుటుంబాన్ని ఎదిరించి చేశాను
కూతురి మెడలు వంచి మెడలో తాళి కట్టించాను
అన్ని పట్టణాలలో బంగళాలు బినామీ పేర్లతోకొన్నాను
తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోలేదు
సినిమా రీలు లా గతం హెచ్చరించింది
నా జీవనపోరాటంలో ఓడిపోయి చరమాంకంలో కృష్ణజన్మస్థానం పదిలమైంది’
జైలు కొచ్చిన కూతురి ముఖం చూడలేక తలతిప్పుకొని ఏడ్చాను