అందమంటే ఏమిటి?
అందమంటే ఏమిటి?
మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ జరుగుతోంది. టాప్ లో ఉంది మహిత. ఆమె కళ్ళు మతాబుల్లా వెలుగుతున్నాయి.
మీ దృష్టిలో అందమంటే ఏమిటి అని న్యాయ నిర్ణేతలు అడిగారు.
ఇప్పుడు ఆమె చెప్పే సమాధానం ఆమెను గెలుపుకు దగ్గర చేయగలదు.
అందమంటే బాహ్య సౌందర్యం కాదు. అది ఆత్మ సౌందర్యం అంది ఆమె. అందరూ చప్పట్లు కొట్టారు.
తల నుంచి పాదాల దాకా ఎన్నో రకాల క్రీములు వాడుతున్న ఆమె, అందం గురించి చెప్పింది విని ఆమెకు మిస్ ఇండియా కిరీటాన్ని పెట్టారు.
అసలు అందమంటే ఆత్మ సౌందర్యం అయినప్పుడు, ఈ బ్యూటీ క్రీములు ఎందుకు? అసలు అందాల పోటీలు ఎందుకు? నిషా గొణిగింది.
నువ్వు వచ్చింది మిస్ ఇండియా పోటీల గురించి వ్రాయడానికి. విమర్శ చేయడానికి కాదు అంటూ ఆమె బాస్ కర్తవ్యం గుర్తు చేసింది.
